డయాబెటిస్‌ రోగులకు వరం ఈ గింజలు.. డైలీ తిన్నారంటే మహమ్మారికి ఛూమంత్రం వేసినట్లే..

ప్రస్తుత కాలంలో డయాబెటిస్ సర్వసాధారణ సమస్యగా మారింది.. మునుపటి కాలంలో మధుమేహం సాధారణంగా 40-45 సంవత్సరాల తర్వాత వచ్చేది. కానీ ఈ రోజుల్లో పిల్లలు, వృద్ధులు, యువకులు అన్ని వయసుల వారు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఎవరికైనా ఒకసారి ఈ వ్యాధి వచ్చినట్లయితే.. అది జీవితాంతం విడిచిపెట్టదు..

డయాబెటిస్‌ రోగులకు వరం ఈ గింజలు.. డైలీ తిన్నారంటే మహమ్మారికి ఛూమంత్రం వేసినట్లే..
Lotus Seeds For Diabetes
Follow us

|

Updated on: Jun 13, 2024 | 10:31 AM

ప్రస్తుత కాలంలో డయాబెటిస్ సర్వసాధారణ సమస్యగా మారింది.. మునుపటి కాలంలో మధుమేహం సాధారణంగా 40-45 సంవత్సరాల తర్వాత వచ్చేది. కానీ ఈ రోజుల్లో పిల్లలు, వృద్ధులు, యువకులు అన్ని వయసుల వారు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఎవరికైనా ఒకసారి ఈ వ్యాధి వచ్చినట్లయితే.. అది జీవితాంతం విడిచిపెట్టదు.. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు ఇప్పటివరకు దీనికి నివారణ మందులను కనుగొనలేకపోయారు. భారతదేశంలో డయాబెటిస్‌తో బాధపడుతున్న వారి సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది.. కాబట్టి ప్రతి ఒక్కరూ దాని గురించి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు..

మధుమేహానికి వరం తామరపువ్వు విత్తనం..

డయాబెటిక్ రోగులు వారి జీవనశైలి, ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేకపోతే రక్తంలో చక్కెర స్థాయి పెరగవచ్చు.. దీంతో మూత్రపిండాల వ్యాధి, గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని చాలా వరకు నిర్వహించగల కొన్ని ఇంటి నివారణలు ఉన్నాయి.. వాటిలో తామర విత్తనాలు అద్భుతమని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. తామర పువ్వు విత్తనాల సహాయంతో డయాబెటిస్ ను ఎలా అదుపులో ఉంచుకోవచ్చో ఇప్పుడు తెలుసుకోండి..

వాస్తవానికి తామర పువ్వు విత్తనంలోని ఔషధగుణాలు మధుమేహ రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీని సహాయంతో రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించవచ్చు.

ముఖ్యంగా డయాబెటిక్ రోగులు ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.. అలాంటి వాటిల్లో తామర గింజలు పోషకమైన ఆహారం కంటే తక్కువ కాదని పేర్కొంటున్నారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ పువ్వు విత్తనాలను వీలైనంత ఎక్కువగా తీసుకోవడం చాలా ముఖ్యమంటున్నారు.

తామర విత్తనాలు ఎందుకు ముఖ్యమైనవి..?

తామర గింజలలో చాలా పోషకాలు దాగున్నాయి. ఇందులో విటమిన్ బి6, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, ప్రొటీన్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి మధుమేహంలో చాలా ప్రభావవంతంగా ఉంటాయి.. గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించగలవు. తామర విత్తనాలు క్రమం తప్పకుండా తింటే అధిక రక్తపోటును కూడా నియంత్రించవచ్చు.

భారతీయ సంస్కృతిలో తామర పువ్వును పవిత్రంగా పరిగణిస్తారు.. దీనిని పూజకు ఉపయోగిస్తారు. ఈ పువ్వు మూలాల నుంచి రుచికరమైన కూరను కూడా తయారు చేస్తారు. రుచికరమైన దీనిని ప్రజలు ఆస్వాదిస్తూ తింటారు. బురదలో పెరిగే ఈ పూలను అలంకరణకు కూడా ఉపయోగిస్తారు. అయితే.. మీ ఇంటి దగ్గరలో చెరువు లేకుంటే.. పెద్ద కుండీలో ఇళ్లల్లో కూడా ప్రత్యేక పద్ధతిలో పెంచుకోవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..