ఉరుకులు పరుగుల జీవితం.. పేలవమైన జీవనశైలి.. అనారోగ్యకర ఆహారం.. ఇవన్నీ ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. బరువు పెరగడం అనేది ప్రస్తుతం పెద్ద సమస్యగా మారింది. కరోనా కాలం తరువాత, లాక్డౌన్, ఇంటి నుంచి పని చేయడం, జీవనశైలి మారడం లాంటి అనేక కారణాలతో చాలామంది యువకులు, మధ్య వయస్కులు వారి శారీరక కార్యకలాపాలు ప్రభావితమయ్యాయి. ప్రజలు ఊబకాయులుగా మారుతున్నారు. దీంతో పలు అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. కావున, బరువు తగ్గడానికి వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అనుసరించమని నిపుణులు తరచుగా సలహా ఇస్తున్నారు. కానీ చాలా మంది ఆరోగ్య నిపుణులు మనకు సరైన సమయంలో అల్పాహారం, భోజనం, రాత్రి భోజనం చేయకపోతే మన బరువు పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. అందుకే సరైన సమయంలో తినడం మన ఆరోగ్యానికి చాలా మంచిది..
భారతదేశంలోని ప్రముఖ డైటీషియన్ ఆయుషి యాదవ్ ప్రకారం.. మనం మూడు సార్లు ఆహారాన్ని తీసుకోవాలి.. ప్రతిరోజూ దానిని అనుసరించాలి అప్పుడే మన శరీర ఆకృతిలో తేడాను చూడటం ప్రారంభిస్తాము.
తిన్న తర్వాత మీ శరీరం ఎంత సేపు యాక్టివ్‌గా ఉంటుందో, అలా ఎక్కువ కాలం కేలరీలు బర్న్ అవుతూనే ఉంటాయి. ఇది జరగకపోతే, మన నడుము, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. అందువల్ల, తిన్న వెంటనే నిద్రపోవడం మంచిదికాదు.. రాత్రి లేదా పగటిపూట నిద్రవేళకు 3 గంటల ముందు ఆహారం తీసుకోవాలి.
నిద్రపోయే ముందు మన శరీరం మెలటోనిన్‌ను విడుదల చేయడం ప్రారంభిస్తుంది. కాబట్టి మీరు నిద్రపోయే ముందు చాలా కాలం ముందు మీరు ఆహారం తినాలని వైద్యులు తరచుగా సిఫార్సు చేస్తారు. కాబట్టి ఆహారాన్ని అప్పటికి ముగించాలి. నిద్రపోయే సమయంలో ఆహారం తీసుకుంటే ఆటోమేటిక్‌గా ఊబకాయం వస్తుంది.
అనేక సర్వేల ప్రకారం, ఉదయం 7:00 గంటలకు అల్పాహారం, మధ్యాహ్నం 12:30 గంటలకు భోజనం, రాత్రి 7:00 గంటలకు రాత్రి భోజనం చేయడానికి ఉత్తమ సమయం. కానీ ఈ నిర్దిష్ట సమయాల్లోనే భోజనం చేస్తే శరీరంలో చాలా మార్పులను గమనించవచ్చు.. అయితే, ఈ సమయాన్ని 15 నుంచి 20 నిమిషాలు ఆలస్యం చేయడం వల్ల ఎటువంటి హాని కలగదని.. సాధ్యమైనంతమేరకు ఈ సమయాల్లో తీసుకోవడం ఉత్తమమని.. నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి