Lemon Water Benefits: ఉదయాన్నే ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగితే మంచిదేనా ? ఆరోగ్యంపై ప్రభావం ఎలా ఉంటుందంటే..

|

Jul 23, 2021 | 9:23 AM

ప్రస్తుత కాలంలో శరీరానికి విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు ఎంతో అవసరం. సీజనల్ వ్యాధులు.. కరోనా భారీన పడకుండా ఉండాలంటే..

Lemon Water Benefits: ఉదయాన్నే ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగితే మంచిదేనా ? ఆరోగ్యంపై ప్రభావం ఎలా ఉంటుందంటే..
Lemon Water
Follow us on

ప్రస్తుత కాలంలో శరీరానికి విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు ఎంతో అవసరం. సీజనల్ వ్యాధులు.. కరోనా భారీన పడకుండా ఉండాలంటే.. ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం తప్పనిసరి. ఇందుకోసం సహజ వనరులను.. పురాతన వంటకాలను తీసుకోవడానికి ఎక్కువగా జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే మనకు మేలు సహజ వనరులలో నిమ్మకాయ ఒకటి. దీనిని రోజూవారీ ఆహారంలో తీసుకుంటుంటారు. ఇది ఆమ్లత్వం కలిగి ఉంటుంది. ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇందులో విటమిన్ సీ, ఇ, బీ6, థియామిన్, నియాసిన్, రిబోప్లేవిన్, ఫోలేట్ వంటి పోషకాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్య ప్రయజనాలను అందిస్తాయి. కానీ ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మరసం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదేనా ? దీనివలన కలిగే ప్రయోజనాలెంటో తెలుసుకుందామా.

1. జీర్ణ సమస్యలను తగ్గించడంలో నిమ్మకాయ నీరు చాలా సహాయపడుతుంది. ఇది హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఇది మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు తగ్గిస్తుంది. అంతేకాకుండా.. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.

2. నిమ్మకాయ నీరు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి చాలా సహాయపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి, పొటాషియం రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగడం వల్ల శరీరానికి పోషకాలు అందుతాయి. దీంతో అనారోగ్యం బారిన పడే ప్రమాదం తక్కువ.

3. ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తీసుకోవడం వలన రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఇందులో సిట్రస్ ఆమ్లం, విటమిన్-సి పుష్కలంగా ఉన్నాయి. ఇవి రక్తపోటును నియంత్రించడంలో ప్రత్యేక పాత్ర పోషిస్తాయి.

4. ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తీసుకోవడం వలన బరువు తగ్గవచ్చు. ఇది జీవక్రియను పెంచుతుంది. కొవ్వును బర్న్ చేస్తుంది. దీనితో పాటు శరీరం నుంచి విషపూరితాలను తొలగించడంలో కూడా ఇది సహాయపడుతుంది. ఇది బరువును తగ్గించడంలో సహాయపడుతుంది.

5. నిమ్మకాయ నీరు తాగడం వలన శరీరం హైడ్రేట్‏గా ఉంటుంది. శరీరంలో నీటి కొరత ఉండదు. ఇందులో చాలా విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీరంలో వేడిని తగ్గించడమే కాకుండా.. ఎల్లప్పుడూ హైడ్రేట్ గా ఉంచడంలో సహయపడతాయి.

6. నిమ్మకాయ నీరు తీసుకోవడం కూడా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి కొల్లాజెన్ ఏర్పడటానికి చాలా సహయపడుతుంది. అలాగే ఇది చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా చేస్తుంది.

7. నిమ్మకాయ నీరు తాగడం వలన కాలేయం ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో కాలేయం శుభ్రంగా ఉంటుంది. అలాగే కాలేయం రాత్రంతా చురుకుగా ఉంటుంది.

Also Read: Shilpa Shetty: భర్త అరెస్ట్ తర్వాత తొలిసారి ఇన్‏స్టాలో పోస్ట్ చేసిన శిల్పా శెట్టి.. ఏమన్నదంటే..

Karthika Deepam Latest: ఎమోషనల్ ట్విస్ట్..మూడంకెలు లెక్కపెట్టిన మోనిత.. కార్తీక్ ను అసహ్యించుకుంటున్న తండ్రి..సర్ది చేప్పే ప్రయత్నంలో వంటలక్క!