Carrot Side Effects: ఈ సమస్యలున్నవారు క్యారెట్లు అతిగా తినొద్దు.. తస్మాత్ జాగ్రత్త!

|

Oct 22, 2022 | 11:12 AM

క్యారెట్‌తో వంటకం ఏదైనా కూడా అందరూ ఇష్టపడుతూ లాగించేస్తారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే.. రోజుకో పచ్చి క్యారెట్ తింటే..

Carrot Side Effects: ఈ సమస్యలున్నవారు క్యారెట్లు అతిగా తినొద్దు.. తస్మాత్ జాగ్రత్త!
Carrot Side Effects
Follow us on

క్యారెట్‌ను ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. కొందరికి పచ్చి క్యారెట్ తినడం అంటే ఇష్టం.. మరికొందరు దాన్ని హల్వాలా చేసుకుని తింటారు. క్యారెట్‌తో వంటకం ఏదైనా కూడా అందరూ ఇష్టపడుతూ లాగించేస్తారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే.. రోజుకో పచ్చి క్యారెట్ తింటే అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చునని వైద్యులు అంటుంటారు. క్యారెట్‌లో ప్రోటీన్లు, బీటా కెరోటిన్, కెరోటీనాయిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి కంటి చూపు మెరుగుపరచడమే కాదు.. పలు రకాల వ్యాధులను తగ్గించడంలో సహాయపడతాయి. క్యారెట్‌లో ఫాల్కారినోల్ అనే శక్తివంతమైన కాంపౌండ్ ఉంది. ఇది ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడటానికి తోడ్పడుతుంది. అలాగే ఈస్ట్రోజెన్ స్థాయిలను నియంత్రిస్తుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు దోహదపడుతుంది.

క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది:

పచ్చి క్యారెట్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని నివారించవచ్చునని డాక్టర్లు చెబుతున్నారు. క్యారెట్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల పురోగతికి విరుగుడుగా పని చేస్తాయని అంటున్నారు. అలాగే రోజుకో పచ్చి క్యారెట్ తినడవం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా నియంత్రణలోకి వస్తాయన్నారు. అటు క్యారెట్‌లో ఉండే ప్రోటీన్.. కొవ్వును కరిగించేందుకు దోహదపడుతుంది. పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అధికంగా ఆహారాన్ని తీసుకునేవారు భోజనానికి ముందుగా క్యారెట్ తింటే మంచిదని డాక్టర్లు అంటున్నారు. అలాగే క్యారెట్‌లో ఉండే పొటాషియం రక్తపోటును అదుపు చేస్తుంది.

ఈ సమస్యలున్నవారు క్యారెట్లు అతిగా తినొద్దు..

గట్ ప్రాబ్లమ్స్, పేగు సిండ్రోమ్, అల్సరేటివ్ కొలిటిస్ సమస్యలతో బాధపడేవారు పచ్చి క్యారెట్లను ఎక్కువగా తినొద్దు. ఎందుకంటే అవి త్వరగా జీర్ణం కావు. అలాంటివారు ఉడికించిన క్యారెట్లు తినడం మేలు అని డాక్టర్లు అంటున్నారు. అలాగే ఎలర్జీలతో బాధపడేవారు క్యారెట్లను తినొద్దు. ఇవి ఎలర్జీని తీవ్రతరం చేసే అవకాశం ఉంది. కాగా, ఏ ఫుడ్ అయినా మితంగానే తినాలి. క్యారెట్లు కూడా అంతే.. అధికంగా తిన్నట్లయితే.. లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయి.