మనలో అందరికి పండుగలు, పార్టీలు, ప్రయాణాలు లేదా స్నేహితులతో కలిసినపుడు కూల్‌డ్రింక్స్ తాగే అలవాటు ఉంటుంది. కానీ ఈ కూల్ డ్రింక్స్ వల్ల ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? ఈ కూల్ డ్రింక్స్ కారణంగా ఏడాదికి 22 లక్షల టైప్ 2 డయాబెటిస్ కేసులు నమోదు అయ్యాయని అమెరికాలోని టఫ్ట్స్ యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడైంది.
అమెరికాలోని టఫ్ట్స్ యూనివర్సిటీ చేసిన పరిశోధన ప్రకారం.. ప్రతి ఏడాదీ ప్రపంచవ్యాప్తంగా 22 లక్షల మంది టైప్ 2 డయాబెటిస్ బారిన పడుతున్నారు. వీరిలో 9.8 శాతం మంది కూల్ డ్రింక్స్ తాగడం వల్ల ఈ సమస్యకు గురవుతున్నారు. అంతేకాకుండా 12 లక్షల మంది గుండె సమస్యలు ఎదుర్కొంటున్నారట.
ఈ డ్రింక్స్ అధిక చక్కెరను కలిగి ఉండడం వల్ల శరీరంలో గ్లూకోజ్ స్థాయిని పెంచుతాయి. ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిస్తాయి. టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులకు కారణమవుతాయట. అందరికీ అవసరమైన పరిష్కారం ఒక్కటే ఉందంటున్నారు. అది కూల్ డ్రింక్స్ బదులు, ఆరోగ్యకరమైన డ్రింక్స్ ను తాగడం బెస్ట్ అంటున్నారు.
వాటర్, కొబ్బరినీళ్లు తాగడం మీకు మంచిది. తీపి లేని పండ్ల రసాలు వంటివి తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు చాలానే ఉంటాయి.
ఈ డ్రింక్స్ తాగనందున రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ స్కిన్ మెరుస్తుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మొత్తానికి మీరు కూల్ డ్రింక్స్ ను తాగడం తగ్గించినా.. పూర్తిగా మానేసినా మీరు ఆరోగ్యంగా ఉంటారు. ప్రతి చిన్న అలవాటు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.