Cow Milk: హిందువులందరికీ ఆవుతో ఒక అవినాభావ సంబంధం ఉంది. ఆవును దేవతగా భావించి హిందువులు పూజిస్తారు. ఆవు పాలు, పెరుగు, నెయ్యిలో అనేక పోషకాలున్నాయి. ముఖ్యంగా భారతీయ గోవులకు మూపురము ఉంటుంది. ఈ మూపురములోని వెన్ను పూసకు సూర్యశక్తిని గ్రహించగల శక్తి ఉంది. దీంతో భారతీయ ఆవుపాలు, నెయ్యి, వెన్నలకు అనేక ప్రత్యేక గుణములున్నాయి. అయితే పాశ్యాత్య గోవులైన జర్సీ, హె.యఫ్ వంటి గోవులకు మూపురము ఉండదు. అందుకని ఇవి సూర్యశక్తిని గ్రహించలేవు. అందువలన వీటి పాలు స్వదేశీ గోవు పాలవంటి శక్తిని ఇవ్వలేవు. అయితే మారుతున్నా కాలంతో పాటు.. మనిషి అలవాట్లు మారాయి.. ఆవు పాల స్థానంలోప్యాకెట్ పాలు వచ్చాయి.. దీంతో సమీకృత ఆహారమైన ఆవు పాలను దూరం చేసుకున్నాం. ఆవుపాలతో లభించే ఆరోగ్య ప్రజలు గురించి తేలుకుందాం..!
*ఆవు పాలు కొంచెము పలుచగా ఉంటాయి.
*. దీంతో త్వరగా అరుగుతాయి.
*. చిన్న పిల్లలకు మంచిది, తల్లిపాలతో సమానం
*. మనిషిలో చలాకీతనాన్ని పెంచుతుంది.
* ఉదర సంబంధమైన జబ్బులు తగ్గుతాయి .
*ప్రేగులలో క్రిములు నశిస్తాయి .
* జ్ఞాపకశక్తిని పెంచుతాయి.
*. చదువుకునే పిల్లలకు తెలివిని పెంచి వారిని నిష్ణాతులను చేస్తాయి.
*. మనస్సును, బుద్ధిని చైతన్య వంతం చేస్తాయి.
* సాత్విక గుణమును పెంచుతాయి
*. తెల్లఆవుపాలు వాతాన్ని, నల్ల (కపిల) ఆవుపాలు పిత్తాన్ని, ఎరుపు రంగు ఆవుపాలు కఫాన్ని హరిస్తాయి.
*. ఆవుపాలు సర్వరోగ నివారణి. ఆవు పాలు వృద్ధాప్యాన్ని దూరంగా ఉంచుతాయి
* ఆవుపాలలో విషాన్ని హరించే శక్తి ఉంది.
* ఆవు నెయ్యి బుద్ధి బలమును పెంచును.
*ఆవుపాలు ఆయుష్షును పెంచును
*గోవు దేవతా స్వరూపము. ఆవుపాల్లో బంగారము ఉంది. ఆవు మూపురములో స్వర్ణనాడి సూర్య కిరణాలతో ఉత్తేజితమై బంగారు (చరక సంహిత) తత్వంగల ఒక పచ్చని పదార్ధాన్ని ఒదులుతుంది. అందువల్ల ఆవుపాలు పచ్చగా ఉంటాయి, ఆవుపాలలో మనకు అత్యంత మేలు చేసే బంగారపు తత్వం ఇమిడి ఉంది. అందుకనే సాధువులు, ఋషులు, మునులు ఆవుపాలనే సేవిస్తారు. యజ్ఞానికి, హోమానికి ఆవుపాలను వాడుతారు. దేవాలయాల్లో పూజకు, అభిషేకానికి ఆవుపాలు వాడతారు.
Also Read: రక్తహీనత, జ్ఞాపకశక్తి అన్నింటికీ ఒకటే మందు అదే బీట్ రూట్ జ్యూస్.. ఏ సమయంలో తీసుకోవాలంటే