AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నోట్లో వేసుకుంటే కరిగిపోయే పెసర, మినప పప్పు బర్ఫీ.. రోజుకు రెండు తిన్నారంటే తిరుగుండదు!

ఎంతో హెల్దీ అండ్ టేస్టీ మినప బర్ఫీ తయారు చేసుకోవటం చాలా ఈజీ.. చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా ఉంటాయి. పిల్లలైతే రోజు ఒక్క బర్ఫీ తిన్నా సరే చాలా బలంగా ఆరోగ్యంగా ఉంటారు. అప్పుడప్పుడు ఇలా స్వీట్ చేసి పెట్టారంటే, కొంతమంది పిల్లలు సున్నుండలు తినరు అలాంటి వాళ్లకు ఇలా మినపప్పుతో బర్ఫీ చేసి పెట్టండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా నోట్లో పెట్టుకుంటే అలా మెల్ట్ అయిపోతుంది. కావాల్సిన పదార్థాలు, తయారీ విధానంగా వివరంగా తెలుసుకుందాం..

నోట్లో వేసుకుంటే కరిగిపోయే పెసర, మినప పప్పు బర్ఫీ.. రోజుకు రెండు తిన్నారంటే తిరుగుండదు!
Protein Rich Dal Barfi
Jyothi Gadda
|

Updated on: Jul 23, 2026 | 8:45 PM

Share

ఈ వంటకం మినపపప్పు, పెసరపప్పు, బెల్లంతో చేసే చాలా రుచికరమైన, ఆరోగ్యకరమైన మినప-పెసర బెల్లం బర్ఫీ. సున్నుండలకి ఇది సరికొత్త ప్రత్యామ్నాయం. ఈ స్వీట్ తయారీకి కావాల్సిన పదార్థాలు, రెసిపీని ఇప్పుడు చూద్దాం..

మినప-పెసర బెల్లం బర్ఫీకి కావాల్సిన పదార్థాల:

మినప గుళ్ళు: 1 కప్పు

ఇవి కూడా చదవండి

పొట్టులేని పెసరపప్పు: ½ కప్పు

బెల్లం తురుము: 2 కప్పులు

నీళ్ళు: 1 కప్పు

పాలు: 1 కప్పు

నెయ్యి: 4 స్పూన్లు (3 స్పూన్లు పాకంలో + 1 స్పూన్ చివరిలో)

యాలకుల పొడి: ½ స్పూన్

ఉప్పు: చిటికెడు

తయారీ విధానం:

ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి, 1 కప్పు మినప గుళ్ళను సిమ్‌లో పెట్టి డ్రై రోస్ట్ చేయండి. పప్పు 50శాతం వేగిన తర్వాత ½ కప్పు పొట్టులేని పెసరపప్పు వేసి, రెండింటినీ దోరగా వేయించి ఒక ప్లేట్‌లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన పప్పులను మిక్సీ జార్‌లో వేసి, మరీ మెత్తగా కాకుండా లైట్‌గా రవ్వ రవ్వగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి.

ఇప్పుడు మరొక పాన్‌లో 2 కప్పుల బెల్లం, 1 కప్పు నీళ్ళు వేసి బెల్లం కరిగే వరకు వేడి చేయండి. తీగ పాకం అవసరం లేదు. బెల్లం కరిగి నురగ వచ్చి కాస్త చిక్కబడితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి, అందులో 3 స్పూన్ల నెయ్యి వేసి కలిపి, బెల్లం నీళ్ళను పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన బెల్లం నీళ్ళలో గ్రైండ్ చేసుకున్న పప్పుల పొడిని వేసి ఉండలు లేకుండా బాగా కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టి, సిమ్‌లో మాత్రమే కలుపుతూ ఉడికించండి.

మిశ్రమం కాస్త ఉడకడం మొదలయ్యాక, అందులో 1 కప్పు పాలు పోసి బాగా కలపండి. మిశ్రమం దగ్గర పడేవరకు కలుపుతూ ఉడికించి, ఆ తర్వాత ½ స్పూన్ యాలకుల పొడి, చిటికెడు ఉప్పు, 1 స్పూన్ నెయ్యి వేసి కలపండి. స్వీట్ నుండి నెయ్యి వేరవుతూ, పాన్ నుండి విడివడి దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయండి.

స్వీట్ కాస్త చల్లారిన తర్వాత చిన్న చిన్న బౌల్స్ లేదా మోల్డ్స్‌లో ప్రెస్ చేసి, ప్లేట్‌లోకి బోర్లిస్తే అందమైన షేప్ వస్తుంది. బటర్ పేపర్‌పై లేదా నెయ్యి రాసిన ప్లేట్‌పై ఈ స్వీట్‌ను ఉంచి, రోల్ చేసి లేదా పరుచుకుని ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. పంచదారకు బదులుగా బెల్లం, ఐరన్, ప్రోటీన్లు పుష్కలంగా ఉండే మినప గుళ్ళు, పెసరపప్పు వాడటం వల్ల పిల్లలకి, పెద్దలకి చాలా బలం.

కేవలం మినపప్పు కాకుండా పెసరపప్పు కూడా చేర్చడం వల్ల జిగురు లేకుండా నోట్లో వేస్తే కరిగిపోయేంత మెత్తగా, రుచిగా వస్తుంది. ఈ బర్ఫీలు కనీసం 4 రోజుల పాటు తాజాగా ఉంటాయి. సున్నుండలు తినని పిల్లలకు ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us