
మనలో చాలా మంది కాఫీ ప్రియులు ఉంటారు. వీళ్లకు సందర్భం ఏదైనా సరే.. కాఫీతో పంచుకుంటారు.. కొందరు ఉదయం నిద్రలేవగానే కప్పు కాఫీ కడుపులో పడకపోతే బండి సాగదు అనేలా ఉంటారు.. అయితే, కాఫీ ఇష్టముంటే మామూలు కాఫీ కన్నా బ్లాక్ కాఫీ తాగడం ఎంతో ఉపయోగకరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. బ్లాక్ కాఫీలో క్యాలరీలు తక్కువగా ఉండటంతో పాటు మెటబాలిజం పెంచే గుణం ఉంది. ఇది శరీరంలో కొవ్వును త్వరగా కరిగించడంలో సహాయపడుతుంది. బ్లాక్ కాఫీలో ఉండే కేఫీన్ మెంటల్ అలర్ట్‌నెస్ పెంచుతుంది. ఇది ఏకాగ్రతను పెంచుతుంది. మానసికంగా అలర్ట్‌గా ఉండేలా చేస్తుంది. దీనివల్ల మెమొరీ పవర్ మెరుగవుతుంది, క్రమంగా ఏజ్ రిలేటెడ్ బ్రెయిన్ సమస్యలు దూరం అవుతాయి.
రోజూ బ్లాక్ కాఫీని సేవించడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుండె జబ్బులు వచ్చే రిస్క్ తక్కువగా ఉంటుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. బ్లాక్ కాఫీ అనేది నేచురల్ ఫ్యాట్ బర్నర్‌గా పనిచేస్తుంది. జిమ్‌కి వెళ్తే వర్కౌట్ ముందు తాగితే మరింత ఫలితం ఉంటుంది. బ్లాక్ కాఫీని ప్రతి రోజూ తగిన మోతాదులో తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే రిస్క్ చాలా వరకు తగ్గుతుందని పలు పరిశోధనల ద్వారా తేల్చారు. బ్లాక్ కాఫీని తాగితే ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. ఫలితంగా షుగర్ లెవల్స్ తగ్గుతాయి. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
బ్లాక్ కాఫీ తాగితే మన పొట్ట పూర్తిగా క్లీన్ అవుతుంది. ఇది టాక్సిన్స్‌ను బయటకు పంపించి, మంచి జీర్ణక్రియను అందిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటంతో దీన్ని తరచూ తాగడం వల్ల హార్ట్‌హెల్త్ బాగుంటుంది, డయాబెటిస్ రిస్క్ తగ్గుతుంది. కనుక గుండె ఆరోగ్యంగా ఉండాలని అనుకునేవారు రోజూ బ్లాక్ కాఫీని సేవిస్తుండాలి. అలాగే ఈ కాఫీని తాగితే యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. మితంగా బ్లాక్ కాఫీని తీసుకోవటం వల్ల మన శరీరంలో డోపమైన్ రిలీజ్ అవుతుంది. దీంతో మూడ్ మారుతుంది. డిప్రెషన్, ఆందోళన, ఒత్తిడి తగ్గుతాయి. మైండ్ రిలాక్స్ అవుతుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..