ఖర్జూరను ఇలా తీసుకున్నారంటే, శృంగారంలో అలసిపోయే ప్రసక్తే ఉండదు..ఫలితాలు చూశాక మీరే ఆశ్చర్యపోతారుగా..

|

May 20, 2023 | 2:41 PM

Dates Health Benefits: మారుతున్న సీజన్‌లకు అనుగుణంగా ఆహారమార్పులు చేయడం ద్వారా మన ఆరోగ్యాన్ని నిలకడగా కాపాడుకోవచ్చు. అందుకే సీజనల్‌గా లభించే పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలని పోషకాహార, వైద్య నిపుణులు చెబుతుంటారు. ఈ క్రమంలో ప్రస్తుత వేసవిలో..

ఖర్జూరను ఇలా తీసుకున్నారంటే, శృంగారంలో అలసిపోయే ప్రసక్తే ఉండదు..ఫలితాలు చూశాక మీరే ఆశ్చర్యపోతారుగా..
Health Benefits Of Dates With Milk
Follow us on

Dates Health Benefits: మారుతున్న సీజన్‌లకు అనుగుణంగా ఆహారమార్పులు చేయడం ద్వారా మన ఆరోగ్యాన్ని నిలకడగా కాపాడుకోవచ్చు. అందుకే సీజనల్‌గా లభించే పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలని పోషకాహార, వైద్య నిపుణులు చెబుతుంటారు. ఈ క్రమంలో ప్రస్తుత వేసవిలో ఎదురయ్యే సమస్యల నుంచి మనల్ని కాపాడేందుకు ఖర్జూర ఉపయోగపడుతుందని వారు అంటున్నారు. ఖర్జూర అనేది అన్ని సీజన్‌లలో లభించే ఒక సూపర్ ఫుడ్. దీన్ని తినడం వల్ల డీహైడ్రేషన్, వడదెబ్బ సమస్యలను నిరోధించవచ్చు. ఈ ఖర్జూరలో ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉన్న కారణంగా ఇవి మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయంట. అయితే ఖర్జూరను నేరుగా తినడం కంటే.. పాలతో కలిపి తీసుకుంటే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయంట. ఇంకా ఈ మిశ్రమం శృంగార సామర్థ్యాన్ని పెంచి, లైంగిక కోరికలను కలుగచేయడంలో ఇది మేలుగా ఉంటుందని వారు పేర్కొంటున్నారు. అసలు ఖర్జూరను పాలతో కలిపి తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఖర్జూర+పాలు ప్రయోజనాలు:

శృంగార సామర్ధ్యం: ఖర్జూర, పాలను కలిపి తింటే సంతానోత్పత్తిని పెంచడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంకా ఇందులోని ఆయుర్వేద లక్షణాలు మీలో లైంగిక కోరికలను పెంచడమే కాక శ‌ృంగార సామర్ధ్యాన్ని రెట్టింపు స్థాయిలో పెంచుతాయి.

రక్తహీనత: చాలా మందికి ఐరన్ లోపం వల్ల రక్తహీనత వస్తుంది. అయితే దాన్ని అధిగమించడానికి పాలలో ఖర్జూరను కలిపి తీసుకుంటే చాలు. పాలు, ఖర్జూరలో ఐరన్ పుష్కలంగా ఉన్న కారణంగా ఇది మీ శరీరంలో రక్తం స్థాయిలను పెంచడమే కాక, రక్తహీనత సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

ఇవి కూడా చదవండి

గర్భవతులకు ప్రయోజనకరం: ఖర్జూరను పాలలో కలిపి తీసుకోవడం ద్వారా గర్భవతులకు ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వారి గర్భంలోని పిండం అభివృద్ధిం చెందడానికి ఈ విధమైన ఆహారం మేలుగా ఉంటుంది. పిండాభివృద్ధికే కాక తల్లి, ఆమెలోని బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా ఉపకరిస్తుంది.

చర్మ సంరక్షణ: పాలు, ఖర్జూర మిశ్రమంలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నందున ఇది యాంటీ ఏజింగ్ లక్షణాలను సమృద్ధిగా కలిగి ఉంటాయి. ఫలితంగా వృద్ధాప్య ఛాయలను, ఇదర చర్మ సమస్యలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.

ఎముకల దృఢత్వం: పాలు, ఖర్జూరలో కాల్షియం ఉంటుదన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ కాల్షియం మన శరీరంలోని ఎముకలను ఉక్కు కంటే గట్టిగా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇంకా దంతాల ఆరోగ్యానికి కూడా ఇది ఉపయోగకరం.

మరిన్ని లైఫ్‌స్టైల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..