Samai tomato Rice: కడుపు ఉబ్బరానికి దివ్య ఔషధం సామలు.. ఈరోజు సామలు టమాటా రైస్ తయారీ విధానం తెలుసుకుందాం

Samai tomato Rice Recipe: గత కొంతకాలం నుంచి మళ్ళీ చిరు ధాన్యాలు ఇచ్చే ఆహార ప్రయోజనాలు బాగా ప్రాచుర్యంలోకి రావడంతో మళ్ళీ వాటి వైపు చూస్తున్నారు. అయితే పూర్వకాలంలో చేసిన వంటలకు..

Samai tomato Rice:  కడుపు ఉబ్బరానికి దివ్య ఔషధం సామలు.. ఈరోజు సామలు టమాటా రైస్ తయారీ విధానం తెలుసుకుందాం
Samai Tomato Vegetable

Updated on: Jul 22, 2021 | 4:44 PM

Samai tomato Rice Recipe: గత కొంతకాలం నుంచి మళ్ళీ చిరు ధాన్యాలు ఇచ్చే ఆహార ప్రయోజనాలు బాగా ప్రాచుర్యంలోకి రావడంతో మళ్ళీ వాటి వైపు చూస్తున్నారు. అయితే పూర్వకాలంలో చేసిన వంటలకు భిన్నంగా రకరకాల రుచులతో ఆహారపదార్ధాలను తయారు చేస్తున్నారు. చిరుధాన్యాల్లో ఒకటి సామలు. ఇవి తియ్యటి రుచిని కలిగి ఉంటాయి. అయితే వీటిని తినడం వలన అనేకవ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. ముఖ్యంగా తిన్న తర్వాత వచ్చే గుండెల్లో మంట , పుల్లటి త్రేన్పులతో పాటు కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు దివ్య ఔషధంగా పనిచేస్తాయి సామలు. ఈ రోజు సామలు టమాటా రైస్ తయారీ విధానం గురించి తెలుసుకుందాం

కావాల్సిన పదార్ధాలు :

సామలు – 1 కప్పు
టొమాటో
క్యారట్‌
బఠాణి
ఉల్లిపాయలు
పచ్చి మిర్చి
కరివేపాకు
అల్లం
కారం
నెయ్యి
పసుపు
కొత్తిమీర
ఉప్పు
నీరు

పోపుకు కావాల్సినవి :

పచ్చి సెనగ పప్పు
మినప్పప్పు
ఆవాలు

తయారీవిధానం:

ముందుగా సామలను శుభ్రంగా కడిగి.. అనంతరం వాటిని నీటిలో నానబెట్టాలి. ఇలా రెండు గంటలు ముందుగా సామలను నీటిలో నానబెట్టుకోవాలి.
తర్వాత స్టౌ మీద కుక్కర్ పెట్టుకుని వేడి ఎక్కిన తర్వాత నెయ్యి వేసుకుని .. కాగాక ఆవాలు, శనగపప్పు, మినపపప్పు అల్లం ముక్కలను వేసుకుని వేయించుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు , పచ్చి మిర్చి వేసి వేయించుకోవాలి. తర్వాత ఉడికించిన బఠాణి, క్యారెట్ తరుగు, వేసుకుని దోరగా వేయించుకోలి. అనంతరం టమాటో ముక్కలను వేసుకుని పసుపు, కారం వేసుకుని వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత తగినన్ని నీళ్లు వేసుకుని ..సరిపడా ఉప్పు వేసుకుని నీటిని మరిగించాలి. అనంతరం నీటి నుంచి సామలను తీసుకుని మరుగుతున్న నీటిలో వేసుకుని కుక్కర్ మూత పెట్టి.. మూడు విజిల్స్ వచ్చేవరకూ ఉడికించాలి. మూడు విజిల్స్ వచ్చిన అనంతరం కుక్కర్ ను దింపేసి వేడిగా ఉన్న సమయంలో సామల రైస్ మీద కొత్తిమీర వేసుకోవాలి. ఈ టమాటో సామల రైస్ ను కొత్తిమీర చట్నీ తో గానీ అల్లం చట్నీ తో గానీ తింటే మంచి టెస్ట్ వస్తుంది.

Also Read: Mahabharat Moral Story: దేశాన్ని ఏలే రాజుకు ఉండాల్సిన లక్షణాలు ఏమిటో చెప్పిన ద్రోణాచార్య..