చికెన్, మటన్ బలాదూర్.. ఈ చేప తింటే ఆ సమస్యలన్నీ మాయం..

Pandugappa Fish: అధిక రక్తపోటు, మధుమేహం, కొవ్వు సమస్యలతో సతమతమవుతున్నారా? అయితే చేపల ప్రియుల కోసం ఒక శుభవార్త.. ఇటీవలి అధ్యయనాల ప్రకారం.. పండుగప్ప చేపను తినడం వల్ల దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చని తేలింది. బరువు తగ్గడానికి, కండరాల బలానికి ఇది ఎలా సహాయపడుతుందో ఈ కథనంలో వివరంగా చూద్దాం.

చికెన్, మటన్ బలాదూర్.. ఈ చేప తింటే ఆ సమస్యలన్నీ మాయం..
Padugappa Fish Benefits

Updated on: Mar 02, 2026 | 11:34 AM

నాన్‌వెజ్ ప్రియుల బాగా ఇష్టంగా తినేది చేపలు. చేపల పులుసు, చేపల ఫ్రై అంటే చాలా మందికి పిచ్చి. అయితే మీరు మార్కెట్‌కు వెళ్లే ముందు ఈ విషయం తెలుసుకోండి. మీరు బరువు తగ్గాలని చూస్తున్నారా? లేదా కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవాలనుకుంటున్నారా? అయితే పండుగప్ప చేప మీ ఆహారంలో ఉండాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. ఇటీవలి అధ్యయనాల ప్రకారం.. కొడువా చేప కేవలం రుచిలోనే కాదు ఆరోగ్య ప్రయోజనాల్లోనూ మేటి అని తేలింది. ముఖ్యంగా రక్తపోటును నియంత్రించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. 2017-18లో పశ్చిమ బెంగాల్‌లోని ప్రముఖ విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు నిర్వహించిన పరిశోధన ఫలితాలు గతేడాది విడుదలయ్యాయి. ఈ నివేదిక ప్రకారం.. పండుగప్ప చేప రక్తంలోని చక్కెర స్థాయిలను గణనీయంగా తగ్గిస్తుందని స్పష్టమైంది.

గుండెకు రక్షణ.. మెదడుకు పదును

పండుగప్ప చేపలో ఉండే ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. దీనివల్ల గుండె జబ్బులు, గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అంతేకాకుండా ఇందులోని ఒమేగా-3 ఆమ్లాలు మెదడు పనితీరును మెరుగుపరిచి, జ్ఞాపకశక్తిని పెంచుతాయి. ఇది పిల్లల నుండి వృద్ధుల వరకు అందరికీ ఎంతో మేలు చేస్తుంది.

కంటి చూపు మెరుగు.. ఎముకల బలం

ఈ చేపలో విటమిన్-ఎ, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగుపరచడమే కాకుండా వృద్ధులలో వచ్చే కంటిశుక్లం సమస్యను ఆలస్యం చేస్తాయి. అలాగే ఇతర చేపలతో పోలిస్తే ఇందులో విటమిన్-డి అత్యధికంగా ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా మార్చడానికి, రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి తోడ్పడుతుంది.

బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఛాయిస్

బరువు తగ్గాలని కఠినమైన డైట్ ఫాలో అయ్యేవారికి ఈవా చేప ఒక గొప్ప వరం. 100 గ్రాముల పండుగప్ప చేపలో సుమారు 22 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది కండరాల బలానికి అవసరం. సాల్మన్ చేపతో పోలిస్తే ఇందులో కేలరీలు సగం మాత్రమే ఉంటాయి. అధిక ప్రోటీన్, తక్కువ కేలరీలు ఉండటం వల్ల ఇది శరీరంలో అదనపు కొవ్వును కరిగించి, బరువు తగ్గడానికి దోహదపడుతుంది.

Follow Us