
దాదాపు ప్రతి ఇంట్లోనూ ప్రెషర్ కుక్కర్లు వాడుతారు. అన్నం వండటం నుంచి సాంబారు తయారీ వరకు త్వరగా వంట పూర్తి చేయడానికి, సమయం, గ్యాస్ ఆదా చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. కానీ వంట ప్రక్రియ త్వరగా పూర్తవుతుందని కుక్కర్‌లో అన్ని రకాల ఆహారాలను వండటం సరైనది కాదు. అవును.. కుక్కర్‌లో కొన్ని ఆహార పదార్థాలను వండటం వల్ల వాటి పోషకాలు నాశనమవుతాయి. అలాంటి ఆహారాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. అందువల్ల ఈ రకమైన ఆహారాలను ప్రెషర్ కుక్కర్‌లో వండకూడదు. అవి ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
సాధారణంగా చాలా మంది కుక్కర్‌లో బియ్యం వండుతారు. కానీ బియ్యాన్ని ఎప్పుడూ కుక్కర్‌లో వండకూడదు. ఎందుకంటే ఇలా కుక్కర్‌లో బియ్యం వండడం వల్ల ఆర్సెనిక్ అనే విష పదార్థం విడుదల అవుతుంది. ఇది మన ఆరోగ్యానికి హానికరం. కాబట్టి ఓపెన్ పాత్రలో మాత్రమే బియ్యం వండటం మంచిది.
పాలకూర, మెంతులు, కొల్లార్డ్ ఆకుకూరలు వంటి ఆకుకూరలను ప్రెజర్ కుక్కర్‌లో ఉడికించడం వల్ల వాటి పోషకాలు నశించి, మూత్రపిండాల్లో రాళ్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి వాటిని సాధారణ పాన్‌లో తక్కువ వేడి మీద ఉడికించడం మంచిది.
బీన్స్‌లో లెక్టిన్ అనే సహజంగా లభించే టాక్సిన్ ఉంటుంది. ఇది సరిగ్గా ఉడికించకపోతే జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. ఫుడ్ పాయిజనింగ్‌కు కూడా కారణమవుతుంది. అలాగే, ప్రెషర్ కుకింగ్ బీన్స్‌లోని లెక్టిన్‌ను వేగంగా విచ్ఛిన్నం చేస్తుంది. ఇది జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి ఈ కూరగాయలను ప్రెజర్ కుక్కర్‌లో ఉడికించడం మంచిది కాదు.
ప్రెషర్ కుక్కర్‌లో పాలు మరిగించడం వల్ల దాని సహజ నిర్మాణం మారి అది పెరుగులా మారుతుంది. తద్వారా దాని పోషక విలువలు తగ్గుతాయి. పాలు మరిగించడానికి స్టీల్ లేదా నాన్-స్టిక్ పాన్ ఉత్తమం.
టమోటాలు, చింతపండు లేదా పుల్లని పదార్థాలను ప్రెషర్ కుక్కర్‌లో ఉడికించడం వల్ల అవి ఆమ్లంగా మారతాయి. ఇది శరీరానికి హానికరం. కాబట్టి వాటిని స్టీల్ లేదా మట్టి పాత్రలో ఉడికించడం మంచిది.
బీన్స్, కొన్ని ధాన్యాలు సహజ విష పదార్థాలను కలిగి ఉంటాయి. వీటిని ప్రెజర్ కుక్కర్‌లో పూర్తిగా తొలగించలేం. కాబట్టి, వాటిని రాత్రంతా నానబెట్టి ఆపై తక్కువ వేడి మీద ఓపెన్ పాత్రలో ఉడికించడం ఆరోగ్యకరమైనది.
బంగాళాదుంపలను ప్రెజర్ కుక్కర్‌లో ఉడికించడం వల్ల వాటిలోని పిండి పదార్థాలు త్వరగా విచ్ఛిన్నమవుతాయి. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. అందువల్ల, వాటిని పాన్‌లో ఉడికించడం ఉత్తమం.
మరిన్ని లైఫ్‌స్టైల్ కథనాల కోసం క్లిక్ చేయండి.