Health Tips: స్థూలకాయం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. అధిక బరువు ఉంటే కారణంగా ఎన్నో రకాల వ్యాధులు మనషులను ఈజీగా అటాక్ చేస్తాయి. అందుకే స్థూలకాయం సమస్యకి చెక్ పెట్టడానికి అందరూ రకరకాల మార్గాలను అన్వేశిస్తూ ఉంటారు. అధిక బరువు తగ్గడానికి వ్యాయామాలతోపాటు.. డైలీ డైట్‌లో కొన్ని మార్పులు చేయడం అవసరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బరువు తగ్గడానికి రాగులు చాలా బాగా ఉపయోగపడతాయని పలు పరిశోధనల్లో నిరూపితమైంది. ఫింగర్ మిల్లెట్స్ వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. రాగిలో కొలెస్ట్రాల్, సోడియం పెద్దగా ఉండవు. కొవ్వు 7 పర్సెంట్ మాత్రమే ఉంది. వీటితోపాటు.. కాల్షియం, విటమిన్లు, ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు లాంటివి రాగుల్లో దండిగా ఉంటాయి. వీటిని రోజూ ఆహారంలో చేర్చడం ద్వారా మీ శరీరానికి అవసరమైన పోషకాలు లభించడంతోపాటు.. బరువు కూడా చెక్ పెట్టవచ్చు. రాగుల వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం పదండి.
డైలీ రాగి జావను తాగవచ్చు. ఉదయం టిఫెన్‌గా.. మొలకెత్తిన రాగులను తినవచ్చు. దీంతోపాటు రాగి పిండితో ఇడ్లీలు, దోశలను తయారు చేసుకొని తినవచ్చు. దీంతోపాటు పలు రకాల వంటలు చేసుకొని తినవచ్చు. రాగుల్లో కాల్షియం అధికంగా ఉంటుంది కాబట్టి.. కిడ్నీల్లో రాళ్లు ఉన్నవారు.. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడే వారు తినకూడదు. థైరాయిడ్ రోగులు కూడా రాగులను తినకపోతే మంచిదని నిపుణులు చెబుతున్నారు.