Dry Fruits in Summer: డ్రై ఫ్రూట్స్‌తో ఆరోగ్యానికి చాలా మంచిది. డ్రై ఫ్రూట్స్ రోజూ తింటే.. ఇవి పలు అనారోగ్య సమస్యలను దూరం చేయడంలో కీలకపాత్ర పోషిస్తాయి. అందుకే రోజువారీ ఆహారంలో నట్స్ తీసుకోవాలని నిపుణులు సూచనలు చేస్తున్నారు. దీంతోపాటు నానబెట్టిన గింజలను ఉదయాన్నే పరగడుపుతో తినడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటారు. అలాగే నట్స్ తీసుకోవడం వల్ల మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో పలు రకాల జబ్బులు రాకుండా నియంత్రించవచ్చు. కావున మీరు కూడా నట్స్‌ను రోజువారి ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా వేసవిలో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ రోజూ తింటే శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. అవేంటో చూద్దాం..
వాల్‌నట్స్: మీరు మీ ఆహారంలో వాల్‌నట్‌లను చేర్చుకుంటే కాలక్రమేణా మీ బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. వీటిలో యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కణాలను కాపాడటంతోపాటు.. గుండె జబ్బులు, క్యాన్సర్, చిన్న వయస్సులో వృద్ధాప్య ఛాయలు రావడం వంటి సమస్యల నుంచి రక్షించడంలో సహాయపడతాయి. అంతే కాదు మీ శరీరానికి మేలు చేసే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు కూడా వీటిలో పుష్కలంగా ఉన్నాయి.
బాదం: బాదం ఆరోగ్యానికి మంచిదే. వీటిలో మోనోశాచురేటెడ్ కొవ్వు అధికంగా ఉంటుంది. ఇది గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇతర గింజలతో పోలిస్తే ఇందులో అత్యధికంగా ఫైబర్ ఉంటుంది. విటమిన్ ఇ కూడా పుష్కలంగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసే బాదం పప్పు బరువును కూడా తగ్గిస్తుంది.
జీడిపప్పు: జీడిపప్పు రుచిగా ఉండటమే కాదు.. ఇతర గింజలతో పోలిస్తే ఇందులో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. దీనిలో 82 శాతం కొవ్వుతోపాటు అసంతృప్త కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఈ అసంతృప్త కొవ్వు ఆమ్లంలో 66 శాతం గుండెకు రక్షణ కల్పించే మోనోశాచురేటెడ్ కొవ్వు ఉంటుంది. జీడిపప్పులో ఐరన్, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇంకా కణాలకు ఆక్సిజన్‌ను అందించడానికి ఐరన్ కూడా ఉంటుంది. ఇది రక్తహీనతను నివారిస్తుంది. మెగ్నీషియం జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
పిస్తాపప్పు: పిస్తాపప్పులో 4శాతం కేలరీలు మాత్రమే ఉంటాయి. అవి ఎల్-అర్జినైన్‌ను కలిగి ఉంటాయి. ఇది మీ ధమనుల్లో రక్త సరఫరా మంచిగా జరిగేలా చేస్తుంది. తద్వారా రక్తం గడ్డకట్టే అవకాశాలను తగ్గించి గుండెపోటు ప్రమాదాన్ని నివారిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ ఇ శరీరానికి చాలా అవసరం. రోజులో ఐదు నుంచి ఏడు పిస్తాపప్పులు తింటే ఆరోగ్యానికి మంచిది. దీంతోపాటు పిస్తాపప్పులో విటమిన్ B6, ఫాస్పరస్, మెగ్నీషియం కూడా ఉన్నాయి.
Also Read: