AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మనం తినే ఫుడ్ ఎంత వరకు సేఫ్..! హెల్తీ అనుకున్నవే విషంగా మారుతున్నాయా?

ప్రస్తుత కాలంలో ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతిరోజూ కూరగాయలు, పండ్లు అధికంగా తీసుకోవడం మంచి అలవాటు. అయితే, మనం కొనుగోలు చేసే ఈ ఆహార పదార్థాలు బయటకు తాజాగా కనిపిస్తున్నా, వాటిపై పురుగుమందుల విష అవశేషాలు ఉండే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వ్యవసాయంలో రసాయనాల వినియోగం పెరగడం వల్ల, సరైన శుభ్రపరిచే ప్రక్రియ లేకుండా వీటిని వాడటం వల్ల శరీరంలోకి ప్రమాదకర టాక్సిన్స్ చేరుతున్నాయి. ఇవి దీర్ఘకాలంలో తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంది.

మనం తినే ఫుడ్ ఎంత వరకు సేఫ్..! హెల్తీ అనుకున్నవే విషంగా మారుతున్నాయా?
Toxic Residues In Vegetables.jpg
Nikhil
|

Updated on: Jun 02, 2026 | 6:45 AM

Share

కూరగాయలు కొనడం మాత్రమే కాదు, వాటిని శాస్త్రీయ పద్ధతిలో శుభ్రం చేయడం ఎంతో ముఖ్యం. గుజరాత్‌కు చెందిన డైటీషియన్ కిన్నారిబెన్ ప్రకారం, ఆహార పదార్థాలను శుభ్రం చేసే విధానంలో మనం ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కూరగాయలు, పండ్లను వంటకు ఉపయోగించే ముందు శుభ్రమైన నీటితో పలుమార్లు కడగాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో నీటిని తీసుకుని, అందులో తగినంత బేకింగ్ సోడా కలిపి, ఈ పదార్థాలను కొంతసేపు నానబెట్టాలి.

ఇలా చేయడం వల్ల వాటిపై ఉన్న విషపూరిత రసాయన అవశేషాలు గణనీయంగా తగ్గుతాయి. ఆ తర్వాత మరోసారి స్వచ్ఛమైన నీటితో కడగడం ద్వారా మనం విషతుల్యాల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. అలాగే ధాన్యాలను నిల్వ చేసే సమయంలో వేప ఆకులను వాడటం, గాలి చొరబడని డబ్బాలను ఉపయోగించడం వంటి చిన్న చిట్కాలతో కీటకాలను దూరంగా ఉంచవచ్చు.

రైతులు పాటించాల్సినవి..

రైతులు కూడా పంట విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పురుగుమందులు పిచికారీ చేసిన వెంటనే పంట కోయకుండా, నిర్ణీత సమయం వరకు వేచి ఉండే పద్ధతిని తప్పనిసరిగా పాటించాలి. దీనివల్ల రసాయనాల ప్రభావం తగ్గుతుంది.

అమెక్టిన్, బెంజోయేట్, ఇండోక్సాకార్బ్ వంటి వేగంగా విచ్ఛిన్నమయ్యే మందులను ఎంచుకోవడం కొంతవరకు సురక్షితం. రసాయనాలకు బదులుగా పసుపు స్టిక్కీ ట్రాప్స్, ఫ్రూట్ ఫ్లై కేజ్ వంటి శాస్త్రీయ పద్ధతులను అనుసరించడం ద్వారా పురుగుమందుల వినియోగాన్ని క్రమంగా తగ్గించవచ్చు.

ఆహారం పండించే దశ నుండి వండే వరకు ప్రతి దశలోనూ జాగ్రత్తలు పాటించడం వల్లనే మనం సురక్షితమైన ఆహారాన్ని పొందగలం. చిన్న చిన్న మార్పులు, అవగాహనతో కూడిన పద్ధతులను అనుసరించడం ద్వారా మాత్రమే భవిష్యత్తులో వచ్చే అనారోగ్య సమస్యలను నివారించి, సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. మనం తీసుకునే ఆహారమే మనకు ఆయుష్షును ఇవ్వాలి కానీ, అనారోగ్యాన్ని కాదు అనే నిజాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి.

Follow Us
రేపట్నుంచే బడి టీచర్లకు స్పెషల్ TET 2026 పరీక్షలు.. గట్టెక్కుతారా
రేపట్నుంచే బడి టీచర్లకు స్పెషల్ TET 2026 పరీక్షలు.. గట్టెక్కుతారా
నిజ జీవిత సంఘటనలతో తీసిన సినిమా.. OTTలోకి రీసెంట్ ఫీల్ గుడ్ మూవీ
నిజ జీవిత సంఘటనలతో తీసిన సినిమా.. OTTలోకి రీసెంట్ ఫీల్ గుడ్ మూవీ
కొత్త ఫించన్ల కోసం ఎదురుచూసే వారికి గుడ్‌న్యూస్..
కొత్త ఫించన్ల కోసం ఎదురుచూసే వారికి గుడ్‌న్యూస్..
చేయి లేకపోయినా బ్రెయిన్ సిగ్నల్స్‌తో పనిచేసే రోబోటిక్ హ్యాండ్!
చేయి లేకపోయినా బ్రెయిన్ సిగ్నల్స్‌తో పనిచేసే రోబోటిక్ హ్యాండ్!
ఎండిన చెరువుల్లోకి వర్షపు నీరు రాగానే పసుపు కప్పలు ఎలా వస్తాయి?
ఎండిన చెరువుల్లోకి వర్షపు నీరు రాగానే పసుపు కప్పలు ఎలా వస్తాయి?
శ్రీలంకపై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు వీరే
శ్రీలంకపై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు వీరే
తెలంగాణలోని రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్
తెలంగాణలోని రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్
తాటి బెల్లంలో అసలైనది ఏది? నకిలీది ఏది? గుర్తించడం ఎలా..?
తాటి బెల్లంలో అసలైనది ఏది? నకిలీది ఏది? గుర్తించడం ఎలా..?
బుమ్రా ఆస్తి విలువ తెలిస్తే ఫ్యూజులు అవుట్ కావాల్సిందే
బుమ్రా ఆస్తి విలువ తెలిస్తే ఫ్యూజులు అవుట్ కావాల్సిందే
కన్న తల్లిని, కడుపున పుట్టిన కూతురిని.. ఒకే రోజు హతమార్చిన కసాయి
కన్న తల్లిని, కడుపున పుట్టిన కూతురిని.. ఒకే రోజు హతమార్చిన కసాయి
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!