AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Perfect Allam Chai: అమృతం లాంటి అల్లం టీ.. హోటల్ స్టైల్ ఫ్లేవర్ రావాలంటే ఆ తప్పులు అస్సలు చేయకండి!

మనదేశంలో ఉదయం నిద్రలేవగానే వేడి వేడి 'టీ' తాగనిదే చాలా మందికి రోజు గడవదు. ముఖ్యంగా వర్షాకాలం, చలికాలం వచ్చిందంటే చాలు.. ఘాటైన 'అల్లం టీ' కి ఉండే క్రేజే వేరు. ఆఫీస్ ఒత్తిడి వల్ల వచ్చే తలనొప్పి అయినా, వాతావరణ మార్పుల వల్ల వచ్చే జలుబు, దగ్గులకైనా వేడి వేడి అల్లం టీ ఒక అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. అయితే, చాలా మంది ఇళ్లలో అల్లం టీ పెట్టేటప్పుడు ఒక పెద్ద సమస్యను ఎదుర్కొంటారు.

Perfect Allam Chai: అమృతం లాంటి అల్లం టీ.. హోటల్ స్టైల్ ఫ్లేవర్ రావాలంటే ఆ తప్పులు అస్సలు చేయకండి!
How To Make Perfect Ginger Tea
Bhavani
|

Updated on: Jul 11, 2026 | 11:47 AM

Share

అల్లం వేసి మరిగించగానే పాలు విరిగిపోవడం లేదా టీకి ఆశించినంత ఘాటు, రుచి రాకపోవడం జరుగుతుంటుంది. మరి పాలు విరిగిపోకుండా, హోటల్ లేదా టీ స్టాల్ స్టైల్‌లో పర్ఫెక్ట్ ఫ్లేవర్‌తో, చిక్కటి అల్లం టీని ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవాలో వంట నిపుణులు చెప్తున్న కొన్ని స్మార్ట్ వంటింటి చిట్కాలను ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం.

1. పాలు విరిగిపోకుండా ఉండాలంటే

అల్లంలో సహజంగానే కొన్ని రకాల ఆమ్లాలు ఎంజైములు ఉంటాయి. మరిగుతున్న పాలల్లో నేరుగా పచ్చి అల్లాన్ని వేస్తే పాలు విరిగిపోయే అవకాశం చాలా ఎక్కువ.

ఈ సమస్య రాకూడదంటే.. ముందుగా ఒక గిన్నెలో నీరు తీసుకుని, అందులో దంచిన అల్లం టీపొడి వేసి కనీసం 3-4 నిమిషాల పాటు బాగా మరిగించాలి. అల్లం రసం నీటిలో బాగా మరిగిన తర్వాతే.. చివరగా వేడి పాలను అందులో పోయాలి. ఇలా చేస్తే పాలు అస్సలు విరగవు.

2. అల్లాన్ని తురమాలా? దంచాలా?

చాలా మంది అల్లాన్ని ముక్కలుగా కోసి లేదా తురిమి టీలో వేస్తుంటారు. కానీ పర్ఫెక్ట్ ఫ్లేవర్ రావాలంటే అల్లాన్ని రోట్లో వేసి కొద్దిగా కచ్చాపచ్చాగా దంచాలి.

దంచడం వల్ల అల్లంలో ఉండే సహజసిద్ధమైన నూనెలు, రసం పూర్తిగా బయటకు వచ్చి టీ డికాషన్‌లో బాగా కలుస్తాయి. దీనివల్ల టీకి మంచి ఘాటు, సువాసన వస్తాయి.

3. మరిగించే సమయం ముఖ్యం

అల్లం మరియు టీపొడి నీటిని మరీ ఎక్కువ సేపు మరిగించకూడదు. ఎక్కువ సేపు మరిగిస్తే టీ డికాషన్ చేదుగా మారుతుంది.

అలాగే పాలు పోసిన తర్వాత కూడా జస్ట్ ఒకటి లేదా రెండు పొంగులు రాగానే స్టవ్ ఆఫ్ చేయాలి. పాలు పోసి ఎక్కువ సేపు మరిగిస్తే అల్లం టీ తన అసలైన ఫ్లేవర్‌ను కోల్పోతుంది.

4. అదనపు రుచి కోసం స్పెషల్ ఇంగ్రీడియంట్స్:

అల్లం టీ రుచిని మరింత పెంచడానికి అల్లంతో పాటు ఒకటి లేదా రెండు యాలకులు ఒక చిన్న దాల్చినచెక్క ముక్కను కూడా దంచి వేసుకోవచ్చు. ఇది వర్షాకాలంలో గొంతు నొప్పి నుండి మంచి ఉపశమనాన్ని ఇస్తుంది.

పంచదారకు బదులుగా బెల్లం వాడాలనుకునే వారు.. టీ పూర్తిగా మరిగి, స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే బెల్లం పొడిని కలపాలి. స్టవ్ ఆన్‌లో ఉండగా బెల్లం వేస్తే పాలు వెంటనే విరిగిపోతాయి.

ఈ చిన్న చిన్న వంటింటి చిట్కాలను పాటిస్తే.. మీ ఇంట్లో ప్రతిరోజూ అమృతం లాంటి పర్ఫెక్ట్ అల్లం టీని ఎంజాయ్ చేయవచ్చు.

Follow Us