ముంబై ఫేమస్ ఫుడ్‌ గురించి తెలుసా.. అది ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు.. ఎలాగంటే..

గొల్గప్పలు, కచోరీలు, దహీ చాట్‌ల నుండి కాతి రోల్స్, టిక్కీల వరకు మీ నోటిలో నీరు వచ్చేలా చేసే అనేక స్ట్రీట్ ఫుడ్స్‌ ఉన్నాయి. ఈ వంటకాలన్నీ..

ముంబై ఫేమస్ ఫుడ్‌ గురించి తెలుసా.. అది ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు.. ఎలాగంటే..
Poha Chicken Bhujing
Follow us

|

Updated on: Nov 25, 2021 | 1:27 PM

Poha Chicken Bhujing Recipe: భోజన ప్రియులు తరచుగా వీధి ఆహారాన్ని తినడానికి ఇష్టపడతారు. మనం రోజూ రకరకాల స్ట్రీట్ ఫుడ్స్ తింటున్నాం. సాధారణంగా మనం తినే వీధి ఆహారాలు చాలా అనారోగ్యకరమైనవి ఉంటాయి. అయితే.. ముంబై స్ట్రీట్ ఫుడ్ అంటే ఇష్టం లేనివారు ఉండరు. ఎవరు.. ఎక్కడి నుంచి వెళ్లినా ముంబైలో లభించే వివిధ రకాల స్ట్రీట్ ఫుడ్స్‌ను ఆస్వాదించకుండా ఉండరు. ఇందలో పోహా చికెన్ భుజింగ్ ఒకటి.

భారతదేశంలోని స్ట్రీట్ ఫుడ్స్ అంటే అందరికీ పిచ్చి. స్ట్రీట్ ఫుడ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గొల్గప్పలు, కచోరీలు, దహీ చాట్‌ల నుండి కాతి రోల్స్, టిక్కీల వరకు మీ నోటిలో నీరు వచ్చేలా చేసే అనేక స్ట్రీట్ ఫుడ్స్‌ ఉన్నాయి. ఈ వంటకాలన్నీ వివిధ ప్రాంతాలకు ఓ స్పెషల్ ఫుడ్ ఉంటుంది.

అయితే మహారాష్ట్రలోని వాసాయిలో ఫేమస్ స్ట్రీట్ ఫుడ్స్‌ ఒకటి ఉంది.. అదేంటో అక్కడి వెళ్లినవారికి మాత్రమే తెలుసి ఉంటుంది. ఇది చాలా ప్రసిద్ధి చెందింది. ఈ స్ట్రీట్ ఫుడ్ చాలా హైజనిక్‌గా ఉంటుంది. అంతే కాదు ఆరోగ్యకరమైన ఫుడ్. ఈ  స్ట్రీట్ ఫుడ్ పోహా, రోస్టెడ్ చికెన్ మిక్స్ చేసి తయారవుతుందని మీకు తెలియజేద్దాం. అందుకే దీన్ని పోహా చికెన్ భుజింగ్ అంటారు.

పోహా చికెన్ భుజింగ్ అనేది విభిన్నమైన ఆరోగ్యకరమైన స్ట్రీట్ ఫుడ్. ఈ పోహా చికెన్ భుజింగ్‌ను స్థానికులే కాదు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు కూడా తెగ ఇష్టంగా లాగిస్తుంటారు. ఇది ముందుగా బొగ్గు మంటపై బంగాళాదుంపలను వేయించి.. ఆ తర్వాత అందులో చికెన్ ముక్కలను మిక్స్ చేస్తారు. ఆ తరువాత నైలాన్ పోహా (అటుకులు)ను కలుపుతారు.

పోహా చికెన్ భుజింగ్ చేయడానికి మొదట ఒక గిన్నె తీసుకొని దానిలో బోన్‌లెస్ చికెన్ ముక్కలను వేసి  ఆపై జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు, పసుపు పొడి మొదలైన పొడి పదార్థాలను వేసి మ్యారినేట్ చేయండి. తర్వాత బంగాళదుంపలు వేసి మెరినేషన్ కోసం పక్కన పెట్టుకోవాలి.

దీని తరువాత గ్రిల్ పాన్ తీసుకోండి. దానిపై కొద్దిగా నూనె, మ్యారినేట్ చేసిన మిశ్రమాన్ని అప్లై చేసి ఉడికించాలి. మంచి రుచి కోసం ఉడికించిన చికెన్ ముక్కలను బొగ్గులపై కాసేపు కాల్చండి.

ఇప్పుడు పోహా సిద్ధం చేయండి..

దీంతో పాటు ప్రత్యేకంగా పోహను సిద్ధం చేసుకోవాలి. స్మోక్డ్ చికెన్ మిశ్రమాన్ని వేసి ప్రతిదీ బాగా కలపాలి. కొత్తిమీర, పుదీనా ఆకులతో అలంకరించండి. వేడి వేడిగా వడ్డించండి. మహారాష్ట్రలోని ఈ ప్రసిద్ధ ఆరోగ్యకరమైన స్ట్రీట్ ఫుడ్‌ని ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. మీరు ఈ రెసిపీని ప్రయత్నించండి. మీ అల్పాహారాన్ని రోజంతా హాయిగా తినండి.

ఇవి కూడా చదవండి: TRS: ఎమ్మెల్సీగా ఎన్నికైన కవితకు వీరాభిమాని బిగ్ విషెస్.. ఏం చేశాడో చూశారా..

Kashi Vishwanath Temple: కాశీ విశ్వనాథ ఆలయంలో దర్శనాలు నిలిపివేత.. సుందరీకరణలో భాగంగా ఈ నిర్ణయం..