శ్రావణ మాసంలో ఉపవాసం చేస్తున్నారా.. తక్షణ శక్తిని ఇచ్చే ఆహారాన్ని సగ్గుబియ్యంతో చేసుకోండి..

|

Jul 22, 2024 | 8:35 PM

ప్రజలు ఉపవాస సమయంలో పండ్లు, సగ్గుబియ్యంతో చేసిన ఆహరాన్ని తింటారు. అయితే తక్కువ సమయంలో సగ్గుబియ్యంతో ఆరోగ్యకరమైన ఆహారం తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా శక్తిని ఇచ్చే ఆహారాన్ని ఈజీగా తీసుకోవచ్చు. వీటిని తయారు చేసుకోవడానికి ముందు సగ్గుబియ్యం కొంత సమయం పాటు నానబెట్టుకోవాలి. అటువంటి పరిస్థితిలో ఈ రోజు మనం సగ్గుబియ్యంతో తయారు చేసే రెండు రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకాల గురించి తెలుసుకుందాం..

శ్రావణ మాసంలో ఉపవాసం చేస్తున్నారా.. తక్షణ శక్తిని ఇచ్చే ఆహారాన్ని సగ్గుబియ్యంతో చేసుకోండి..
Sabudana Khichdi
Follow us on

హిందూ మతంలో శ్రవణ మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ నెలలో శివయ్యతో పాటు వరలక్ష్మి, మంగళ గౌరిని పూజిస్తారు. అంతేకాదు సోమవారం, మంగళవారం, శుక్రవారాలు భక్తిగా పూజలు చేస్తారు. శివ పార్వతీ దేవిల అనుగ్రహం కోసం ఉపవాసం చేస్తారు. ఉపవాస సమయంలో చాలా మంది రోజుకు ఒకసారి ఆహారం తీసుకుంటారు. అయితే ఆఫీస్‌కి వెళ్లాల్సిన వారు లేదా పగటిపూట ఎక్కువ శారీరక శ్రమ చేయాల్సిన వారు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ప్రజలు ఉపవాస సమయంలో పండ్లు, సగ్గుబియ్యంతో చేసిన ఆహరాన్ని తింటారు. అయితే తక్కువ సమయంలో సగ్గుబియ్యంతో ఆరోగ్యకరమైన ఆహారం తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా శక్తిని ఇచ్చే ఆహారాన్ని ఈజీగా తీసుకోవచ్చు. వీటిని తయారు చేసుకోవడానికి ముందు సగ్గుబియ్యం కొంత సమయం పాటు నానబెట్టుకోవాలి. అటువంటి పరిస్థితిలో ఈ రోజు మనం సగ్గుబియ్యంతో తయారు చేసే రెండు రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకాల గురించి తెలుసుకుందాం..

సగ్గు బియ్యం కిచిడీకి కావాల్సిన పదార్ధాలు:

సగ్గు బియ్యం – 1 కప్పు

ఇవి కూడా చదవండి

శెనగపప్పు,

ఒలిచిన, వేయించిన వేరుశెనగ పప్పు

జీలకర్ర 1 టీస్పూన్

కరివేపాకు

నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు

ఎర్ర మిరపకాయలు-4

కారం – 1 టీస్పూన్

ఉప్పు- రుచికి తగినంత

పచ్చిమిర్చి- తరిగిన ముక్కలు

సగ్గు బియ్యం కిచిడీ తయారు విధానం: ముందుగా సగ్గు బియ్యాన్ని నీటితో బాగా శుభ్రంగా కడిగి ఒక గంట పాటు నీటిలో నానబెట్టండి. ఇప్పుడు వాటిని నీటి నుంచి వేరు చేసి ఒక చిల్లుల గిన్నెలో వేసుకోండి. ఇలా నీరు లేకుండా ఆరిపోయే వరకూ అంటే సుమారు 2 గంటలు వదిలివేయండి. (సగ్గుబియ్యంలోని నీరు ఆరకపోతే అవి జిగటగా మారతాయి). ఇంతలో స్టవ్ మీద బాణలి పెట్టి వేరుశెనగ పలుకులను వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అవి చల్లారాక మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి.

ఇప్పుడు పాన్ తీసుకుని నెయ్యి వేసి కొద్దిగా వేడెక్కనివ్వండి. నెయ్యి వేడయ్యాక అందులో జీలకర్ర వేసి దాని రంగు లేత బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. దీని తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి 10 నుండి 20 సెకన్ల పాటు వేయించాలి. ఇప్పుడు అందులో శనగ పప్పు, ఉప్పు, కారం వేసి 5 నిమిషాలు వేయించండి. ఇప్పుడు సగ్గు బియ్యం వేసి సుమారు 8 నుండి 10 నిమిషాలు తక్కువ మంట మీద ఉడికించాలి. ఉడికిన తర్వాత వేరుశెనగ పొడి, కొత్తిమీరను వేసి స్టవ్ మీద నుంచి దించాలి. అంతే సగ్గు బియ్యం కిచిడీ రెడీ.

సగ్గుబియ్యం ఖీర్

ఉపవాస సమయంలో సగ్గుబియ్యం ఖీర్ తినడానికి ఇష్టపడతారు. దీన్ని తయారు చేయడానికి కావాల్సిన పదార్ధాలు

చిన్న సగ్గుబియ్యం- 1/2 కప్పు

పాలు-4 కప్పులు

బాదం పప్పు

జీడిపప్పు

కిస్ మిస్,

నీరు- 1 కప్పు

యాలకుల పొడి-చిటికెడు ,

చక్కెర లేదా బెల్లం రుచికి సరిపడా

ఈ ఖీర్‌ను తయారు చేయడానికి ముందుగా 2 నుండి 3 సార్లు సగ్గుబియ్యాన్ని నీటితో బాగా కడగాలి. సుమారు 2 గంటల పాటు నీటిలో నానబెట్టండి. దీని తర్వాత నీరు పోయే వరకూ ఆ సగ్గుబియ్యం ఆరబెట్టాలి. ఇప్పుడు పాన్ ను తక్కువ మంట మీద ఉంచాలి. అందులో పాలు వేసి వేడి చేయాలి. పాలు మరుగుతున్నప్పుడు నానబెట్టిన సగ్గుబియ్యం, రుచి ప్రకారం చక్కెర వేసి, చెంచాతో బాగా కలపాలి. తక్కువ మంట మీద ఉడికించాలి. గిన్నెకు అంటుకోకుండా ఒక చెంచాతో నిరంతరం కదుపుతూ ఉండాలి. 10 నుండి 15 నిమిషాలు ఉడికించిన తర్వాత మంట తగ్గించి అందులో యాలకుల పొడి వేయాలి. పాలు చిక్కబడే వరకు ఉడికించాలి. 5 నుండి 7 నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి.. ఈ మిశ్రమానికి డ్రై ఫ్రూట్స్ జోడించాలి. అంతే సగ్గుబియ్యం ఖీర్ రెడి

 

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..