ఇవేవో పిచ్చి ఆకులు అనుకునేరు.. డైలీ నాలుగైదు తింటే ఆ సమస్యలన్నీ పరార్..

|

Sep 15, 2024 | 6:10 PM

పుదీనాలో ఎన్నో ఔషధగుణాలు దాగున్నాయి.. ఇది ఆరోగ్యాన్ని కాపాడేందుకు తోడ్పాటునందిస్తుంది. అందుకే పుదీనాను సహజ ఔషధ మొక్కగా పేర్కొంటారు. ఇది సాధారణ జలుబు, దగ్గు, నోటిసమస్యలు, గొంతు మంట, సైనస్ ఇన్ఫెక్షన్లు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను దూరం చేయడంలో సహాయపడుతుంది.

ఇవేవో పిచ్చి ఆకులు అనుకునేరు.. డైలీ నాలుగైదు తింటే ఆ సమస్యలన్నీ పరార్..
పుదీనా ఆకులను నిత్యం పచ్చిగా నమలగలిగితే ఎలాంటి సమస్యా ఉండదు. కానీ ఏదైనా సమస్య ఉంటే మాత్రం పుదీనా టీని తగవచ్చు. కాసిన్ని పుదీనా ఆకులను నీటితో మరగబెట్టి కప్పులో పోసుకుని తాగితే కడుపు ఆరోగ్యంగా ఉంటుంది.
Follow us on

పుదీనాలో ఎన్నో ఔషధగుణాలు దాగున్నాయి.. ఇది ఆరోగ్యాన్ని కాపాడేందుకు తోడ్పాటునందిస్తుంది. అందుకే పుదీనాను సహజ ఔషధ మొక్కగా పేర్కొంటారు. ఇది సాధారణ జలుబు, దగ్గు, నోటిసమస్యలు, గొంతు మంట, సైనస్ ఇన్ఫెక్షన్లు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను దూరం చేయడంలో సహాయపడుతుంది. నోరు లేదా గొంతు మంటను తగ్గించడానికి పుదీనా ఒక ఔషధంగా ఉపయోగపడుతుంది. పుదీనా క్యాన్సర్ అభివృద్ధి కారకాలను నిరోధిస్తుది.. యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఆరోగ్యంగా ఉండేలా సహాయపడతాయి. ఇది సంభావ్య ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఇది జీర్ణ ఆరోగ్యానికి సహాయపడటం, అలెర్జీ లక్షణాలను తగ్గించడంతోపాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అందుకే.. పుదీనాను క్రమం తప్పకుండా తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రోజూ 5-6 ఆకులైనా నమిలి తినాలని పేర్కొంటున్నారు.

పుదీనా తినడం వలన కలిగే ప్రయోజనాలు..

  1. పుదీనా రసం లేదా పుదీనా ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఛాతీలో సమస్యలను తగ్గించవచ్చు. పుదీనాలో ఉండే మెంథాల్ డికాంగెస్టెంట్‌గా పనిచేస్తుంది. ఇది ఊపిరితిత్తులలో పేరుకుపోయిన శ్లేష్మాన్ని బయటకు పంపుతుంది. మీరు సులభంగా శ్వాస తీసుకోవడంలో సహాయపడటానికి ముక్కులోని పొరలను కుదించడం ప్రారంభిస్తుంది.
  2. పుదీనాలోని ఔషధ గుణాలు, దాని సువాసన అరోమాథెరపీలో సహాయపడతాయి. పుదీనా రిఫ్రెష్ వాసనను కలిగి ఉంటుంది. ఇది మిమ్మల్ని చాలా త్వరగా ప్రశాంతంగా, రిఫ్రెష్‌గా భావించేలా చేస్తుంది. పుదీనా రసం, దాని సువాసన త్వరగా మానసిక ఒత్తిడి, డిప్రెషన్ నుండి ఉపశమనం కలిగిస్తుంది.
  3. పుదీనా ఆకులను నమలడం నోటి పరిశుభ్రత, దంత ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. పుదీనా నూనె తాజా శ్వాసను పొందడానికి సహాయపడతాయి.
  4. పుదీనా ఉపయోగించడం వల్ల చర్మవ్యాధులు దూరమవుతాయి. దీనివల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది.
  5. పుదీనా ఆకుల రసాన్ని తేనె లేదా ఎర్ర రాతి పంచదార, నిమ్మరసం కలిపి తీసుకుంటే అలసట, నీరసం, జీర్ణక్రియ సంబంధిత సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇంకా మనస్సును రిఫ్రెష్ చేస్తుంది.
  6. ప్రతిరోజు నాలుగైదు పుదీనా ఆకులను నమలడం వల్ల పంటి నొప్పి, దవడలో రక్తస్రావం నిరొధించి.. చిగుళ్లు బలపడతాయి.. నోటి దుర్వాసన తొలగిపోతుంది.
  7. పుదీనా ఆకులను చూర్ణం చేసి తీసుకోవడం వల్ల తలనొప్పి, తల తిరగడం నుండి ఉపశమనం లభిస్తుంది. పుదీనా కషాయాన్ని తేనెతో కలిపి సేవిస్తే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

(ఈ సమాచారం ఇంటర్నెట్ ద్వారా సేకరించబడింది. ఫాలో అయ్యేముందు డాక్టర్లను సంప్రదించండి)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..