నడుము చుట్టూ కొవ్వు కరగాలంటే ఒక్క టేబుల్ స్పూన్ నెయ్యి చాలు..! ఇలా వాడితే 5 రోజుల్లో మార్పు గ్యారంటీ

|

Jun 12, 2024 | 3:36 PM

నెయ్యిలో ఉండే విటమిన్ ఎ, డి, ఇ, కె మరియు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు కీళ్లకు మేలు చేస్తాయి. అందువల్ల, దీని వినియోగం కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. వాపును తగ్గిస్తుంది. నెయ్యిలోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్‌లు మెదడు ఆరోగ్యాన్ని కాపాడతాయి.

నడుము చుట్టూ కొవ్వు కరగాలంటే ఒక్క టేబుల్ స్పూన్ నెయ్యి చాలు..! ఇలా వాడితే 5 రోజుల్లో మార్పు గ్యారంటీ
Ghee Mixed Water
Follow us on

నెయ్యి.. దాదాపు ప్రతి ఇంట్లో ఉపయోగిస్తుంటారు. ఇది ఆహార రుచిని రెట్టింపు చేసి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రోజూ నెయ్యి తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా చర్మాన్ని తేమగా ఉంచుతుంది. అయితే, మీరు ఎప్పుడైనా వేడి నీళ్లలో నెయ్యి కలుపుకుని తాగారా..? అవును, గోరువెచ్చని నీళ్లలో ఆవు నెయ్యి కలుపుకుని తాగడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ఇది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని సమతుల్యం చేస్తుంది.

ఆవు నెయ్యిలో విటమిన్ ఎ, డి, ఇ ఉన్నాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇది అనేక రకాల ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడటానికి సహాయపడుతుంది. ఆవు నెయ్యిలో ఉండే పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. చర్మాన్ని మృదువుగా, మెరుస్తూ, యవ్వనంగా ఉంచుతుంది. ఆవు నెయ్యిలో సహజసిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది మెదడు మెరుగ్గా పనిచేయడానికి, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

ఆవు నెయ్యిలో బ్యూట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది గట్‌లో ఉండే మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. అలాగే శరీరంలో పేరుకుపోయిన అనవసర కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. ఆవు నెయ్యిలోని యాంటీ-ఆక్సిడెంట్లు శరీరం నుండి విష పదార్థాలను తొలగించడంలో సహాయపడతాయి. తద్వారా శరీరాన్ని లోపల నుండి శుభ్రపరచడం, మంచి పేగు ఆరోగ్యాన్ని కాపాడుకునేలా చేస్తుంది.

ఇవి కూడా చదవండి

నెయ్యిలో ఉండే విటమిన్ ఎ, డి, ఇ, కె మరియు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు కీళ్లకు మేలు చేస్తాయి. అందువల్ల, దీని వినియోగం కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. వాపును తగ్గిస్తుంది. నెయ్యిలోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్‌లు మెదడు ఆరోగ్యాన్ని కాపాడతాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..