White Sugar: చాలా కాలం క్రితం మహాత్మా గాంధీ చక్కెరను ‘స్వీట్ పాయిజన్’ అని పిలిచాడు. తెల్ల చక్కెర అంటే ప్రాసెస్ చేసిన తర్వాత బయటకు వచ్చిన చక్కెర అని అర్థం. ఇందులో అనేక రకాల రసాయనాలు కలిసి ఉంటాయి. అందువల్ల వైద్య నిపుణులు దీనిని చాలా ప్రమాదకరమైనదిగా పరిగణిస్తారు. పిల్లలు తరచుగా శీతల పానీయాలు, చాక్లెట్ లేదా ఐస్ క్రీం వంటి వాటిని డిమాండ్ చేస్తే వారించండి. ఎందుకంటే వీటన్నిటిలో తెల్ల చక్కెర ఉపయోగిస్తారు. దీనివల్ల పిల్లలు డిప్రెషన్‌కి బాధితులు అవుతున్నారు.
పిల్లలకు చాక్లెట్ ఐస్ క్రీమ్ ఇవ్వవద్దు
చెరకు నుంచే తెల్ల చక్కెర తయారవుతుంది కానీ అది అనేక రకాల రసాయన ప్రక్రియల ద్వారా మారుతుంది. అయితే తెల్లదనం కారణంగా ఇది చాలా మందికి నచ్చింది. కానీ ఇందులో మినరల్స్, ఐరన్ వంటి పోషకాలు ఉండవు. ఇది కొద్దిగ వాడిన చాలా తీపిగా ఉంటుంది. తెల్ల షుగర్ వాడటం వల్ల పిల్లల దంతాలు దెబ్బతింటాయి. ఇందులో ఉండే కాల్షియం, భాస్వరంపై దీని ప్రభావం అధికంగా ఉంటుంది. తెల్ల చక్కెర మీ పిల్లల బరువును కూడా పెంచుతుంది. ఇందులో ఉండే రసాయనాలు, కార్బోహైడ్రేట్ల కారణంగా పిల్లలపై చెడు ప్రభావం ఉంటుంది.
అధిక మొత్తంలో ప్రాసెస్ చేయబడిన చక్కెర పిల్లలను శారీరకంగా బలహీనపరుస్తాయి. చక్కెర ఎక్కువగా వాడటం వల్ల పిల్లలు డిప్రెషన్‌తో బాధపడతారు వారి ఏకాగ్రత దెబ్బతింటుంది. ఇది మాత్రమే కాదు వారి జ్ఞాపకశక్తిపై కూడా ప్రభావం చూపుతుంది. ఇది పిల్లలకే కాకుండా పెద్దలకు కూడా ప్రమాదకరం. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం.. పురుషులు సాధారణంగా తెల్ల చక్కెరను ఎక్కువగా ఉపయోగిస్తారు. తెల్ల చక్కెరను టీ, పుడ్డింగ్, ఖీర్, బేకరీ, కేకులు, అన్ని రకాల స్వీట్లు చేయడానికి వినియోగిస్తారు.
చక్కెర ఎందుకు ప్రమాదకరం
ఏదైనా ఆహార పదార్థాన్ని అధికంగా తీసుకోవడం మీ శరీరానికి హానికరం. చక్కెర అధికంగా తీసుకోవడం వల్ల గుండె సమస్యలు వస్తాయి. రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంటుంది. తెల్ల చక్కెరను మితంగా తీసుకోవాలి. దీనితో తయారు చేసిన ఆహారాలను వీలైనంత వరకు నివారించాలి.