Summer Tips: వేసవిలో ఎసిడిటీ ఇబ్బంది పెడుతోందా?.. అయితే ఈ ఆహార పదార్థాలు తప్పక తీసుకోవాల్సిందే..

|

Mar 24, 2022 | 8:07 AM

Summer Health Tips: వేసవిలో ఉష్ణోగ్రత పెరుగుదల కారణంగా శరీరంలో నీటి స్థాయులు తగ్గిపోతాయి. ఈ పరిస్థితుల్లో మసాలా, నూనెలు కలిగిన ఆహారం తీసుకోవడం వల్ల పలు జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.

Summer Tips: వేసవిలో ఎసిడిటీ ఇబ్బంది పెడుతోందా?.. అయితే ఈ ఆహార పదార్థాలు తప్పక తీసుకోవాల్సిందే..
Acidity
Follow us on

Summer Health Tips: వేసవిలో ఉష్ణోగ్రత పెరుగుదల కారణంగా శరీరంలో నీటి స్థాయులు తగ్గిపోతాయి. ఈ పరిస్థితుల్లో మసాలా, నూనెలు కలిగిన ఆహారం తీసుకోవడం వల్ల పలు జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. రోగనిరోధక వ్యవస్థ (Immunity System) కూడా దెబ్బతింటుంది. శరీరంపై బ్యాక్టీరియా, వైరస్‌ల దాడి ఎక్కువవుతుంది. ఈ కారణాల వల్లనే ప్రజలు వేసవిలో తరచుగా కడుపు ఇన్ఫెక్షన్, కడుపు నొప్పి, గ్యాస్, ఎసిడిటీ, విరేచనాలు, వాంతులు వంటి జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా చాలా మందిని ఎసిడిటీ (Accidity) సమస్య బాగా ఇబ్బంది పెడుతుంది. అటువంటి పరిస్థితిలో, మనం పుష్కలంగా నీరు తాగాలి. ఎందుకంటే నీరు మన శరీరం నుండి విషతుల్య పదార్థాలు (ట్యాక్సిన్లు)ను బయటకు పంపుతుంది. దీంతో పాటు నీటి శాతం కలిగిన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. ఇవి శరీరానికి చలువను తీసుకొస్తాయి. మరి వేసవి(Summer)లో ఎసిడిటీ సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు తీసుకోవాల్సిన కొన్ని పదార్థాల గురించి తెలుసుకుందాం రండి.

మజ్జిగ

వేసవిలో మజ్జిగ ఒక వరం లాంటిది. ఇది శరీరానికి చలువనిస్తుంది. ఇందులో ఉండే సహజసిద్ధమైన బ్యాక్టీరియా కడుపులో అధిక మొత్తంలో యాసిడ్ ఏర్పడకుండా చేస్తుంది. ఫలితంగా ఎసిడిటీతో పాటు, ఇతర ఉదర సంబంధిత సమస్యలను దూరం చేయడంలో దోహదపడుతుంది. వేసవిలో ఆహారం తిన్న తర్వాత కొంచెం మజ్జిగ తప్పనిసరిగా తాగాలి.

కొబ్బరి నీరు

కొబ్బరి నీళ్లలో ఆరోగ్య పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని నీటి కొరతను పోగొట్టి చల్లదనాన్ని అందిస్తాయి. అంతేకాదు కోకోనట్‌ వాటర్లో శరీరాన్ని డిటాక్సిఫై చేసే గుణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎసిడిటీని దూరం చేస్తాయి. అలాగే ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.

అరటి పండ్లు

వేసవిలో పండిన అరటిపండ్లను తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇందులో ఐరన్, కాల్షియం, పొటాషియం, ఫైబర్ వంటి గుణాలు అధికంగా ఉంటాయి. ఇక ఇందులో ఉండే పొటాషియం ఎసిడిటీని నియంత్రిస్తుంది. అదేవిధంగా ఫైబర్ సమృద్ధిగా ఉండటం వల్ల జీర్ణక్రియకు సంబంధించిన ఇతర సమస్యలు దూరమవుతాయి.

పాలు

వేసవిలో ఎసిడిటీ సమస్య అధికంగా ఉంటే చల్లని పాలు తీసుకోవడం ఎంతో ఉత్తమం. వేసవిలో చల్లటి పాలు తాగడం వల్ల శరీరానికి చల్లదనంతో పాటు బర్నింగ్, ఎసిడిటీ వంటి సమస్యలు దూరమవుతాయి. అయితే ఫ్రిజ్‌లో ఉంచిన పాలు బదులు సాధారణ చల్లని పాలను తాగాలి.

పండ్లు

యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ యాసిడ్ రిఫ్లక్స్‌లో పుష్కలంగా ఉండటం వల్ల పుచ్చకాయ ఉదర సంబంధిత సమస్యలకు చక్కటి పరిష్కారం. దీనిని తీసుకోవడం వల్ల బాడీ హైడ్రెటెడ్‌గా ఉంటుంది. గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలను నియంత్రించడంలో కూడా ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది.

(నోట్‌: ఇందులోని అంశాలన్ని కేవలం అవగాహన కోసం మాత్రమే. వైద్య నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే ముందుగా వైద్యులను సంప్రదించడం ఉత్తమం)

Also Read:Chennai Super Kings: IPL 2022లో కొత్త జెర్సీలో కనిపించనున్న సీఎస్కే ఆటగాళ్లు..

COVID Vaccination: వేగవంతంగా వ్యాక్సినేషన్.. కోవిడ్ రక్కసికి చెక్ పెట్టిన మోడీ సర్కార్ వ్యూహం..

CM KCR: యాసంగిలో పండిన మొత్తం ధాన్యం కొనుగోలు చేయాలి.. ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్‌ లేఖ