Instant Idli Mix: గ్రైండర్‌తో పనిలేదు.. ఈ ఇన్‌స్టంట్ ఇడ్లీ మిక్స్‌తో నిమిషాల్లో బ్రేక్‌ఫాస్ట్ రెడీ!

ఉదయం బ్రేక్‌ఫాస్ట్ అనగానే గుర్తొచ్చేది ఇడ్లీ. కానీ దాని కోసం ముందు రోజే పప్పులు నానబెట్టి, గ్రైండర్ ముందు గంటల తరబడి కూర్చుని పిండి రుబ్బడం గృహిణులకు ఒక పెద్ద టాస్క్. కొన్నిసార్లు పిండి రుబ్బడం మర్చిపోతే, ఆ మరుసటి రోజు ఎదురయ్యే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఇకపై ఆ ఇబ్బందులకు గుడ్ బై చెప్పండి. ఈ 'ఇన్‌స్టంట్ ఇడ్లీ మిక్స్' మీ దగ్గర ఉంటే, కేవలం 10 నిమిషాల్లో మెత్తటి ఇడ్లీలను ఆవిరి మీద ఉడికించవచ్చు. దీని తయారీ విధానం, నిల్వ చేసే పద్ధతి ఇప్పుడు మీకోసం..

Instant Idli Mix: గ్రైండర్‌తో పనిలేదు.. ఈ ఇన్‌స్టంట్ ఇడ్లీ మిక్స్‌తో నిమిషాల్లో బ్రేక్‌ఫాస్ట్ రెడీ!
Instant Idli Mix Recipe

Updated on: Feb 28, 2026 | 7:20 PM

పని ఒత్తిడిలో ఉండేవారికి, ఒంటరిగా నివసించే వారికి ప్రయాణాలు చేసే వారికి ‘ఇన్‌స్టంట్ ఇడ్లీ మిక్స్’ ఒక వరం లాంటిది. బయట మార్కెట్లో దొరికే పిండిలో రసాయనాలు ఉండే అవకాశం ఉంది, కానీ మన ఇంట్లోనే శుభ్రంగా తయారు చేసుకునే ఈ పొడి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బియ్యం, మినపప్పు, అటుకుల మిశ్రమంతో తయారయ్యే ఈ పొడిని నెలల తరబడి నిల్వ చేసుకోవచ్చు. పిండి రుబ్బే అవసరం లేకుండానే హోటల్ స్టైల్ ఇడ్లీలను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు:

ఇడ్లీ బియ్యం – 4 కప్పులు

మినపప్పు – 1 కప్పు

అటుకులు – ½ కప్పు

మెంతులు – 1 టీస్పూన్

రాతి ఉప్పు – తగినంత

మిక్స్ తయారు చేసే విధానం:

పాన్ వేడి చేసి మినపప్పు, మెంతులను లేత బంగారు రంగు వచ్చే వరకు సువాసన వచ్చేలా వేయించి చల్లారనివ్వాలి.

అదే పాన్ లో ఇడ్లీ బియ్యం వేసి తక్కువ మంటపై కొద్దిగా వేడి చేయాలి (రంగు మారకూడదు). అలాగే అటుకులను కూడా క్రిస్పీగా అయ్యే వరకు వేయించాలి.

వేయించిన పదార్థాలన్నీ చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి. ఈ పొడిని జల్లెడ పడితే ఇడ్లీలు మరింత మృదువుగా వస్తాయి.

ఈ పొడిలో ఉప్పు కలిపి గాలి చొరబడని కంటైనర్ లో భద్రపరుచుకోవాలి. ఇది నెలల తరబడి తాజాగా ఉంటుంది.

ఇడ్లీ తయారీ విధానం:

అవసరమైనంత పొడిని ఒక గిన్నెలోకి తీసుకుని, అందులో అర కప్పు పులియబెట్టిన పెరుగు, తగినన్ని నీళ్లు పోసి ఇడ్లీ పిండిలా కలుపుకోవాలి.

ఈ మిశ్రమాన్ని 15 నిమిషాల పాటు పక్కన పెట్టాలి.

ఇడ్లీలు పెట్టే ముందు అర టీస్పూన్ బేకింగ్ సోడా వేసి కలిపి, వెంటనే ఇడ్లీ ప్లేట్లలో పోసి 10-12 నిమిషాలు ఆవిరి మీద ఉడికించాలి.

Follow Us