Onion Juice: ఉల్లిపాయ రసంతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది జుట్టుకు చాలా మంచిది పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఉల్లిపాయ రసంలో యాంటీ ఆక్సిడెంట్ క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉంటాయి. ఉల్లిపాయ రసం తీసుకోవడం ద్వారా అనేక వ్యాధులను నయం చేయవచ్చు. ఈ రోజు మనం ఉల్లిపాయ రసం ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..
1. కిడ్నీల్లో రాళ్లు కరిగిస్తుంది
ఉల్లిపాయర రసం కిడ్నీలో రాళ్ల సమస్యను పరిష్కరిస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో ఉల్లిపాయ రసం తాగితే రాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
2. మధుమేహం
ఉల్లిపాయ రసంతో రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచవచ్చు. ఉల్లిపాయలో యాంటీ అలర్జీ, యాంటీ ఆక్సిడెంట్, కార్సినోజెనిక్ లక్షణాలు ఉంటాయి.
3. రోగనిరోధక శక్తిని పెంచుతుంది
ఉల్లిపాయల్లో ఉండే పోషకాలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి తోడ్పడుతాయి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
4. కీళ్ల నొప్పి
ఉల్లిపాయ రసంతో కీళ్ల నొప్పి తగ్గించవచ్చు. ఆవ నూనెను ఉల్లిపాయ రసంతో కలిపి మసాజ్ చేస్తే సరిపోతుంది.
5. జుట్టు రాలే సమస్య
ఉల్లిపాయ రసం జుట్టు రాలే సమస్యని నిరోధిస్తుంది. అలాగే జుట్టు, చర్మానికి కూడా ఉపయోగపడుతుంది. కలబంద, కొబ్బరి నూనె, ఉల్లిపాయ రసాన్ని మిక్స్ చేసి జుట్టుకు రాయడం వల్ల జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు.
6. జుట్టు రాలే సమస్య
చాలామంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతుంటారు. అయితే కలబంద వల్ల మనషులకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కలబంద, కొబ్బరి నూనె, ఉల్లిపాయ రసాన్ని మిక్స్ చేసి జుట్టుకు పూయడం వల్ల జుట్టు రాలడం సమస్య నుంచి బయటపడవచ్చు.