Semiya Chakkara Pongali: స్వీట్ తినాలనిపిస్తుందా..అప్పటికప్పుడు సేమ్యా చక్కర పొంగలి చేసుకోండి.. రెసిపీ..

పండగలు, శుభకార్యాల సమయంలో మాత్రమే కాదు ప్రత్యేక సందర్భాల్లో కూడా చక్కర పొంగలి, బొబ్బట్లు, బూరెలు వంటి రకరకాల సాంప్రదాయ స్వీట్స్ ను తయారు చేస్తారు. అయితే రెగ్యులర్ స్వీట్స్ కంటే కొంచెం డిఫరెంట్ గా సాంప్రదాయ స్వీట్ ని ట్రై చేయాలనుకుంటే సేమ్యా తో చక్కర పొంగలి చేసుకోండి. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే వెంటనే స్వేమ్యా చేసుకోండి.. రెసిపీ మీ కోసం..

Semiya Chakkara Pongali: స్వీట్ తినాలనిపిస్తుందా..అప్పటికప్పుడు సేమ్యా చక్కర పొంగలి చేసుకోండి.. రెసిపీ..
Semiya Chakkara Pongali

Updated on: Apr 16, 2025 | 11:03 AM

సాధారణ పండగల సమయంలో మాత్రమే కాదు ప్రత్యేక సందర్భాల్లో సేమ్యా చక్కెర పొంగలి చేరుకోవచ్చు. ఎప్పుడైనా స్వీట్ తినాలని అనిపిస్తే.. ఈ స్వీట్ డిష్ ను తక్కువ సమయంలోనే చేసుకోవచ్చు. దీనిని సేమ్యా, పంచదార, బాదాం, కిస్మిస్, వంటి వాటితో తయారు చేస్తారు. దీనిని దేవుడికి నైవేద్యంగా కూడా సమర్పించవచ్చు. ఈ రోజు చాలా ఈజీగా సేమ్యా చక్కెర పొంగలిని తయారు చేసుకోవడం ఎలా.. రెసిపీ తెలుసుకుందాం..

కావలసిన పదార్ధాలు

సేమ్య – 1 కప్పు

పెసరపప్పు_ 1/2 కప్పు

ఇవి కూడా చదవండి

బెల్లం(బ్రౌన్ షుగర్) – 2 కప్పులు

యాలకుల పొడి- 1/2 టీ స్పూన్

నెయ్యి- 1/2 కప్పు

జీడిపప్పులు

కిస్ మిస్

ఎండు కొబ్బరి ముక్కలు

పచ్చ కర్పూరం – చికికెడు

తయారీ విధానం: ముందుగా పెసర పప్పుని ఒక గిన్నెలో నానబెట్టుకోవాలి. గ్యాస్ స్టవ్ మీద బాణలి పెట్టి నెయ్యి వేసి ముందుగా ఎండు కొబ్బరి ముక్కలు వేసి వేయించి.. తర్వాత జీడిపప్పు, కిస్ మిస్ లు వేసి వేయించి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత కొంచెం నెయ్యి వేసి సేమ్యాను వేసి దోరగా బంగారు రంగు వచ్చేవరకూ వేయించి అందులో పెసర పప్పుని వేసి వేయించండి. తర్వాత సేమ్యా, పెసర పప్పులో మూడు కప్పుల నీరు పోసి మెత్తగా ఉడికించండి. ఇంతలో ఒక గిన్నెలో బెల్లం పొడి వేసి కొంచెం నీరు పోసి కరిగించుకోవాలి. కొంచెం బెల్లం కరిగిన తర్వాత ఉడికించుకున్న సేమ్యా, పెసర పప్పుల మిశ్రమంలో బెల్లం నీరుని వడకట్టండి. ఉడికించిన సేమ్యా, పెసర పప్పు మిశ్రమం ఉడికిన తర్వాత అందులో కొంచెం నెయ్యి, యాలకుల పొడీ, జీడిపప్పు, కిస్ మిస్ లు వేసి కొంచెం సేపు కలిపి దింపుకోవాలి.

 

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..