
ప్రస్తుత పరిస్థితులలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడమే కాకుండా.. ఆరోగ్యంగా ఉండడం కూడా ముఖ్యమే. కరోనా భయానికి మొతాదుకు మించి కషాయాలు తీసుకోవడం వలన గొంతు సమస్యలతో పాటు.. ఇతర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. అయితే రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొన్ని ఆహార పదార్థాలను తినడం వలన రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. ఖాళీ కడుపుతో కొన్ని పదార్థాలు తినడం నలన జీర్ణవ్యవస్థ, ఇతర జీర్ణ విధులపై భారం ఉండదు.
వెల్లుల్లి..
వెల్లుల్లిలో యాంటీ బయాటిక్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇది అంటువ్యాదుల నుంచి రక్షిస్తుంది. అలాగే రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రించడమే కాకుండా.. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా.. ఉపరితిత్తులకు సంబంధించిన ఇతర సమస్యలను నివారిస్తుంది. రోజూ ఉదయాన్నే వెల్లుల్లిని తినడం ద్వారా అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు. రోజూ ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో వెల్లుల్లిని కలిపి తీసుకోవాలి.
ఆమ్లా..
దీనినే ఇండియన్ గూస్బెర్రీ అని అంటారు. ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. దీనిని రోజు ఉదయాన్నే వేడి నీటిలో తురుముకొని తీసుకోవాలి. అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఖాళీ కడుపుతో తింటే.. ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే జుట్టు సంరక్షణకు కూడా ఉపయోగపడుతుంది.
తేనె..
ఖాళీ కడుపుతో వెచ్చని నీటితో ఒక టీ స్పూన్ తేనె కలిపి తీసుకోవడం వలన బరువు తగ్గడమే కాకుండా.. చర్మ సంరక్షణకు.. రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహయపడుతుంది. రుచి కోసం ఇందులో కొంచెం నిమ్మకాయ రసం కలుపుకోవచ్చు. ఇందులో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. శరీరంలో ఫ్రీరాడికల్స్ తో పోరాడటానికి సహాయపడుతుంది. ఈ డ్రింక్ లోని యాంటీ బాక్టీరియల్ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
Also Read: NTR Tests Corona Negative: కరోనా నుంచి కోలుకున్న ఎన్టీఆర్.. విల్ పవరే ఆయుధమంటూ ట్వీట్..