Veg Foods: ఆ విటమిన్ లోపం ఉందా.? మాంసాహారమే తినక్కర్లేదు.. శాఖాహారులకు ఈ 3 ఆహారాలు బెస్ట్..

|

Oct 24, 2022 | 11:45 AM

గుండె, మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో విటమిన్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఆహారం, సూర్యరశ్మి ద్వారా మనం పలు విటమిన్లను పొందవచ్చు.

Veg Foods: ఆ విటమిన్ లోపం ఉందా.? మాంసాహారమే తినక్కర్లేదు.. శాఖాహారులకు ఈ 3 ఆహారాలు బెస్ట్..
Follow us on

ప్రతీ విటమిన్‌కు ఓ ప్రాముఖ్యత ఉంటుంది. అన్ని విటమిన్లు కలిస్తేనే ఆరోగ్యకరంగా ఉండగలం. మనిషి శరీరానికి కావాల్సిన విటమిన్లలో ఏ ఒక్కటి తక్కువైనా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. గుండె, మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో విటమిన్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఆహారం, సూర్యరశ్మి ద్వారా మనం పలు విటమిన్లను పొందవచ్చు. విటమిన్ బీ12.. చాలా ముఖ్యమైన పోషకం.. మనిషికి కావాల్సిన విటమిన్లలో ముఖ్యమైనది. ఇది సరైన మోతాదులో లభించకపోతే చెడు పరిణామాలు తలెత్తుతాయి.

తొందరగా అలసిపోవడం, ఆఫీసులో కునుకు తీయడం ఈ విటమిన్‌ లోపం వల్ల జరుగుతుంది. శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవాలంటే విటమిన్ బీ12 చాలా ముఖ్యం. ఈ పోషకం రెడ్ మీట్, చికెన్, చేపలు, గుడ్లు లాంటి నాన్ వెజ్ ఫుడ్స్‌లో పుష్కలంగా దొరుకుతుంది. అయితే శాఖాహారులకు దీని లోపం ఉంటే మరి ఎలాగని అనుకుంటున్నారా.? వారికి 3 ఆహార ఎంపికలు ఉన్నాయండీ.. అవేంటో తెలుసుకుందాం..

1. పాలు:

పాలల్లో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే దీన్ని సంపూర్ణ ఆహారంగా పిలుస్తారు. రోజూ ఉదయం, రాత్రి పాలు తాగితే శరీరం ఎప్పుడూ బలంగా ఉంటుందని డాక్టర్లు అంటారు.

2. పెరుగు:

పెరుగులో విటమిన్ బీ12తో పాటు విటమిన్ బీ2 కూడా పుష్కలంగా ఉంది. అలాగే సోడియం, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు కూడా ఉండటం వల్ల శరీరానికి కావాల్సిన పోషణ అందుతుంది. అయితే ఎప్పుడూ తక్కువ కొవ్వు ఉండే పెరుగు మాత్రం తీసుకోండి.

3. ఓట్ మీల్:

ఓట్ మీల్‌ను టిఫిన్‌గా తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణుల సలహా. ఇది తీసుకోవడం వల్ల మనం రోజంతా చురుగ్గా ఉండగలం. అలాగే ఇందులో విటమిన్ బీ12 ఉండటం వల్ల అలసటను దరి చేరనివ్వదు.