Brown Rice Halwa: నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే బటర్ రైస్ హల్వా.. రుచి చూస్తే మర్చిపోలేరు..

స్వీట్ అంటే కేవలం క్యాలరీలు మాత్రమే కాదు, ఆరోగ్యం కూడా అని నిరూపిస్తోంది ఈ 'రెడ్ బటర్ రైస్ హల్వా'. సాధారణంగా మనం చేసే హల్వాల కంటే ఇది భిన్నమైనది అత్యంత పౌష్టికమైనది. ఎర్ర బియ్యంలోని పోషకాలు, కొబ్బరి పాల క్రీమీ టెక్స్చర్ కలిసి దీనికి అద్భుతమైన రుచిని ఇస్తాయి. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే ఈ హల్వాను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం..

Brown Rice Halwa: నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే బటర్ రైస్ హల్వా.. రుచి చూస్తే మర్చిపోలేరు..
Red Butter Rice Halwa Recipe

Updated on: Mar 16, 2026 | 8:41 PM

ఆరోగ్యం పట్ల అవగాహన పెరుగుతున్న ఈ కాలంలో, పోషకాలతో కూడిన స్వీట్స్ కు డిమాండ్ పెరుగుతోంది. ఐరన్, ఫైబర్ విటమిన్ బి-కాంప్లెక్స్ పుష్కలంగా ఉండే రెడ్ బటర్ రైస్ ఈ హల్వాకు ప్రధాన ఆకర్షణ. అతిథులు వచ్చినప్పుడు లేదా పండగ సమయాల్లో వెరైటీగా ఏదైనా చేయాలనుకుంటే ఈ రెసిపీ ది బెస్ట్ ఛాయిస్. మరి ఈ హెల్తీ హల్వా తయారీలో వాడే పదార్థాలు ఆ సీక్రెట్ ప్రాసెస్ ఏంటో చూసేయండి..

కావలసిన పదార్థాలు:

రెడ్ బటర్ రైస్: 1 కప్పు

చక్కెర: 1.5 కప్పు

కొబ్బరి పాలు: 1.5 కప్పు

పాలు: 2 కప్పులు

నెయ్యి , వేయించిన జీడిపప్పు: అవసరమైనంత

ఏలకుల పొడి: కొద్దిగా

తయారీ విధానం

ముందుగా ఒక పాన్ తీసుకుని రెడ్ బటర్ రైస్‌ను గోధుమ రంగులోకి మారే వరకు దోరగా వేయించాలి. అది చల్లారిన తర్వాత మిక్సీలో వేసి ముతకగా (రవ్వలా) రుబ్బుకోవాలి.

స్టవ్ మీద పాన్ పెట్టి, అందులో రుబ్బిన బియ్యం రవ్వ, పాలు, కొబ్బరి పాలు మరియు చక్కెర వేసి బాగా కలపాలి. ఉండలు కట్టకుండా జాగ్రత్త పడాలి.

మిశ్రమం ఉడుకుతూ పాన్‌కు అంటుకోవడం ప్రారంభించినప్పుడు, సిద్ధంగా ఉన్న నెయ్యిలో సగం వేసి బాగా కలపాలి.

హల్వా దగ్గర పడి మంచి వాసన వస్తున్నప్పుడు.. వేయించిన జీడిపప్పు, ఏలకుల పొడి మరియు మిగిలిన నెయ్యి వేయాలి. హల్వా మెత్తగా, వెన్నలా తయారైన తర్వాత స్టవ్ ఆపివేయాలి.

ఆరోగ్య ప్రయోజనాలు:

రక్తహీనతను తగ్గించడంలో మరియు జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఎర్ర బియ్యం అద్భుతంగా పనిచేస్తుంది.

శరీరానికి అవసరమైన శక్తిని అందించే విటమిన్లు ఇందులో పుష్కలంగా ఉన్నాయి.

చిన్న చిట్కా: హల్వా మరింత రుచిగా ఉండాలంటే తాజా కొబ్బరి నుండి తీసిన పాలను వాడండి. ఇది హల్వాకు మంచి క్రీమీ టేస్ట్ ఇస్తుంది.

Follow Us