Radish Leaves Juice Benefits: శీతాకాలంలో ఆరోగ్యంపై ఎక్కువగా దృష్టిసారించాలి. ఈ కాలంలో ఎక్కువగా సీజనల్ వ్యాధులు వచ్చే ప్రమాదముంది. కావున చలికాలంలో ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయలను తినాలి. ఇందుకోసం చాలామంది మార్కెట్లోకి ఎక్కువగా వచ్చే కూరగాయలు, ఆకు కూరలను తింటుంటారు. ఈ కూరగాయల్లో ముల్లంగి కూడా ఒకటి. చలికాలంలో వచ్చే ముల్లంగిని చాలామంది ఇష్టపడతారు. అయితే.. ముల్లంగి కొనేటపుడు దాని ఆకులను పడేస్తుంటారు. కానీ ఆ ముల్లంగి ఆకుల్లో ఆరోగ్యానికి మేలు చేసే అనేక ఔషధాలు ఉంటాయి. ముల్లంగి ఆకులతో కూర చేసుకున్నా.. లేకపోతే రసం చేసుకొని తాగినా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఈ ముల్లంగి ఆకుల రసంలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్, క్లోరిన్, సోడియం, ఐరన్, మెగ్నీషియం, అలాగే విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి వంటి పోషకాలు ఉన్నాయి. ఈ పోషకాలు శరీరంలోని అనేక సమస్యల నుంచి రక్షించడంలో సహాయపడతాయి. కాబట్టి ముల్లంగి ఆకుల పానీయం, ప్రయోజనాలు చేకూర్చే రెసిపీ తయారీని ఇప్పుడు తెలుసుకుందాం..
ముల్లంగి ఆకుల రసం ప్రయోజనాలు
1. జీర్ణక్రియ
ముల్లంగి ఆకులలో తగిన మొత్తంలో పీచు ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరి ఉదరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముల్లంగి ఆకులతో తయారుచేసిన పానీయం తీసుకుంటే జీర్ణక్రియ సమస్యను అధిగమించవచ్చు.
2.స్థూలకాయం
మీరు చలికాలంలో బరువు తగ్గాలనుకుంటే.. దీనిని ఉపయోగిస్తే మేలు చేకూరుతుంది. ముల్లంగి ఆకులతో తయారుచేసిన పానీయాన్ని తీసుకోవడం ద్వారా మీరు సులభంగా బరువు తగ్గించుకోవచ్చు. దీనిలోని పోషకాలు కొవ్వును తగ్గిస్తాయి.
3. రక్తపోటు సమస్య
రక్తపోటు సమస్య ఉన్నట్లయితే, ముల్లంగి ఆకుల పానీయం తీసుకుంటే మేలు. రక్తపోటు బాధితులు ప్రతిరోజూ తీసుకుంటే.. బీపీ తగ్గుతుంది. ముల్లంగి ఆకులలోని సోడియం శరీరంలో ఉప్పు కొరతను తీర్చి.. బీపీని నివారిస్తుంది.
ముల్లంగి ఆకుల డ్రింక్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం..
ముల్లంగి ఆకుల జ్యూస్‌ను సులభంగా తయారుచేసుకోవచ్చు. అవసరమైనన్నీ తాజా ముల్లంగి ఆకులను తీసుకోండి. ఆ తరువాత ముల్లంగి ఆకులను 2-3 సార్లు శుభ్రమైన నీటితో కడగాలి. దీని తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి, ఆకులను మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత నల్ల ఉప్పు, చిటికెడు ఎండుమిర్చి పొడి, రుచికి అనుగుణంగా నిమ్మరసం వేయాలి. ఆ తర్వాత వడపోసి.. రసాన్ని ఉదాయాన్నే తాగితే చాలా ప్రయోజనాలు కలుగుతాయి.
Also Read: