ప్యాకేజ్డ్ వాటర్ బాటిల్ నీళ్లు తాగితే…డబ్బిచ్చి రోగాలు కొని తెచ్చుకున్నట్టేనా?

ప్యాక్ చేసిన నీళ్లే... ఇప్పుడు మనం ప్రాణాలు తీసే ప్రమాదం ఉందంటున్నాయి పరిశోధనలు. ఈ క్షణం వరకు అవే సురక్షితం అనుకొని డబ్బిచ్చి మరీ కొనుక్కొని తాగుతున్న నీళ్లు ఇప్పుడు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. కాస్త లోతుల్లోకెళ్లి గణాంకాలను పరిశిలీస్తే.. ఇప్పుడు మనం ఈ ప్యాక్ చేసిన నీళ్ల సీసాలకు పూర్తిగా అలవాటు పడిపోయామన్న విషయం అర్థమవుతుంది. ఈ పరిస్థితుల్లో మనం చెయ్యాల్సిందేంటి?

ప్యాకేజ్డ్ వాటర్ బాటిల్ నీళ్లు తాగితే...డబ్బిచ్చి రోగాలు కొని తెచ్చుకున్నట్టేనా?
Water
Follow us

|

Updated on: Jun 13, 2024 | 12:58 PM

హోటెల్‌కెళ్లి టిఫిన్ చేస్తే వాటర్ బాటిల్ … పెళ్లికెళ్లి భోజనం చేస్తే వాటర్ బాటిల్ …. బస్సులో కావచ్చు.. ట్రైన్లో కావచ్చు… ట్రావెల్ చేస్తే వాటిర్ బాటిల్. సెమినార్లో బాటిల్.. మీటింగ్‌లో వాటర్ బాటిల్… ఎక్కడ చూసినా నీళ్లు తాగాలంటే బాటిల్ ఉండాల్సిందే! పైపెచ్చు.. గ్లాసులో నీళ్లు తాగితే నామోషీ… వాటర్ బాటిల్ సీల్ తీసి నీళ్లు తాగితే గొప్ప. ఈ భావన ఆల్రెడీ మన మైండ్లలో సెటప్ అయిపోయింది.

ఇప్పట్లో దాన్నుంచి బయటపడే పరిస్థితి కూడా కనిపించడం లేదు. అందుకేనేమో… ప్రపంచ వ్యాప్తంగా కేవలం ప్యాకేజ్డ్ వాటర్ బాటిల్ బిజినెస్ సుమారు 21 లక్షల కోట్లకు చేరిపోయింది.

అయితే కొద్ది రోజుల క్రితం కొలంబియా యూనివర్శిటీ, రట్‌గర్స్ యూనివర్శిటీలు సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనలో నివ్వెర పోయే వాస్తవాలు బయటపడ్డాయి. ప్యాకేజ్డ్ వాటర్ బాటిళ్లలో నీళ్లు తాగడం అంటే డబ్బిచ్చి రోగాలు కొని తెచ్చుకోవడమేనని తేల్చారు. ప్రతి లీటర్ నీటిలో  సుమారు 2 లక్షల 40 వేల నానో ప్లాస్టిక్ కణాలు ఉంటాయని తేల్చారు. నిజానికి ఇవి గతంలో ఊహించిన వాటికన్నా సుమారు 10 నుంచి 100 రెట్లు ఎక్కువ. వీరి పరిశోధన అమెరికాకు చెందిన నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో ప్రచురితమైంది.

ఏమిటీ నానో ప్లాస్టిక్స్?

నానో ప్లాస్టిక్స్ అంటే అత్యంత సూక్ష్మమైన ప్లాస్టిక్ రేణువులు. కంటికి ఏ మాత్రం కనిపించకుండా నీటిలో కరిగిపోయే ఈ నానో ప్లాస్టిక్ రేణువుల వల్ల తీవ్ర మైన అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. రక్తంలో సులువుగా కలిసిపోతాయి. మన అవయవాలను, రోగనిరోధక శక్తిని, సంతానోత్పత్తి సామర్థ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదం ఉంది. గుండెకు కూడా ఈ నానోప్లాస్టిక్ రేణువుల వల్ల ముప్పుందన్నది వైద్యుల హెచ్చరిక.

నానో ప్లాస్టిక్ రేణువులు

నానో ప్లాస్టిక్ రేణువులు

నిజానికి నిన్న మొన్నటి వరకు ఈ దిశగా పరిశోధనలు పెద్దగా జరగలేదు. కానీ ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకీ పెరుగుతున్న ప్యాకేజ్డ్ వాటర్ బాటిళ్ల వినియోగంతో ఆ దిశగా శాస్త్రవేత్తలు పరిశోధనలు నిర్వహించారు. అందులో భాగంగా అమెరికాలోని 3 ప్రముఖ కంపెనీల వాటర్ బాటిళ్లలోని నీటిని పరిశీలించినప్పుడు ఈ వాస్తవాలు బయటపడ్డాయి.

అంత ప్రమాదమా?

సాధారణంగా ఓ ప్లాస్టిక్ వాటర్ బాటిల్ తయారీనికి 1.5 నుంచి 3 లీటర్ల నీటిని అలాగే సుమారు పావు లీటర్ క్రూడాయిల్‌ను వినియోగిస్తారు. వాటితో పాటు మైక్రో ప్లాస్టిక్ పొడి కూడా కలుపుతారు. ఈ సూక్ష్మమైన పొడి రేణువులతో కూడిన బాటిల్లో నీటిని నిల్వ చేస్తే చాలా సులభంగా ఆ పొడిలోని నానో ప్లాస్టిక్ రేణువులు నీటిలో కలిసిపోతాయి. ముఖ్యంగా ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న చోట ఈ ప్రక్రియ మరింత సులభంగా జరిగిపోతుంది. తాజాగా జరిగిన పరిశోధనల ప్రకారం ఓ ప్లాస్టిక్ నీళ్ల సీసాలో  పాలి అమైడ్, పాలీ ఇథలీన్ టెరఫ్తలేట్, పాలీ వినైల్ క్లోరైడ్, పాలీ మిథైల్ మెథాక్రిలేట్లతో పాటు చాలా సూక్ష్మాతి సూక్ష్మమైన రేణువులు గుర్తించి, వాటిపై పరిశోధనలు చేశారు. ఆ పరిశోధనల్లో ఈ ప్లాస్టిక్ సూక్ష్మరేణువులు మనిషి శరీరంపై చూపే ప్రభావం గురించి తెలుసుకొని తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ముఖ్యంగా ఇలాంటి నీటిని తాగితే క్యాన్సర్లు, కిడ్నీ, కాలేయ వ్యాధులు, మధుమేహంల ప్రమాదంతో పాటు బరువు పెరిగే ప్రమాదం కూడా ఉందని తేలింది. ముఖ్యంగా గర్భం దాల్చిన మహిళలు ఈ నీళ్లను ఎక్కువగా తాగితే ఆ ప్రభావం పుట్టబోయే బిడ్డపై కూడా ఉంటుందన్నది వారి రీసెర్చ్‌లో వెల్లడయ్యింది. మరీ ముఖ్యంగా ఆడపిల్లలు చిన్న వయసులోనే రజస్వల కావడానికి ఈ బాటిళ్లలో నీటి వినియోగం కూడా ఒక కారణమట.

ప్యాకేజ్డ్ వాటర్ బోటిల్ నీళ్లలో నానో ప్లాస్టిక్

ప్యాకేజ్డ్ వాటర్ బోటిల్ నీళ్లలో నానో ప్లాస్టిక్

పదేళ్లలో వినియోగం ఎలా పెరిగింది?

గడిచిన పదేళ్ల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్ వాటర బాటిళ్ల వినియోగం ఏకంగా 70 శాతానికి పైగా పెరిగింది. అత్యంత వేగంగా విస్తరిస్తున్న మార్కెట్లలో ఇది కూడా ఒకటి. అందుకు నిదర్శనం కొన్నేళ్ల క్రితం వరకు ప్లాస్టిక్ వాటర్ బాటిల్ నీళ్లు కొనుక్కొని తాగడం కేవలం సంపన్నులకు మాత్రమే పరిమితమై ఉండేది. కానీ ఇప్పుడు ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చేశాయి. చిన్న చిన్న పట్టణాల్లో కూడా ప్యాకేజ్డ్ వాటర్ ప్లాంట్లు కనిపిస్తున్నాయి.

10 ఏళ్లలో 70% పెరిగింది

10 ఏళ్లలో 70% పెరిగింది

జర్మనీకి చెందిన ప్రముఖ డేటా విశ్లేషణ సంస్థ  స్టాటిస్టా అందించిన వివరాల ప్రకారం 2023లో ప్రపంచ వ్యాప్తంగా సుమారు 28 లక్షల కోట్ల రూపాయల ప్లాస్టిక్ బాటిళ్ల నీటి వ్యాపారం జరిగింది. వచ్చే ఆరేళ్లలో అంటే 2030 నాటికి ఇది ఏకంగా 40 లక్షల కోట్ల నుంచి 42 నుంచి 43 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.  ప్రపంచ వ్యాప్తంగా చూస్తే అమెరికా, చైనా, మెక్సికో ఇండోనేషియా తదితర దేశాల్లో అధిక వినియోగం కనిపిస్తోంది.

ఇండియాలో పరిస్థితేంటి?

ఇక మన దేశంలోనూ కొన్నేళ్లుగా వాటర్ బాటిల్ సంస్కృతి పెరిగిపోతుండటం తీవ్ర ఆందోళన కల్గించే విషయం.  2022లో మన దేశంలో ప్యాకేజ్డ్ వాటర్ బాటిల్స్ మార్కెట్ వ్యాపారం విలువ సుమారు లక్ష 80 వేల కోట్లు , మరో ఆరేళ్లలో ఈ మార్కెట్ విలువ సుమారు 3లక్షల కోట్లకు చేరుకోవచ్చని అంచనా.

ఇండియాలో వాటర్ బాటిళ్ల వినియోగం

ఇండియాలో వాటర్ బాటిళ్ల వినియోగం

నిమిషానికి 10 లక్షల వాటర్ బాటిళ్ల అమ్మకం

ప్రపంచ వ్యాప్తంగా ప్రతి నిమిషానికి సుమారు 10 లక్షల వాటర్ బాటిల్స్ అమ్ముడుపోతున్నాయి. ఈ సీసాల తయారీలో వినియోగించే ఏ పదార్థం ఈ పర్యావరణానికి మాత్రమే కాదు..మనుషులకు కూడా మంచిది కాదు. ఈ డిస్పోజబుల్ వాటర్ బాటిల్స్ కారణంగా ఏటా 4 నుంచి 4.5 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైజ్ వాతావరణంలోకి రిలీజ్ అవుతోంది.  ఇక మన దేశంలో చూస్తే కొన్నాళ్ల క్రితం కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్రయాదవ్ చెప్పిన మాటల్లో చూస్తే ఇండియాలే ఏటా సుమారు 35లక్షల టన్నులకుపైగా ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి.  గడిచిన ఐదేళ్ల కాలంలో ఈ వ్యర్థాలు దాదాపు రెట్టింపయ్యాయి. ఫలితంగా నదులు, సముద్రాలు, కాల్వలు, చివరకు డ్రైనేజీ వ్యవస్థ కూడా ప్లాస్టిక్ వ్యర్థాలతో, ప్లాస్టిక్ బాటిళ్లతో నిండిపోతున్నాయి.

2030 నాటికి రూ.43 లక్షల కోట్ల వ్యాపారం

2030 నాటికి రూ.43 లక్షల కోట్ల వ్యాపారం

ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లను తాగడం వల్ల ప్రధానంగా రోగ నిరోధక శక్తి తగ్గిపోయే ప్రమాదం ఉందని ఈ కథనం ప్రారంభంలో చెప్పుకున్నాం. అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ కూడా అదే విషయాన్ని తన వెబ్ సైట్లో పేర్కొంది. ముఖ్యంగా హెచ్ఐవీ, డయాబెటిస్, అవయవమార్పిడి చేసుకున్న రోగులు, కిమోథెరపీ చేయించుకుంటున్నవారు ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు తాగడం అత్యంత ప్రమాదకరం అని హెచ్చరిస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో ప్యాకేజ్డ్ వాటర్ బాటిల్‌లో నీళ్లు తాగాల్సి వస్తే కచ్చితంగా తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.

నిజానికి ఈ నీళ్లతో పోల్చితే శుభ్రపరిచిన కుళాయి నీళ్లు చాలా మంచివని అనేక పరిశోధనల్లో తేలింది. కానీ గడిచిన పదేళ్ల కాలంలో మంచి నీళ్లు అంటే ప్యాకేడ్జ్ వాటర్ అన్న భావన చాలా బలంగా జనంలో పెరిగిపోయింది.  కానీ తాజా పరిశోధనలు చెబుతున్న వాస్తవాలు వేరు.

గతంలో మన అలవాట్లు ఎలా ఉండేవి?

