Summer Drinks: వేసవి దాహార్తిని తీర్చే బటర్ మిల్క్.. డిఫరెంట్ స్టైల్‌లో తయారీ రెసిపీలు మీకోసం

|

Apr 07, 2022 | 7:08 AM

Buttermilk: దేవతలకు అమ‌ృతం ఎలానో.. మానవులకు మజ్జిగ అలా అంటారు పెద్దలు. ముఖ్యంగా వేసవి వచ్చందంటే చాలు.. డీహైడ్రేషన్ (Dehydration) సర్వసాధారణం. వేసవి తాపాన్ని..

Summer Drinks: వేసవి దాహార్తిని తీర్చే బటర్ మిల్క్.. డిఫరెంట్ స్టైల్‌లో తయారీ రెసిపీలు మీకోసం
Flavoured Buttermilk Recip
Follow us on

Summer Drinks: దేవతలకు అమ‌ృతం ఎలానో.. మానవులకు మజ్జిగ అలా అంటారు పెద్దలు. ముఖ్యంగా వేసవి వచ్చందంటే చాలు.. డీహైడ్రేషన్ (Dehydration) సర్వసాధారణం. వేసవి తాపాన్ని(Summer Heat) దాహార్తిని తీర్చుకోవడానికి పానీయాలవైపు దృష్టి సారిస్తారు. అంతేకాదు శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా తగినంత మంచినీరుతో పాటు మజ్జిగ, కొబ్బరి నీరు వంటి సహజ పానియాలను తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఇవి శరీరాన్ని చల్లబరుస్తాయి. ఆరోగ్యానికి మేలు కూడా. పాలలో ఉండే ప్రతి పోషకం మజ్జిగలో ఉంటుంది. అదనంగా ప్రోబయోటిక్‌ అనే మంచి బ్యాక్టీరియా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వ్యాధులను దూరం చేస్తుంది. పేగులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. పెరుగు కంటే మజ్జిగ రూపంలో తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. సుగంధ ద్రవ్యాలు, మసాలా దినుసులను కూడా జోడించవచ్చు.

నిమ్మ మజ్జిగ: దాహార్తిని తీరుస్తుంది. వాంతులు, వికారాన్ని దూరం చేస్తుంది.
కావాల్సిన పదార్ధాలు: మజ్జిగ, నిమ్మకాయ, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర .. వీటన్నిటిని ఒక గిన్నెలో వేసుకుని బ్లెండ్ చేసి .. సర్వ్ చేయండి.

పుదీనా మజ్జిగ: ఇది జీర్ణక్రియలో మంచి సహాయకారి. డిటాక్సింగ్ డ్రింక్‌గా కూడా పనిచేస్తుంది. కడుపు నొప్పిని , వికారం, తలనొప్పిని దూరం చేస్తుంది. కావలసిన పదార్ధాలు: పెరుగు- ఒక కప్పు, నీరు- రెండు కప్పులు, నల్ల మిరియాల పొడి- టీస్పూన్ , ఉప్పు రుచికి సరిపడా పుదీనా ఆకులు కొన్ని .. ఇవన్నీ కలిపి బ్లెండర్‌లో వేసి సర్వ్ చేయండి.

జీలకర్ర మజ్జిగ: ఇది షుగర్ పేషేంట్స్ కు మేలు చేస్తుంది. కావలసినవి పెరుగు ఒక కప్పు, ఇంగువ కొంచెం, ఉప్పు, నీరు , వేయించిన జీలకర్ర పొడి , కొత్తిమీర ఆకులు.. వీటన్నిటిని బ్లెండర్లో వేసి సర్వ్ చేయాలి.

బీట్‌రూట్/ క్యారెట్ మజ్జిగ: ఇది తక్షణ శక్తిని ఇస్తుంది. అంతేకాదు రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. కావలసినవి పెరుగు, రుచికి సరిపడా ఉప్పు, బీట్‌రూట్, పచ్చిమిర్చి , అల్లం, కొత్తిమీర , పుదీనా, తురిమిన బీట్‌రూట్‌ లేదా క్యారెట్. తయారీ విధానం.. ముందుగా పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, పుదీనా ఆకులతో కలిపి కొంచెం మిక్స్ చేసుకోవాలి. వెడల్పాటి గిన్నెలో పెరుగు బాగా గిలక్కొట్టి అందులో నీళ్లు, ఉప్పు, బీట్‌రూట్ లేదా క్యారెట్ మిశ్రమం వేసి బాగా కలపాలి.

మసాలా మజ్జిగ: మసాలా మజ్జిగ .. శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. రక్తపోటును తగ్గిస్తుంది. డీహైడ్రేషన్  నుంచి కోలుకోవడానికి సహాయపడుతుంది. కావలసినవి పెరుగు, నీరు, ఉప్పు రుచికి సరిపడినంత , పచ్చిమిర్చి, అల్లం ,కొత్తిమీర, కరివేపాకు. తయారీ విధానం: ముందుగా పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, కరివేపాకులను మిక్స్ చేసుకోవాలి. గిన్నెలో పెరుగు వేసి పల్చగా గిలకొట్టి, నీళ్లు, ఉప్పు వేసి బాగా కలపాలి. గ్రైండ్ చేసిన మిశ్రమం వేసి బాగా కలిపి సర్వ్ చేసుకోవాలి.

వేసవిలో తక్షణ శక్తికి, వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం మజ్జిగ మంచి సహాయకారి.. వీటిని కుండలోని చల్లని నీటితో కలిపి తాగడం వలన రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం

Also Read: Horoscope Today: ఈరోజు ఈ రాశి వ్యాపారస్తులకు అనుకూలం… నేటి రాశిఫలితాలు ఎలా ఉన్నాయంటే..

Lemon Price: కిలో నిమ్మకాయలు రూ.400.. ఎక్కడో కాదు.. మన దేశంలోనే..!