సైడ్ ఎఫెక్ట్స్ మాటే ఉండదు.. ఉదయాన్నే ఈ టిఫిన్ తింటే ఆరోగ్యానికి తిరుగుండదు మావ..

గోధుమల్లో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. అందుకే.. డైలీ గోధుమ రవ్వ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని పేర్కొంటున్నారు డైటీషియన్లు.. ఇది బరువు తగ్గడానికి, మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు ఉన్నవారికి అనుకూలం. గోధుమ రవ్వలో ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉండి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. తక్కువ క్యాలరీలతో పోషకాలను అందిస్తుంది.

సైడ్ ఎఫెక్ట్స్ మాటే ఉండదు.. ఉదయాన్నే ఈ టిఫిన్ తింటే ఆరోగ్యానికి తిరుగుండదు మావ..
Wheat Rava

Updated on: Mar 31, 2026 | 9:29 AM

గోధుమ రవ్వ తినడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అవును.. మనం నిత్యం తీసుకునే ఆహారంలో గోధుమ రవ్వ ఉప్మా కూడా ఒకటి. చాలా మందికి గోధుమ రవ్వతో చేసే ఉప్మా అంటే ఇష్టం. అయితే, దీనితో కేవలం రుచి మాత్రమే కాదు, అనేక ఆరోగ్య లాభాలున్నాయి. ఈ గోధుమ రవ్వతో చేసే ఆహారం డయాబెటిక్స్, రక్తపోటు, గుండె జబ్బులు వంటి ఏ సమస్య ఉన్నవారైనా తీసుకోవచ్చు. దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. అంతేకాకుండా, గోధుమ రవ్వ వల్ల బరువు కూడా తగ్గవచ్చు. ఇందులో ముఖ్యమైన ఫైబర్, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. క్యాలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక ఉత్తమ ఎంపిక.

గోధుమ రవ్వ ఉప్మాను కాయగూరలు అన్నీ వేసి చేస్తారు.. కాబట్టి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. బరువు తగ్గాలనుకునే వారు గోధుమ రవ్వ ఉప్మాను మంచిగా.. తినవచ్చు. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉన్నప్పటికీ, కొద్దిగా తిన్నా కడుపు నిండిన భావం కలుగుతుంది. దీంతో ఇతర అల్పాహారాలు, అనవసరమైన పదార్థాలు తినకుండా ఉండవచ్చు. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.

గోధుమ రవ్వలో పుష్కలంగా ప్రోటీన్లు ఉంటాయి. అలాగే, గోధుమ రవ్వతో తయారు చేసే ఆహార పదార్థాలు ఏవైనా సంతోషంగా తీసుకోవచ్చు. ఇలా కొవ్వు పదార్థాలు తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చు.

గోధుమ రవ్వ నెమ్మదిగా జీర్ణమవుతుంది కాబట్టి త్వరగా ఆకలి అనిపించదు. దీంతో ఇతర పదార్థాలు కూడా తినలేము. అయితే, కొంతమందికి గోధుమ రవ్వతో జీర్ణ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి వారు దీనిని దూరంగా ఉండటమే మంచిది.

గోధుమ రవ్వలో ఫైబర్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి జీర్ణవ్యవస్థ సజావుగా జరగడానికి ఇది సహాయపడుతుంది. అలాగే, శరీరంలో అన్ని భాగాల విధులు సరిగ్గా నిర్వహించడానికి ఇది ఉపయోగపడుతుంది.

మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. డయాబెటిక్స్ ఉన్నవారు గోధుమ రవ్వను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలలో ఎలాంటి మార్పులు రావు. ఆహారాన్ని చక్కెరగా మార్చకుండా గోధుమ రవ్వ చేస్తుంది కాబట్టి ఎలాంటి డౌట్స్ లేకుండా దీనిని తీసుకోవచ్చు.

గోధుమ రవ్వతో అనేక వంటకాలను చేసుకోవచ్చు.. మామూలుగా ఉప్మా వండుకోవచ్చు.. లేదా కిచిడీ మాదిరిగా.. కూరగాయలు కలిపి చేసుకోవచ్చు..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us