Heart Health: మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాలు రోజూ తినండి.. వ్యాధులు దూరంగా ఉంటారు..!

|

Jun 11, 2024 | 3:43 PM

గుండె ఆరోగ్యానికి మేలు చేసే వాటిలో.. బీన్స్‌, కాయధాన్యాలు, శనగలు కూడా ముందు వరుసులో ఉన్నాయి. వీటిల్లో ప్రొటీన్‌, ఫైబర్‌, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గిస్తాయి. చిక్కుళ్లను తరచూ మన ఆహారంలో చేర్చుకుంటే.. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

Heart Health: మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాలు రోజూ తినండి.. వ్యాధులు దూరంగా ఉంటారు..!
Heart Health
Follow us on

గుండె మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం. ఇది ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యమైనది. కొన్ని ధాన్యాలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వ్యాధులను దూరం చేస్తాయి. మిల్లెట్ మెగ్నీషియం, ఫైబర్ మంచి మూలం. ఇది గుండె, కొలెస్ట్రాల్ వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. మీరు మీ రోజువారీ ఆహారంలో ఈ ఐదు రకాల ధాన్యాలను చేర్చుకుంటే మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్‌కు కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. మీరు అనేక వ్యాధుల నుండి రక్షించబడతారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

జొన్నలు,ఓట్స్‌, బ్రౌన్‌ రైస్‌, క్వినోవా వంటి తృణధాన్యాల్లో ఫైబర్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్‌ రక్తంలో కొలెస్ట్రాల్‌ కలవకుండా అడ్డుకుంటుంది. ఇప్పటికే ఒంట్లో నిలువైన కొవ్వును బయటకు వెళ్లగొడుతుంది కూడా. జొన్నలో ఫైబర్, ఐరన్, మెగ్నీషియం వంటి అంశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

ఓట్స్‌లో అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది రక్తపోటును తగ్గిస్తుంది. గుండె జబ్బుల ప్రమాదం నుండి రక్షిస్తుంది.రోజుకు ఒక కప్పు ఓట్స్‌ తిన్నాకూడా 30శాతం వరకు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకునే అవకాశముంది. ఇది జిగురుద్రవంలా మారి జీర్ణాశయంలో ఎక్కువసేపు ఆహారం అక్కడే ఉండేలా చేస్తుంది. కడుపు నిండిన భావన కలిగిస్తుంది. ఆహారం త్వరగా జీర్ణం కాకుండా చూస్తూ రక్తంలోకి గ్లూకోజు నెమ్మదిగా వెళ్లేలా చేస్తుంది. ఫైబర్‌ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

ఇవి కూడా చదవండి

బ్రైన్‌ రైస్‌ కూడా గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఫైబర్, మెగ్నీషియం, విటమిన్ B6 వంటి మూలకాలు బ్రౌన్ రైస్‌లో ఉంటాయి. ఇది వైట్ రైస్ కంటే ఎక్కువ పోషకమైనది. క్వినోవా కూడా గుండెకు మేలు చేస్తుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేసే వాటిలో.. బీన్స్‌, కాయధాన్యాలు, శనగలు కూడా ముందు వరుసులో ఉన్నాయి. వీటిల్లో ప్రొటీన్‌, ఫైబర్‌, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గిస్తాయి. చిక్కుళ్లను తరచూ మన ఆహారంలో చేర్చుకుంటే.. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..