Peanut Jaggery : శీతాకాలంలో వేరుశెనగ, బెల్లంతో తింటే ఎన్ని ప్రయోజనాలో..! తెలిస్తే ఇప్పుడే మొదలు పెడతారు..

|

Feb 06, 2024 | 7:10 AM

ప్రతి రోజు గుప్పెడు వేరుశెనగలు, కొద్దిగా బెల్లం కలిపి తింటే కాలుష్యం బారి నుండి మరియు కాలుష్యం కారణంగా వచ్చే అనారోగ్య సమస్యల నుండి బయట పడవచ్చు. అంతేకాదు, వేరుశనగలు, బెల్లం తినటం వల్ల చర్మం మృదువుగా, కాంతివంతంగా మారటంతో సహాయపడుతుంది. చర్మంపై ఉండే మచ్చలు అన్ని తొలగిపోయి చర్మం తాజాగా ఉంటుంది. ఎదుగుతున్న పిల్లలకు వేరుశనగ, బెల్లం కలిపి తినిపిస్తే రోజంతా ఉషారుగా ఉంటారు.

Peanut Jaggery : శీతాకాలంలో వేరుశెనగ, బెల్లంతో తింటే ఎన్ని ప్రయోజనాలో..! తెలిస్తే ఇప్పుడే మొదలు పెడతారు..
Peanut Jaggery
Follow us on

అందరికీ ఆరోగ్యకరమైన శరీరం అవసరం. శరీరానికి అవసరమైన పోషకాలు, విటమిన్లు తీసుకోవడం చాలా ముఖ్యం. కానీ కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల శరీరం దృఢంగా, ఆరోగ్యంగా ఉంటుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. వేరుశెనగ, బెల్లం వంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. శరీరానికి ప్రొటీన్లు, ఫాస్పరస్, థయామిన్ వంటి పోషకాలు అవసరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కానీ, ఈ పోషకాలు కొన్ని పదార్థాలను తీసుకోవడం ద్వారా మన శరీరానికి అందుతాయి. అందులో వేరుశనగ, బెల్లం వంటివి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వేరుశెనగ తినడం శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాదు ఇందులో మంచి కొవ్వు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే బెల్లంలో కూడా అనేక విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఈ క్రమంలోనే రోజూ గుప్పెడు వేరుశెనగలతో కొంచెం బెల్లం కలిపి తింటే బోలెడు ప్రయోజనాలు అందుతాయి.

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, వేరుశనగలో గుడ్లు, మాంసం కంటే ప్రోటీన్ శాతం ఎక్కువ. ఇది పిల్లలకు, పెద్దలకు, పాలిచ్చే తల్లులకు మంచిది. వేరుశెనగలను వేయించి బెల్లం కలిపి తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కానీ, వేరుశనగలో అధిక శాతం ఆయిల్‌ ఉంటుందని కొందరు భావిస్తారు..అయితే వేరుశనగలో ఉండే నూనె మేలు చేసేదే. అది చెడు కొలెస్ట్రాల్ కాదు. హాని చేసే కొవ్వు వల్లే స్థూలకాయం వస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతూ స్థూలకాయం తగ్గుతూ ఉంటుంది. గుప్పెడు వేరు శెనగ పప్పు, బెల్లంను కలిపి రోజూ తింటే రక్తం శుద్ధి అవ్వటమే కాకుండా రక్తం ఎక్కువగా తయారవుతుంది.

రక్త హీనత సమస్యతో బాధపడేవారికి వేరుశనగలు, బెల్లం కలిపి తినటం వల్ల బాగా సహాయపడుతుంది. రక్త సరఫరా బాగా జరగటం వలన గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ చలి కాలంలో వచ్చే శ్వాసకోశ సమస్యలు, ఇన్‌ఫెక్షన్ల నుంచి శరీరానికి రక్షణ లభిస్తుంది. దగ్గు, జలుబు ఉన్నవారు ఈ రెండింటినీ కలిపి తింటే చాలా మంచిది.

ఇవి కూడా చదవండి

మారుతున్న వాతావరణ కాలుష్యం కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ప్రతి రోజు గుప్పెడు వేరుశెనగలు, కొద్దిగా బెల్లం కలిపి తింటే కాలుష్యం బారి నుండి మరియు కాలుష్యం కారణంగా వచ్చే అనారోగ్య సమస్యల నుండి బయట పడవచ్చు. అంతేకాదు, వేరుశనగలు, బెల్లం తినటం వల్ల చర్మం మృదువుగా, కాంతివంతంగా మారటంతో సహాయపడుతుంది. చర్మంపై ఉండే మచ్చలు అన్ని తొలగిపోయి చర్మం తాజాగా ఉంటుంది. ఎదుగుతున్న పిల్లలకు వేరుశనగ, బెల్లం కలిపి తినిపిస్తే రోజంతా ఉషారుగా ఉంటారు.

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..