చక్కెర ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి చాలా హానికరం. చక్కెరను అధికంగా వాడటం వల్ల అనేక దుష్ప్రభావాలు కలుగుతుంటాయి. చాలా మంది ఈ మధ్య కాలంలో చక్కెర బదులు బెల్లం వాడటం చూస్తున్నాము. చాలామంది బెల్లంను చక్కెర కంటే ఎక్కువ ప్రయోజనకరంగా భావిస్తారు. అయితే నిజంగా ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిదో తెలుసుకుందాం.
బెల్లం, చక్కెర రెండింటి తయారుచేసే విధానం భిన్నంగా ఉంటుంది:
చక్కెర, బెల్లం రెండూ కూడా చెరుకు రసం నుంచే తయారు చేస్తారు. అయితే వీటిని తయారుచేసే విధానం మాత్రమే భిన్నంగా ఉంటుంది. కానీ పంచదార కంటే బెల్లంలో ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి. బెల్లం పూర్తిగా సేంద్రీయమైనది, ఆర్గానిక్ పద్ధతిలో తయారు అవుతుంది.
అదే చక్కెర బ్లీచింగ్ ప్రక్రియ నుండి తయారవుతుంది. దీని తయారీలో అనేక రసాయనాలు వాడుతుంటారు. బెల్లం మాత్రం ఎలాంటి రసాయనాలు లేకుండా తయారవుతుంది. అందుకే బెల్లంలో పోషకాలు ఎక్కువ, రక్తహీనత ఉన్నవారికి బెల్లం చాలా మంచిది. ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, జింక్, కాల్షియం, సెలీనియం ఇందులో పుష్కలంగా లభిస్తాయి. షుగర్ పేషెంట్స్ కి బెల్లం కొద్ది మొత్తంలో వాడవచ్చు. అదే షుగర్ రోగులకు, చక్కెర విషం కంటే తక్కువ కాదు. ఇది ఒంట్లో డయాబెటిస్ స్థాయి పెరుగుదలకు కారణమవుతుంది.
బెల్లం తీసుకోవడం వల్ల అనేక వ్యాధులకు దూరం కావచ్చు:
చక్కెరలో కేలరీలు మాత్రమే ఉంటాయి. కానీ బెల్లం చాలా పోషకాలు, మినరల్స్ ఉంటాయి. బెల్లంలో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఆయుర్వేదం ప్రకారం, ఉబ్బసం, దగ్గు, కామెర్లు, ఛాతీ నొప్పి వంటి వివిధ వ్యాధులు బెల్లం తినడం ద్వారా నయమవుతాయి. దీనితో పాటు బెల్లాన్ని రోజూ తీసుకోవడం వల్ల జీర్ణశక్తి బలపడుతుంది.
పంచదార తయారీలో సల్ఫర్ వాడుతారు. ఇది ఆరోగ్యానికి చాలా హానికరం. అదే బెల్లం తయారీలో ఎటువంటి రసాయనాలు ఉండవు. కనుక తీపి కోసం మీరు బెల్లంను ప్రత్యామ్నాయంగా తీసుకోవడం వల్ల శరీరానికి ఎటువంటి హాని జరగదు. పంచదారలోని సల్ఫర్ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. ముఖ్యంగా క్యాన్సర్ వంటి వ్యాధులు కలిగించేందుకు సల్ఫర్ కారణం అవుతుంది. అందుకే దీర్ఘకాలికంగా పంచదారను తీసుకోవడం అంత మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన సాంప్రదాయంలో ఎప్పటినుంచో అన్ని తీపి వస్తువులను బెల్లంతోనే తయారు చేసుకోవడం అలవాటు ముఖ్యంగా పాయసం, అరిసెలు, లడ్డూలు ఇలా ప్రతి తీపి వస్తువును మనం బెల్లం తోనే తయారు చేసుకుంటాం. కనుక పంచదార బదులు బెల్లం వాడటం వల్ల అనేక వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండవచ్చు.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..