White vs Whole Wheat Bread: వైట్ బ్రెడ్.. హోల్ వీట్ బ్రెడ్.. ఏది ఆరోగ్యకరమైనది.. ఏది హానికరమో తెలుసా..

బ్రేక్‌ఫాస్ట్‌లో బ్రెడ్‌ను చాలా మంది ఇష్టపడతారు. రుచితోపాటు.. ఈజీగా బ్రేక్‌ఫాస్ట్ చేసుకోవచ్చు. దీంతో చాలా మంది బ్రెడ్ తినేందుకు మొగ్గుచూపుతారు.  కానీ తరచుగా వైట్ బ్రెడ్, హోల్ వీట్ బ్రెడ్ మధ్య గందరగోళం ఉంటుంది. ఇందులో ఏలాంటి బ్రెడ్ మంచిది.. హనికరమో నిర్ణయించుకోలేకపోతాం. కానీ తరచుగా వైట్ బ్రెడ్, హోల్ వీట్ బ్రెడ్ తేడా ఏంటో అర్థం కాదు. ఈ రెండింటిలో ఏది మంచిదో ఇక్కడ తెలుసుకుందాం..

White vs Whole Wheat Bread: వైట్ బ్రెడ్.. హోల్ వీట్ బ్రెడ్.. ఏది ఆరోగ్యకరమైనది.. ఏది హానికరమో తెలుసా..
White Vs Whole Wheat Bread

Updated on: Oct 03, 2023 | 2:58 PM

బ్రేక్‌ఫాస్ట్‌లో బ్రెడ్‌ను చాలా మంది ఇష్టపడతారు. అంతేకాాదు చాలా మంది పాలతోపాటు బ్రెడ్ తినేందుకు తొలి ప్రాధాన్యత ఇస్తుంటారు. రుచితోపాటు.. ఈజీగా బ్రేక్‌ఫాస్ట్ చేసుకోవచ్చు. దీంతో చాలా మంది బ్రెడ్ తినేందుకు మొగ్గుచూపుతారు.  కానీ తరచుగా వైట్ బ్రెడ్, హోల్ వీట్ బ్రెడ్ మధ్య గందరగోళం ఉంటుంది. ఇందులో ఏలాంటి బ్రెడ్ మంచిది.. హనికరమో నిర్ణయించుకోలేకపోతాం. రెండు ఆహారాలలో ఏది సరైనది..? ఏ రొట్టె సరైనదో అర్థం చేసుకోవడం ఎలా..? ఈ రెండు బ్రెడ్‌లు ఏం, ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం..

వైట్ బ్రెడ్ శుద్ధి చేసిన పిండితో తయారు చేస్తారు. ఇందులో కొన్ని పోషకాలతో పాటు ఊక, సూక్ష్మక్రిములు కూడా తొలగిపోతాయి. అయితే, హోల్ వీట్ గ్రెయిన్ బ్రెడ్ మొత్తం పిండితో తయారు చేస్తారు. ఊక, తవుడుతోపాటు తృణధాన్యాలు ఇందులో ఉంటాయి. అందువల్ల ఇందులో వైట్ బ్రెడ్ కంటే ఎక్కువ పోషకాలు, ఫైబర్, విటమిన్లు ఉంటాయి. హోల్ వీట్ గ్రెయిన్ బ్రెడ్ సాధారణంగా వైట్ బ్రెడ్ కంటే ఆరోగ్యకరమైనది. ఎందుకంటే ఇది తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా కలిగి ఉంటుంది. అంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.

రెండు బ్రెడ్లలో పోషక ప్రొఫైల్‌లలో తేడా ఏంటంటే..

వైట్ బ్రెడ్, హోల్ వీట్ గ్రెయిన్ బ్రెడ్ లో పోషక ప్రొఫైల్‌లు ప్రాసెస్ చేయబడిన విధానం కారణంగా గణనీయంగా భిన్నంగా ఉంటాయి. వైట్ బ్రెడ్‌లో ఫైబర్ పరిమాణం తక్కువగా ఉంటుంది. హోల్ వీట్ గ్రెయిన్ బ్రెడ్‌లో ఎక్కువ విటమిన్లు, ఐరన్ ఉంటాయి. ఇందులో B విటమిన్లు, ఐరన్, మెగ్నీషియం ఉంటాయి. అయితే పిండిని శుద్ధి చేసే సమయంలో వైట్ బ్రెడ్‌ను తరచుగా బి విటమిన్లు, ఐరన్ వంటి కొన్ని విటమిన్‌లను కోల్పోతుంది. దీంతో కొన్నిసార్లు విడిగా కలుపుతుంటారు. నిర్దిష్ట పోషకాహార కంటెంట్ బ్రాండ్‌లు, వంటకాల మధ్య మారవచ్చు. కాబట్టి డైట్ ఆప్షన్‌ను ఎంచుకునేటప్పుడు ఖచ్చితమైన సమాచారం కోసం పోషకాహార లేబుల్‌లను తనిఖీ చేయడం చాలా అవసరం.

హోల్ వీట్ గ్రెయిన్ బ్రెడ్ ప్రత్యేకత ఏంటి?

మీరు బ్రెడ్ తినడం చాలా ఇష్టపడితే.. మీరు హోల్ వీట్ గ్రెయిన్ బ్రెడ్ తినవచ్చు ఎందుకంటే ఇది మరింత ఆరోగ్యకరమైనది. గోధుమ పిండితో చేసిన బ్రెడ్ తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం వంటి ఇతర పోషకాలతో పాటు.. ఇది బిపిని నియంత్రించడానికి పనిచేస్తుంది. అలాగే గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. గోధుమ పిండితో చేసిన బ్రెడ్ తినడం వల్ల కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. అదనంగా ఇది ఆకలిని కూడా నియంత్రిస్తుంది. కానీ వీటన్నింటితో పాటు పండ్లు, కూరగాయలు, ప్రోటీన్లు చాలా ముఖ్యమైనవి. తక్కువ మోతాదులో చక్కెర, మైదా తినడం ద్వారా మీరు ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు కూడా సలహా ఇస్తున్నారు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం