మొలకెత్తిన బంగాళాదుంపలు తింటున్నారా..? శరీరంలో ఏం జరుగుతుందో తెలిస్తే..

|

Jul 17, 2024 | 4:08 PM

బంగాళదుంపలను ఇంట్లో ఎక్కువరోజులు నిల్వ ఉంచినట్టయితే.. వాటిపై చిన్న చిన్న మొలకలొస్తాయని అందరికీ తెలుసు. అయితే, చాలా మంది ఈ మొలకలను కోసి వంటలో ఉపయోగిస్తారు. మీరు కూడా ఇలాగే చేస్తున్నారా..? అయితే, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు అంటున్నారు. మొలకలే కాదు మొలకెత్తిన బంగాళదుంపలు తినడం ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు పోషకాహార నిపుణులు. ఇలా మొలకెత్తిన లేదా ఆకుపచ్చ బంగాళాదుంపలను కూడా తినకూడదని అంటున్నారు. ఎందుకంటే మొలకెత్తిన బంగాళదుంపలో పోషకాలు తక్కువగా ఉంటాయి. బంగాళదుంపలు […]

మొలకెత్తిన బంగాళాదుంపలు తింటున్నారా..? శరీరంలో ఏం జరుగుతుందో తెలిస్తే..
Sprouted Potatoes
Follow us on

బంగాళదుంపలను ఇంట్లో ఎక్కువరోజులు నిల్వ ఉంచినట్టయితే.. వాటిపై చిన్న చిన్న మొలకలొస్తాయని అందరికీ తెలుసు. అయితే, చాలా మంది ఈ మొలకలను కోసి వంటలో ఉపయోగిస్తారు. మీరు కూడా ఇలాగే చేస్తున్నారా..? అయితే, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు అంటున్నారు. మొలకలే కాదు మొలకెత్తిన బంగాళదుంపలు తినడం ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు పోషకాహార నిపుణులు. ఇలా మొలకెత్తిన లేదా ఆకుపచ్చ బంగాళాదుంపలను కూడా తినకూడదని అంటున్నారు. ఎందుకంటే మొలకెత్తిన బంగాళదుంపలో పోషకాలు తక్కువగా ఉంటాయి. బంగాళదుంపలు మొలకెత్తినప్పుడు గ్లైకోఅల్కలాయిడ్స్ అనే విషపూరిత సమ్మేళనాలను ఉత్పత్తి చేస్తాయి. అవి మనం తినే ఆహారాన్ని విషంగా మార్చే అవకాశం ఉంటుంది. అలాగే.. మొలకెత్తిన బంగాళాదుంపలలో సోలనిన్ స్థాయులు పెరుగుతాయని, ఇవి పలు అనారోగ్య సమస్యలకు కారణమవుతాయని చెబుతున్నారు.

అంతేకాదు.. మొలకెత్తిన బంగాళదుంపలు తినడం వల్ల వికారం, విరేచనాలు, కడుపు నొప్పి వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనిపై పలు పరిశోధనలు కూడా జరిగాయి. 2002లో ‘ఫుడ్ అండ్ కెమికల్ టాక్సికాలజీ’ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. మొలకెత్తిన బంగాళాదుంపలను తిన్న వారిలో సోలనిన్ స్థాయిలు గణనీయంగా పెరిగాయని.. వికారం, వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపించాయని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో ఐర్లాండ్‌లో డబ్లిన్ విశ్వవిద్యాలయంలోని ట్రినిటీ కాలేజ్‌లో ఫార్మకాలజీ, థెరప్యూటిక్స్ ప్రొఫెసర్ ‘డాక్టర్ డెన్నిస్ జె.ఆర్. మెక్‌ఆలిఫ్’ పాల్గొన్నారు.

అలాగే, మధుమేహ వ్యాధిగ్రస్తులు మొలకెత్తిన బంగాళదుంపలను తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే బంగాళాదుంపలు మొలకెత్తినప్పుడు, వాటిలోని స్టార్చ్ కంటెంట్ చక్కెరగా మారుతుంది. ఇది గ్లైసెమిక్ ఇండెక్స్‌ను పెంచుతుంది. తాజా బంగాళదుంపల కంటే మొలకెత్తిన బంగాళాదుంపలను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు వీటిని తినకూడదని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇంట్లోకి ఎక్కువ మోతాదులో బంగాళాదుంపలను తీసుకువచ్చినప్పుడు..వాటిని సరైన విధానంలో స్టోర్‌ చేసుకోవాలి. ముఖ్యంగా చీకటిగా ఉండే ప్రదేశంలో ఉంచినట్టయితే ఎక్కువ కాలం మొలకెత్తకుండా ఉంటుంది.. అలాగే బంగాళదుంపలను ఎప్పుడూ ఉల్లిపాయలతో కలిపి పెట్టకూడదని చెబుతున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..