
Side Effects of Ghee: తరతరాల నుంచి దేశీ నెయ్యి తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పేరు. ఇందులో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరానికి మేలు చేయడంలో ప్రభావవంతంగా ఉంటాయి. ఈ కారణంగా ఆరోగ్య నిపుణులు సైతం దీనిని తినాలని కూడా సిఫార్సు చేస్తున్నారు. ఆరోగ్యంగా ఉండటంతో పాటు ఆహార రుచిని కూడా పెంచడం దీని ప్రత్యేకతల్లో ఒకటి. ఆయుర్వేదంలో దీనిని ఔషధం అని పిలుస్తారు. ఈ కారణంగా మీరు వేసవి లేదా శీతాకాలంలో ఏ సీజన్‌లోనైనా పరిమిత పరిమాణంలో తినవచ్చు. ఇందులో ఒమేగా-3, ఒమేగా-9 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లు ఎ, కె, ఇ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే.. నెయ్యితో అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని రకాల వ్యాధులు ఉన్న వారు నెయ్యిని తీసుకోకూడదని చెబుతున్నారు. మరి ఎవరు నెయ్యి తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
గుండె రోగి..
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి మన ఆహారమే ప్రధాన కారణం. సరైన ఆహారం తినకపోవడం వల్ల శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగడం ప్రారంభమవుతుంది. బాధిత వ్యక్తి త్వరగా అనారోగ్యం భారిన పడే అవకాశం ఉంది. ఇలాంటి వారు నెయ్యిని అతిగా తినడం వలన హార్ట్ స్ట్రోక్ బారిన పడే ప్రమాదం ఉంది. గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు నెయ్యిని తక్కువగా తినాలని నిపుణులు సూచిస్తున్నారు.
దగ్గు..
జలుబు, దగ్గుతో బాధపడేవారు నెయ్యికి దూరంగా ఉండాలి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ సమస్య ఉన్న సమయంలో నెయ్యి తినడం వల్ల గొంతులో సమస్య మరింత పెరుగుతుంది. దగ్గు తీవ్రత పెరుగుతుంది.
కాలేయం సమస్యలు..
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కాలేయం ఆరోగ్యం సరిగ్గా లేకుంటే నూనె గానీ, నెయ్యి పదార్థాలు కానీ తినకూడదు. ప్రస్తుత కాలంలో చాలా మంది ఫ్యాటీ లివర్‌తో బాధపడుతున్నారు. ఫ్యాటీ లివర్‌తో బాధపడే వ్యక్తి తేలికైన, తక్కువ నూనె పదార్థాలు తినాలని వైద్యులు సూచిస్తున్నారు. నెయ్యి తీసుకోవడం వల్ల వారి సమస్య మరింత పెరుగుతుందని అంటున్నారు.
Also read:
Ambani Daughter in Law: ముఖేష్ అంబానీ కొడలు సంపద ఎంతో తెలిస్తే అవాక్కవుతారు..!
Telangana: సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్‌ని ఢీకొట్టిన కారు.. ఫ్యామిలీ మొత్తం..!