నిజానికి ఇటీవల కాలంలో అంటే 19వ శతాబ్దపు అర్థభాగంలో వివిధ ప్రాంతాల గురించి, ఆయా ప్రాంతాల్లో సౌకర్యాల గురించి, అలాగే అక్కడి ఆచారాలు, సంప్రదాయాల అన్యాపదేశంగా చర్చించిన పుస్తకం ఏనుగుల వీరాస్వామయ్య రాసిన కాశీ యాత్రా చరిత్ర. నిజానికి ఇది తెలుగునాట గ్రంథస్థం చేసిన తొలి యాత్రా చరిత్ర. 1830-31 మధ్య కాలంలో సుమారు 15 నెలల పాటు నాటి చెన్నపట్టణం నేటి చెన్నై నుంచి కాశీ వరకు చేసిన ప్రయాణ విశేషాలు. ఇందులో ఆయన నాటి ప్రయాణ అనుభవాల గురించి చెబుతూనే.. మార్గ మధ్యంలో ఎక్కెడెక్కడ ఏ ఏ సౌకర్యాలున్నాయో కూడా చెప్పుకొచ్చారు. ముఖ్యంగా దాదాపు 194 ఏళ్ల క్రితం మాట ఇది.  దారిలో సత్రాల గురించి, నీటి సౌకర్యాల గురించి, మరీ ముఖ్యంగా తాగు నీటి విషయం వచ్చేసరికి కచ్చితంగా మంచినీటి గుంట అంటూ ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ వచ్చారు. నాటి కాలంలో జమిందారులు, భూస్వాములు, తమ కుటుంబీకుల పేరిట మార్గ మధ్యంలో సత్రాలు, తాగు నీటి సౌకర్యాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేయించే వారు. తాగు నీటి బావులు ఎక్కడికక్కడ తవ్వించే వారు. అదీగాక నాటి గ్రామాలలో ఇలా సుదీర్ఘ యాత్రలు చేసేవారు ఎవరైనా వచ్చినా ఆయా గ్రామాల పెద్దలు వారికి తగిన వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసి అతిథి మర్యాదలు చేసే అలవాటు సర్వసాధారణం. ఇక తాగు నీటి విషయానికి వస్తే బావులు, చెరువులు, నదులు.. ఇవన్నీ నాటి పరిస్థితుల ప్రకారం తాగునీటికి అనువుగానే ఉండేవి.

అప్పట్లో ఈ సీసాల్లేవు

అప్పట్లో  తాగు నీటిని తీసుకెళ్లే

తోలు సంచులు, వెదురు సీసాలు

కాలుష్యానికి చాలా దూరంగా ఉండటం వల్ల వాటినే చాలా వరకు తాగే వారు. ఇక మరీ నీటి ఎద్దడి సమయంలో ప్రయాణాలు చేసేటప్పుడు కచ్చితంగా తోలు సంచుల్లో నీటిని పట్టుకొని తీసుకెళ్లేవారు. నాటి కాలంలో ప్రయాణాలు చేసే వారికి తాగనీటిని దాచుకునేందుకు అవే ఆధారం. ఆ తర్వాత కాలంలో రబ్బరు సంచుల వాడకం కూడా ఉండేది. వెదురు బొంగుల్ని నీటి నిల్వ డబ్బాలుగా మార్చుకొని వాటిలో కూడా కొన్ని ప్రాంతాలలో నీటని తీసుకెళ్లేవారు. తర్వాత.. తర్వాత లోహపు వస్తువుల వాడకం మొదలైన తర్వాత ప్రయాణాల్లో తాగునీటిని తీసుకెళ్లడం మరింత సులభమైంది. మరచెంబుల వాడకం అప్పట్లోనే మొదలయ్యింది. కాస్త డబ్బున్న వారు మరచెంబును చేతపట్టుకొని తీసుకెళ్లడం ద్వారా కూడా తమ దర్పాన్ని ప్రదర్శించడం కొన్నేళ్ల క్రితం వరకు సర్వసాధారణం. నీరు తొణికిపోకుండా మర మూతతో ఉంటుంది. స్టీలు, ఇత్తడి, కంచు లోహాలతో తయారై ఉండేది. తెలుగు నాట నాలుగు పదుల వయసులో ఉన్న వారికి మర చెంబు గురించి ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సినవసరం లేదు.  తర్వాత కాలంలో గాజు సీసాల వాడకం మొదలయ్యింది. ఇక ప్లాస్టిక్ యుగం పూర్తి స్థాయిలో మొదలైన తర్వాత నీటిని ప్లాస్టిక్ సీసాలతో తీసుకెళ్లడం సర్వసాధారణంగా మారింది. నీటిని కొనుక్కోవడమంటే ఓ 20 ఏళ్ల క్రితం వరకు దేశంలో చాలా విచిత్రంగా చూసేవారు. కానీ గడిచిన దశాబ్ద కాలంలో అది చాలా మాములు విషయంగా మారిపోయింది. ఓ రకంగా చెప్పాలంటే ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బాటిల్ యుగం మొదలైన తర్వాత మొదట్లో దాన్ని తమ డాబు, దర్పానికి ప్రతీకగా చూపించేవారు. కానీ రాను రాను… మంచినీళ్లకు పర్యాయపదం ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బాటిల్‌గా మారిపోయింది. కానీ తాజా పరిశోధనలు మాత్రం.. మళ్లీ బ్యాక్ టు బేసిక్స్ అని చెబుతున్నాయి. మరి అందుకు మనం సిద్ధంగానే ఉన్నామా..?

మరిన్ని ప్రీమియం వార్తల కోసం

తల్లిని కావాలనుకున్నాను !! అమితాబ్ ఒకప్పటి ప్రియురాలి ఆవేదన
తల్లిని కావాలనుకున్నాను !! అమితాబ్ ఒకప్పటి ప్రియురాలి ఆవేదన
పొట్టి బట్టలతో బరితెగించావంటూ తిట్లు.. దిమ్మతిరిగే ఆన్సర్
పొట్టి బట్టలతో బరితెగించావంటూ తిట్లు.. దిమ్మతిరిగే ఆన్సర్
చరిత్ర సృష్టించిన షారుఖ్.. తొలి భారతీయ నటుడిగా అరుదైన గౌరవం
చరిత్ర సృష్టించిన షారుఖ్.. తొలి భారతీయ నటుడిగా అరుదైన గౌరవం
ఇది హీరోతనం అంటే !! చేతులెత్తి మొక్కేలా చేసుకున్న బెల్లంకొండ బాబు
ఇది హీరోతనం అంటే !! చేతులెత్తి మొక్కేలా చేసుకున్న బెల్లంకొండ బాబు
సినిమాలు తీస్తూనే ఉంటా.. ఏమైనా చేసుకోండి.. విశాల్
సినిమాలు తీస్తూనే ఉంటా.. ఏమైనా చేసుకోండి.. విశాల్
బంగారం ధరల్లో కొత్త విధానం.. కేంద్రం నూతన పాలసీ!
బంగారం ధరల్లో కొత్త విధానం.. కేంద్రం నూతన పాలసీ!
రూ. 8వేలలో అదిరిపోయే ఫీచర్స్‌.. వివో నుంచి కొత్త ఫోన్‌ వచ్చేసింది
రూ. 8వేలలో అదిరిపోయే ఫీచర్స్‌.. వివో నుంచి కొత్త ఫోన్‌ వచ్చేసింది
విజయ్ దేవరకొండ తల్లితో కలిసి రష్మిక నటించిన సినిమా ఏంటో తెలుసా..?
విజయ్ దేవరకొండ తల్లితో కలిసి రష్మిక నటించిన సినిమా ఏంటో తెలుసా..?
'బి' టౌన్ లో టాలీవుడ్ సినిమాలు జోరు.. మిలియన్ల కొద్దీ వ్యూస్
'బి' టౌన్ లో టాలీవుడ్ సినిమాలు జోరు.. మిలియన్ల కొద్దీ వ్యూస్
పులస పుట్టుక ఎంత విచిత్రమైనదో.. దాని రుచి అంత అమోఘం..
పులస పుట్టుక ఎంత విచిత్రమైనదో.. దాని రుచి అంత అమోఘం..
తల్లిని కావాలనుకున్నాను !! అమితాబ్ ఒకప్పటి ప్రియురాలి ఆవేదన
తల్లిని కావాలనుకున్నాను !! అమితాబ్ ఒకప్పటి ప్రియురాలి ఆవేదన
పొట్టి బట్టలతో బరితెగించావంటూ తిట్లు.. దిమ్మతిరిగే ఆన్సర్
పొట్టి బట్టలతో బరితెగించావంటూ తిట్లు.. దిమ్మతిరిగే ఆన్సర్
చరిత్ర సృష్టించిన షారుఖ్.. తొలి భారతీయ నటుడిగా అరుదైన గౌరవం
చరిత్ర సృష్టించిన షారుఖ్.. తొలి భారతీయ నటుడిగా అరుదైన గౌరవం
ఇది హీరోతనం అంటే !! చేతులెత్తి మొక్కేలా చేసుకున్న బెల్లంకొండ బాబు
ఇది హీరోతనం అంటే !! చేతులెత్తి మొక్కేలా చేసుకున్న బెల్లంకొండ బాబు
వాతావరణ శాఖ హెచ్చరిక.. ఈ ప్రాంతాల్లో ఈదురుగాలులతో అతిభారీ వర్షాలు
వాతావరణ శాఖ హెచ్చరిక.. ఈ ప్రాంతాల్లో ఈదురుగాలులతో అతిభారీ వర్షాలు
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.