Meal Maker: మీల్‌ మేకర్స్‌ తినేముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

|

Mar 16, 2023 | 6:43 PM

సోయా చంక్స్‌ను మీల్‌ మేకర్స్‌ అని కూడా అంటారు. సోయా పిండితో వీటిని తయారు చేస్తారు అందువల్లనే వీటిని సోయా చంక్స్ అంటారు. మీల్‌ మేకర్స్‌ను తయారు చేసే క్రమంలో సోయా గింజల నుంచి తొలుత ఆయిల్‌ను..

Meal Maker: మీల్‌ మేకర్స్‌ తినేముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
Meal Maker
Follow us on

సోయా చంక్స్‌ను మీల్‌ మేకర్స్‌ అని కూడా అంటారు. సోయా పిండితో వీటిని తయారు చేస్తారు అందువల్లనే వీటిని సోయా చంక్స్ అంటారు. మీల్‌ మేకర్స్‌ను తయారు చేసే క్రమంలో సోయా గింజల నుంచి తొలుత ఆయిల్‌ను వేరుచేస్తారు. తర్వాత మిగిలిపోయిన పిండిని మీల్ మేకర్స్‌ తయారీకి వినియోగిస్తారు. దీనిలో కూడా పోషకాలు అధికంగానే ఉంటాయి. దీనిలో కొవ్వు ఉండదు. దీన్ని వెజిటేరియన్ మీట్ అని పిలుస్తారు. కొన్ని చోట్ల సోయా మీట్ అని కూడా పిలుస్తారు. వీటిని వెజ్‌ బిర్యానీలో వేస్తే మటన్‌ రుచికి సరిపోలుతుంది. వీటితో చేసిన వంటకాలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అందువల్లనే మటన్‌కు ప్రత్యామ్నాయంగా మీల్‌ మేకర్స్‌ను వంటకాల్లో వినియోగిస్తుంటారు. వీటిని తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలను నియంత్రించి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచేందుకు దోహదపడతాయి.

సోయాబీన్స్‌లో ఆమెనో యాసిడ్స్ పుష్కలంగా ఉండటం రక్తపోటును కూడా సులభంగా నియంత్రిస్తాయి. గుండెజబ్బులు, క్యాన్సర్లు వంటి వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించే లక్షణం కలిగి ఉంటాయి. వీటిలో ప్రోటీన్లు అధికంగా ఉండటం వల్ల మాంసాహారం తినని వారికి ఇది ఉత్తమ ఎంపిక. దీనిలో ఫైబర్‌ కంటెంట్‌ అధికంగా ఎక్కువగా ఉంటుంది. మధుమేహం ఉన్న వారు కూడా వీటిని తినవచ్చు. వీటిని తింటే చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదపడుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సమాచారం కోసం క్లిక్‌ చేయండి.