అనారోగ్యానికి ఆహారపు అలవాట్లే(Food Habits) కారణమవుతున్నాయి. ముఖ్యంగా ఉదయం పూట తీసుకునే పదార్థాల్లో ఎంపిక చాలా అవసరం. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం కొన్ని రకాల ఆహార పదార్థాల్ని తీసుకోకూడదు. ఎందుకంటే ఉదయం వేళ కడుపు ఖాళీగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మనం ఏం తిన్నా అది నేరుగా కడుపులోపలి భాగాలపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా కడుపులో మంట, కడుపు నొప్పి, ఛాతీలో మంట, అజీర్తి వంటి సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి ఉదయం వేళల్లో మసాలా లేదా ఫ్రై పదార్థాలు తినకూడదు. అయితే ఫైబర్(Fibar) పదార్థాలు కడుపుకి మంచివే. కానీ ఎక్కువ మోతాదులో తీసుకుంటే మాత్రం నష్టం చేకూరుస్తాయి. ఫలితంగా కడుపులో నొప్పి(stomach pain), కడుపు పట్టేయడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే పరిమిత మోతాదులోనే ఫైబర్ పదార్థాలు తీసుకోవాలి.
కొంతమంది ఉదయం వేళ అంటే పరగడుపున కాఫీ లేదా టీ తాగుతుంటారు. కానీ దీనివల్ల శరీరానికి నష్టం వాటిల్లుతుంది. ఛాతీలో మంట, డీహైడ్రేషన్ వంటి సమస్యలు ఎదురవుతాయి. ఉదయం పరగడుపున నీళ్లు తాగడం చాలా మంచిది. కానీ చల్లని నీల్లు అస్సలు తాగకూడదు. దీనివల్ల జీర్ణ సమస్యలు ఎదురై..ఏం తిన్నా సరే కడుపులో అజీర్ణం మొదలవుతుంది. పరగడుపున ఆల్కహాల్ తీసుకోవడం పూర్తిగా ప్రమాదకరం. ఇది నేరుగా మీ లివర్‌పై ప్రభావం చూపిస్తుంది. మీ రక్తంలో ఆల్కహాల్ వేగంగా వ్యాపిస్తుంది. పైన సూచించినవన్నీ కేవలం సురక్షితంగా ఉండేందుకు మాత్రమే.
note: ఈ కథనం సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఆహారంలో మార్పులు చేసే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి.
Read Also.. పోషకార లోపంతో ఇబ్బంది పడుతున్నారా ? అయితే ఈ ఆహార పదార్థాలను తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు..