Immunity Smoothie: రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉందా? అయితే బొప్పాయితో ఇలా చేయండి..

|

Apr 19, 2022 | 7:14 PM

వేసవిలో మన ఆరోగ్యంగా, వడదెబ్బ బారిన పడకుండా ఉండాలంటే ఎంతో ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది. వీటిలో ముఖ్యమైన లిస్టులో బొప్పాయి, ఫ్లాక్స్ సీడ్స్ స్మూతీ కూడా ఉంటుంది. వేసవిలో తీసుకోవడంతో ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

Immunity Smoothie: రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉందా? అయితే బొప్పాయితో ఇలా చేయండి..
Papaya Smoothie
Follow us on

వేసవి(Summer)లో మన ఆరోగ్యంగా, వడదెబ్బ బారిన పడకుండా ఉండాలంటే ఎంతో ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది. వీటిలో ముఖ్యమైన లిస్టులో బొప్పాయి(Papaya), ఫ్లాక్స్ సీడ్స్ స్మూతీ కూడా ఉంటుంది. దీనిని వేసవిలో తీసుకోవడంతో ద్వారా రోగనిరోధక శక్తి(Immunity) పెరుగుతుంది. అలాగే హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. విటమిన్ సి పుష్కలంగా ఉన్న ఈ పానీయం చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో విటమిన్-సి కీలకంగా పనిచేస్తుంది. బొప్పాయిలో విటమిన్ సి, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. బొప్పాయితో పాటు, ఈ పానీయంలో అంజీర్, బాదం, ఫ్లాక్స్ గింజల లాంటివి కలపడం ద్వారా మరింత ప్రయోజనకరంగా మారుతుంది.

బొప్పాయి ఫ్లాక్స్ సీడ్స్ స్మూతీ చేసేందుకు కావలసినవి..

ఫ్లాక్స్ సీడ్ ఒకటిన్నర కప్పులు

1 కప్పు తరిగిన బొప్పాయి

బెల్లం 2 గడ్డలు

యాలకుల పొడి 1/4 tsp

పాలు 3 కప్పులు

అంజీర్ 1

బాదం 2

బొప్పాయి ఫ్లెక్స్ సీడ్స్ స్మూతీని ఎలా తయారు చేయాలి:

ఫ్లాక్స్ సీడ్స్, బాదం, అంజీర్ పండ్లను 1 గంట నానబెట్టండి. ఇప్పుడు బొప్పాయిని కోసి పక్కన పెట్టుకోవాలి. పాలలో బెల్లం వేసి కలపాలి. ఆ తర్వాత తరిగిన బొప్పాయిని కలిపి పై మిశ్రమాలను అన్నింటిని బాగా మిక్సీ పట్టాలి. ఇలా తయారైన స్మూతీపై యాలకుల పొడి వేసి సర్వ్ చేయాలి.

Also Read: Peanut Side Effects: వేరుశెనగ తింటే మంచిదే.. కానీ ఈ సమస్యలు ఉన్నవారు అస్సలు తినకూడదు..

Lemon Water: నిమ్మకాయ నీళ్లు తాగడం వలన నిజంగానే బరువు తగ్గుతారా ? అసలు విషయాలు తెలుసుకోండి..