ఎన్ని పేస్టులు వాడినా ఫలితం లేదా..! నోటి దుర్వాసన భరించలేకపోతున్నారా.. అయితే ఈ పొడిని వాడి చూడండి..

|

Apr 15, 2021 | 10:16 PM

Nutmeg Powder : ఆధునిక జీవన శైలిలో సమయ పాలన లేకుండా తినడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నాం. ముఖ్యంగా

ఎన్ని పేస్టులు వాడినా ఫలితం లేదా..! నోటి దుర్వాసన భరించలేకపోతున్నారా.. అయితే ఈ పొడిని వాడి చూడండి..
Nutmeg Powder
Follow us on

Nutmeg Powder : ఆధునిక జీవన శైలిలో సమయ పాలన లేకుండా తినడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నాం. ముఖ్యంగా రాత్రిపూట తిన్న ఆహారం వల్ల నోటి నుంచి దుర్వాసన వెలువడుతుంది. ఇది చాలామంది గమనించకుండా అలాగే ఉండటం వల్ల ఈ సమస్య రోజు రోజుకు ఎక్కువవుతుంది. తర్వాత ఎన్ని పేస్టులు వాడినా ఫలితం ఉండదు. అందుకే మన పూర్వీకులు ఇంట్లో దొరికే జాజికాయ నుంచి ఈ సమస్యను దూరం చేయోచ్చని నమ్మారు. అది ఎలాగో తెలుసుకుందాం.

జాజికాయలను భారతీయులు పురాతన కాలం నుంచి పలు వంటకాల్లో ఉపయోగిస్తున్నారు. జాజికాయలతో వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే జాజికాయల వల్ల మనకు అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. జాజికాయ పొడిని సూప్‌లలో వేసి తీసుకుంటే విరేచనాలు, మలబద్దకం, గ్యాస్‌ తదితర జీర్ణసమస్యలు తగ్గుతాయి. అలాగే శరీరంలో ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి.

జాజికాయల పొడిని నిత్యం తీసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. దీంతో గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. జాజికాయ పొడిని తీసుకోవడం వల్ల దంత సమస్యలు పోతాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది. లివర్‌, కిడ్నీల్లో పేరుకుపోయే వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. నిద్రలేమితో బాధపడేవారు రాత్రి పూట భోజనంతో జాజికాయ పొడి తీసుకుంటే రోజూ రాత్రి చక్కగా నిద్ర పడుతుంది. జాజికాయ నూనె నొప్పులకు బాగా పనిచేస్తుంది. కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. జాజికాయ పొడిలో కాల్షియం, ఐరన్‌, మాంగనీస్‌, పొటాషియం తదితర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల మన శరీరానికి పోషణ లభిస్తుంది. అలాగే రక్త సరఫరా మెరుగు పడుతుంది.

RR vs DC Live Score IPL 2021: మరో వికెట్ కోల్పోయిన రాజస్థాన్.. శివమ్ దూబే అవుట్.. నాలుగు వికెట్లు డౌన్..

IPL 2021 : మనీశ్ పాండేపై వేటు తప్పదా..? సన్‌ రైజర్స్‌ నుంచి తప్పిస్తారా! తెలుసుకోండి..

Smoking cigarette: పొగతాగడం అనారోగ్యానికే కాదు.. ప్రమాదాలకూ కారణం.. కావాలంటే ఈ లెక్కలే చూడండి..