
స్వీట్లు భారతీయ జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. అది పండుగ అయినా లేదా ఆనంద వేడుక అయినా.. ప్రజలు ఖచ్చితంగా ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటారు. స్వీట్లు లేని పండుగలు, వేడుకలు అసంపూర్ణంగా భావిస్తారు. శ్రావణ పౌర్ణమి రోజున రాఖీ పండగను జరుపుకోనున్నారు. రాఖీ పండగ సందర్భంగా తమ సోదరులకు తినిపించేందుకు మార్కెట్ నుంచి స్వీట్లు కొంటారు. అయితే ఈ ఏడాది రాఖీ పండగ రోజున ఇంట్లో స్వీట్లు తయారు చేసి మీ సోదరుడు, కుటుంబ సభ్యుల నోటికి తీపిని చేయాలనుకుంటే కోవా బర్ఫీని తయారు చేయండి. దీనిని చాలా తక్కువ వస్తువులతో సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ రోజు కోవా బర్పీ రెసిపీ గురించి తెలుసుకుందాం..
కోవా బర్ఫీ తయారుచేయడానికి మంచి కోవాని ఎంపిక చేసుకోండి. గ్యాస్ స్టవ్ మీద పాన్ పెట్టి.. వేడి చేయండి. ఇప్పుడు దానిలో నెయ్యి వేసి కోవా వేసి తక్కువ మంట మీద నిరంతరం కలుపుతూ కోవాని వేయించాలి.
కోవా రంగు మారే వరకు .. అంటే లేత గోధుమ రంగులోకి వచ్చి.. దాని నుంచి మంచి వాసన వచ్చే వరకు నెమ్మదిగా కలుపుతూ వేయించాలి.
కోవా వేగిన అనంతరం అందులో తీపికి సరిపడా చక్కెర కలిపి నిరంతరం కలుపుతూ ఉండండి. ఈ మిశ్రమం చిక్కబడే వరకు కలపండి.
కోవా మిశ్రమం చిక్కబడిన అనంతరం యాలకుల పొడి, తరిగిన జీడిపప్పు, బాదం వేసి కలపండి. ఈ మిశ్రమం పాన్ నుంచి వేరు కావడం ప్రారంభించినప్పుడు.. దాన్ని ఒక ప్లేట్ లోకి మార్చుకోవాలి.
ఒక ప్లేట్ కి నెయ్యి రాసి.. రెడీ చేసుకున్న కోవా మిశ్రమాన్ని వేసి.. సమానంగా పరవండి. ఇలా ప్లేట్ మీద వేసిన మిశ్రమాన్ని చల్లబరచండి. చివరిగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్, గులాబీ రేకలు వేసి.. చల్లారిన తర్వాత.. ఈ మిశ్రమాన్ని నచ్చిన ఆకారంలో కట్ చేసుకోండి. అంతే కోవా బర్ఫీ రెడీ. మీ అన్నదమ్ములకు ఆనందంగా మీరు స్వయంగా చేసిన కోవా బర్ఫీ స్వీట్ ని అందించండి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..