Chicken: కోడిమాంసం ఇష్టమని.. అతిగా తింటున్నారా..? అయితే, ఈ ఇబ్బందులు రావడం ఖాయం..

|

Dec 10, 2022 | 1:34 PM

చికెన్‌ను ముట్టుకుంటే మన చేతులకు అంటుకుని పొట్ట లోనికి చేరే అవకాశం ఉంది. అలాగే సరిగా ఉడికించకపోయినా ఈ బ్యాక్టరియా శరీరంలోకి చేరి అనారోగ్యాన్ని కలిగిస్తుంది.

Chicken: కోడిమాంసం ఇష్టమని..  అతిగా తింటున్నారా..?  అయితే, ఈ ఇబ్బందులు రావడం ఖాయం..
Chicken
Follow us on

చాలా మందికి ప్రతిరోజూ ముక్కలేనిదే ముద్ద దిగదు. అయితే, రోజూ చికెన్ తినేవాళ్ల ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అతిగా చికెన్‌ తింటే ఆరోగ్య సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. మీరు డీప్‌ఫ్రైడ్ చికెన్‌ని రెగ్యులర్‌గా తీసుకుంటే, మీ కొలెస్ట్రాల్ స్థాయి విపరీతంగా పెరిగిపోవటం ఖాయమంటున్నారు. చికెన్‌లో ఉండే అధిక ప్రొటీన్ కొవ్వు రూపంలో మారి పేరుకుపోతుంది. దీంతో మీరు తెలియకుండానే బరువు పెరుగుతారు. రక్తంలో లిపిడ్ స్థాయిలు పెరిగిపోతాయి. కాబట్టి రొజూ తినే అలవాటును మానుకుంటే మంచిది. అంతేకాదు.. ఇది హృదయ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాన్ని కూడా పెంచుతుంది. అంటే అకాల మరణాన్ని కొని తెచ్చుకున్నట్టే.

చికెన్ అనేది జంతు ఆధారిత ప్రొటీన్‌కు మూలం. శాఖాహారులతో పోలిస్తే రోజూ చికెన్ తినేవారి BMI అధికంగా పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు..చికెన్ శుభ్రంగా కడిగి, బాగా ఉడికించకపోవటం వల్ల కూడా అనారోగ్య సమ్యలు తప్పవు. ఇలాంటి చికెన్‌తో ఫుడ్ పాయిజనింగ్ బారిన పడే అవకాశం ఎక్కువ. వండని చికెన్ పై సాల్మొనెల్లా, క్యాంపిలోబాక్టర్ వంటి బ్యాక్టిరియాలు ఉంటాయి. చికెన్‌ను ముట్టుకుంటే మన చేతులకు అంటుకుని పొట్ట లోనికి చేరే అవకాశం ఉంది. అలాగే సరిగా ఉడికించకపోయినా ఈ బ్యాక్టరియా శరీరంలోకి చేరి అనారోగ్యాన్ని కలిగిస్తుంది. గర్భిణిలకు ఇది చాలా ప్రమాదకరం.

పౌల్ట్రీ రైతులు తాము పెంచుతున్న కోళ్లకు బలవంతంగా యాంటీబయోటిక్ ఇంజెక్షన్లు ఇస్తున్నట్టు వార్తలు వస్తాయి. అలాంటి చికెన్ తినేవారిలో యాంటీబయోటిక్స్ నిరోధకత పెరిగిపోతుంది. అంటే మీరు అనారోగ్యంగా ఉన్నప్పుడు వైద్యులు ఇచ్చిన యాంటీ బయోటిక్స్ మీపై పనిచేయవన్న మాట. ఇన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి రోజూ చికెన్ తినే అలవాటును మానుకోండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి