Ragi Ladoo Recipe: ఆరోగ్యాన్ని మేలు.. ఎంతో రుచికరమైన రాగి లడ్డు ఈజీగా ఎలా తయారు చేసుకోవాలంటే

|

Aug 03, 2021 | 2:06 PM

Ragi Ladoo Recipe: ఇప్పటి తరానికి సరిగ్గా తెలియని.. ఒక ధాన్యం రాగులు.. ఈ రాగులు క్రిందటి తరానికి చెందిన భారతీయులకు ప్రత్యేకించి దక్షిణాది వారికీ సుపరిచితం. ఒకప్పుడు ప్రసిద్ధ చిరు..

Ragi Ladoo Recipe: ఆరోగ్యాన్ని మేలు.. ఎంతో రుచికరమైన రాగి లడ్డు ఈజీగా ఎలా తయారు చేసుకోవాలంటే
Ragi Ladoo
Follow us on

Ragi Ladoo Recipe: ఇప్పటి తరానికి సరిగ్గా తెలియని.. ఒక ధాన్యం రాగులు.. ఈ రాగులు క్రిందటి తరానికి చెందిన భారతీయులకు ప్రత్యేకించి దక్షిణాది వారికీ సుపరిచితం. ఒకప్పుడు ప్రసిద్ధ చిరు ధాన్యం.. ఈ రాగులు శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి. అంతేకాదు.. మన వాతావరణానికి ఈ రాగులు మంచి ఆహారం .. ఈ చిరుధాన్యం అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుంది. ఇక రాగి పిండితో రుచికరమైన ఆహారం కూడా తయారు చేసుకోవచ్చు. రాగి పిండి దోశ , రాగి లడ్డూలు, బిస్కెట్లు, పకోడీల వంటి అనేక రకాల వంటకాలను తయారుచేసుకోవచ్చు. ఇప్పుడు రాగిపిండి లడ్డు తయారీ విధానము గురించి తెలుసుకుందాం..

తయారీకి కావాల్సిన పదార్ధాలు :

రాగి పిండి ఒక కప్పు
నెయ్యి అరకప్పు
బెల్లం ఒక కప్పు
పచ్చి కొబ్బరి పావు కప్పు
నువ్వులు రెండు టేబుల్ స్పూన్లు
పల్లీలు (వేరుశనగలు) కొన్ని
బాదం పప్పు
జీడిపప్పు
యాలకుల పొడి కొంచెం

తయారీ విధానం :

ముందుగా స్టౌ వెలిగించి బాణలి పెట్టి.. నూనె నెయ్యి లేకుండా స్విమ్ మీద నువ్వులు, వేరుశనగలు, తురిమిన కొబ్బరిను వేరు వేరుగా వేయించుకోవాలి. చల్లారిన తర్వాత వేరుశనగల పై పొత్తు తీసివేయాలి. తర్వాత బాణలి లో నెయ్యి వేసుకుని బాదాం, జీడిపప్పు వేయించుకుని పక్కన పెట్టుకోవాలీ. తర్వాత మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకుని రాగి పిండి ని కమ్మటి వాసన వచ్చే వరకూ వేయించుకోవాలి. తర్వాత అందులో వేయించిన బాదంపప్పు, పల్లీలు, కొబ్బరి , నువ్వులు వేసి కలుపుతూ ఉండాలి. తర్వాత బెల్లం, యాలకుల పొడిని వేసుకుని మరికొంచెం సేపు కలుపుకుని స్టౌ ఆపేయాలి. తర్వాత ఈ రాగిపిండి మిశ్రమం చల్లారనివ్వాలి. ఆ పిండిలో నెయ్యి వేసుకుని చేతికి నెయ్యి రాసుకుని లడ్డుల్లా చుట్టుకోవాలి. అంతే ఎంతో టేస్టీ టేస్టీ రగిలడ్డు రెడీ

Also Read: సుఖమైన నిద్ర ఆరోగ్యానికి మేలు.. ఏ వయసువారు ఎంత సమయం నిద్రపోవాలంటే