
చిలగడదుంప (Sweet Potato) మన సంప్రదాయ ఆహారాల్లో ఒక ముఖ్యమైన దుంప రకం కూరగాయ. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉపయోగించే ఈ చిలగడదుంప ప్రస్తుతం పట్టణాల్లో కూడా ఆరోగ్య ఆహారంగా గుర్తింపు పొందుతోంది. చాలామంది కేవలం ఇది సీజనల్ ఫుడ్ అనుకుంటారు. కానీ, ఇప్పుడు ఇది అన్ని సీజన్లలో మనకు దొరుకుతుంది. ఇందులో శరీరానికి కావాల్సిన ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. రుచికరంగా ఉండటమే కాకుండా, అనేక పోషకాలు కలిగి ఉండటం వల్ల దీన్ని “సూపర్ ఫుడ్”గా కూడా పిలుస్తున్నారు. చిలగడదుంపలో ఉండే బీటా-క్యారోటిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. మన శరీరంలోకి వెళ్ళాక విటమిన్ ఏ గా మారుతుంది. ఇది కంటి చూపును కాపాడటమే కాకుండా, చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచడంలో సహాయపడుతుంది.
చిలగడదుంపలో విటమిన్ A, విటమిన్ C, విటమిన్ B6, ఫైబర్, పొటాషియం, మ్యాగ్నీషియం వంటి ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ఉండే బీటా కెరోటిన్ శరీరంలో విటమిన్ Aగా మారి కళ్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది తక్కువ కొవ్వు, తక్కువ కాలరీలతో కూడిన సహజ ఆహారం. చిలగడదుంపను ప్రతి రోజూ తినటం వల్ల నెమ్మదిగా శరీరానికి శక్తిని అందిస్తుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగవు. ఎక్కువ సేపు పని చేసే వారికి, త్వరగా అలసిపోయేవారికి ఇది మంచి పోషకాహారం. ఇందులో ఫైబర్ (పీచు) ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడేవారికి చిలగడదుంప ఒక న్యాచురల్ రెమెడీలా పనిచేస్తుంది.
చిలగడదుంపలో ఉండే పొటాషియం గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది రక్తపోటును అదుపులో ఉంచడంలో తోడ్పడుతుంది, తద్వారా గుండె సంబంధిత సమస్యల ముప్పు తగ్గుతుంది. దీన్ని డీప్ ఫ్రై చేయడం కంటే ఉడికించి లేదా బేక్ చేసి తీసుకోవడం ఉత్తమం. ఇలా చేయడం వల్ల అందులోని పోషకాలు వృథా కాకుండా శరీరానికి అందుతాయి.
ఇన్ని ప్రయోజనాలు కలిగిన చిలగడ దుంపలు అందరికి పరిపడవు. కిడ్నీ సమస్యలు ఉన్నవారు, పొటాషియం ఎక్కువగా ఉండే చిలగడదుంపను పరిమితంగా తీసుకోవాలి. అలాగే డయాబెటిస్ ఉన్నవారు రక్తంలో చక్కెర స్థాయిలను దృష్టిలో ఉంచుకుని మోతాదులో మాత్రమే తినాలి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..