Health Benefits: శనగలు ఉడికించి, మొలకెత్తించి, వేయించి..ఎలా తింటే ఎక్కువ లాభం..!

శనగలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, ఐరన్, ఫైబర్, ఫోలేట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. మీరు శనగలను మూడు విధాలుగా తినవచ్చు. వేయించిన, ఉడికించిన లేదా మొలకెత్తిన శనగలు కూగా తింటారు చాలా మంది. ప్రతి రకానికి వేర్వేరు ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మొలకెత్తిన, వేయించిన, లేదంటే ఉడికించి శనగలు ఎలా తింటే ఎలాంటి లాభాలు కలుగుతాయో తప్పక తెలుసుకోండి..

Health Benefits: శనగలు ఉడికించి, మొలకెత్తించి, వేయించి..ఎలా తింటే ఎక్కువ లాభం..!
Chickpeas

Updated on: Oct 10, 2025 | 9:07 PM

శనగలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, ఐరన్, ఫైబర్, ఫోలేట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. మీరు శనగలను మూడు విధాలుగా తినవచ్చు. వేయించిన, ఉడికించిన లేదా మొలకెత్తిన శనగలు కూగా తింటారు చాలా మంది. ప్రతి రకానికి వేర్వేరు ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మొలకెత్తిన, వేయించిన, లేదంటే ఉడికించి శనగలు ఎలా తింటే ఎలాంటి లాభాలు కలుగుతాయో తప్పక తెలుసుకోండి..

మొలకెత్తిన శనగలు:

మొలకెత్తిన శనగలను అథ్లెట్లు లేదా పొలాల్లో పనిచేసేవారు, అలాగే అధిక స్థాయిలో శారీరక శ్రమ చేసేవారు మాత్రమే తినాలని నిపుణులు సూచిస్తున్నారు. మొలకెత్తిన శనగల్లో నీటిలో కరిగే పీచు ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. దాంతో మలబద్దకం, గ్యాస్ సమస్యలూ తగ్గుతాయి. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో కూడా ఈ ఫైబర్ పనిచేస్తుంది. ఇందులో ఉండే పొటాషియం హైబీపీ సమస్యను నియంత్రించడంలో సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

ఉడికించిన శనగలు ఔషధం:

ఉడికించిన శనగలు ఒక ఔషధంగా పరిగణిస్తారు. రోజంతా ఆఫీసులో పనిచేసే వారికి ఉడికించిన శనగలు ఔషధం లాంటివి అంటున్నారు నిపుణులు. ఆఫీసు సమయంలో వారు ఒక్కో చిక్కుడు గింజను తింటుండవచ్చు. వీటిలో విటమిన్ బి కాంప్లెక్స్ పుష్కలంగా ఉంటుంది. ఇవి శరీరంలో ప్రోటీన్ లోపాన్నీ తగ్గిస్తాయి. కండరాలను బలోపేతం చేయడం ద్వారా జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మంచి జ్ఞాపకశక్తిని కాపాడుకోవచ్చు. శరీరంలో సెరోటోనిన్ అనే హార్మోన్ ను పెంచడం ద్వారా మంచి మెదడు పనితీరును నిర్వహించడానికి ఇది పనిచేస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది.

రోగనిరోధక శక్తి పెరుగుతుంది:

వేయించిన శనగలు తినడం, వాటిపై కొద్దిగా నిమ్మకాయ పిండుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. డయాబెటిస్ లేదా థైరాయిడ్ వంటి వ్యాధులు ఉన్నవారు వేయించిన శెనగలను తినాలి. ఇది డయాబెటిస్‌ను అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. జలుబు, కఫంతో బాధపడేవారు వీటిని తీసుకోవడం ద్వారా సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. వేయించిన శనగలు తినడం వల్ల మీ బరువు నియంత్రణలో ఉంటుంది. కాబట్టి అధిక బరువు ఉన్నవారు కూడా వాటిని తినవచ్చు. అలాగే, మీరు మలబద్ధకంతో బాధపడుతుంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉడికించిన శనగపప్పు తినకూడదని నిపుణులు చెబుతున్నారు.

ఏ రకంగా చూసినా, ఏ రూపంలో తిన్నా శనగల వల్ల ఆరోగ్యానికి మేలే జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇకపోతే, కొన్ని రకాల చర్మ సమస్యలు ఉన్నవారు శనగపప్పుకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. ఆయుర్వేదం ప్రకారం, వాత స్వభావం ఉన్నవారు శనగలు తినకుండా ఉండాలి. పొడి చర్మం ఉన్నవారు కూడా శనగలు తినకుండా ఉండాలి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..