Munagaku Pappu: ఆషాడంలో మునగాకు తినాలని పెద్దల అంటారు.. ఈ రోజు గోదావరి స్టైల్‌లో మునగాకు పప్పు కూర రెసిపీ మీ కోసం..

|

Jun 10, 2024 | 5:20 PM

రానున్నది ఆషాఢమాసం. ఈ నెలలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడంతో పాటు.. మునగాకు పప్పుని, నేరేడు పండ్లు తప్పని సరిగా తినడం వంటి అనేక నియమాలు పాటిస్తారు. దీని కారణం వేసవి కాలం వెళ్లి ఆషాడ మాసం నుంచి వర్షాకాలంలో అడుగు పెడతాం. ఇలా ఋతురువులు మారిన సమయంలో శరీరంలో వివిధ మార్పులు వస్తాయి. దీంతో శరీరానికి రక్షణ ఇచ్చే ఆహారాన్ని ఆషాడమాసంలో తీసుకుంటారు. ముఖ్యంగా మునగాకుతో పప్పు, తెలగపిండి వంటి ఆహారాన్ని తినే ఆహరంలో చేర్చుకుంటారు. ఈ రోజు గోదావరి జిల్లా స్టైల్ లో అమ్మమ్మ కాలం నాటి మునగాకు పప్పు కూర తయారీ విధానం తెలుసుకుందాం..

Munagaku Pappu: ఆషాడంలో మునగాకు తినాలని పెద్దల అంటారు.. ఈ రోజు గోదావరి స్టైల్‌లో మునగాకు పప్పు కూర రెసిపీ మీ కోసం..
Mungaku Pappu Curry
Follow us on

తెలుగు సంవత్సరంలో నాలుగవ నెల ఆషాడ మాసానికి విశిష్ట స్థానం ఉంది. హిందువులు పండగలు తొలి ఏకాదశి నుంచి ప్రారంభమవుతాయి. అంతేకాదు తెలుగు వారు ఆషాడం మాసంలో ఇంద్రియ నిగ్రహంతో పాటు తినే ఆహారంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. రానున్నది ఆషాఢమాసం. ఈ నెలలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడంతో పాటు.. మునగాకు పప్పుని, నేరేడు పండ్లు తప్పని సరిగా తినడం వంటి అనేక నియమాలు పాటిస్తారు. దీని కారణం వేసవి కాలం వెళ్లి ఆషాడ మాసం నుంచి వర్షాకాలంలో అడుగు పెడతాం. ఇలా ఋతురువులు మారిన సమయంలో శరీరంలో వివిధ మార్పులు వస్తాయి. దీంతో శరీరానికి రక్షణ ఇచ్చే ఆహారాన్ని ఆషాడమాసంలో తీసుకుంటారు. ముఖ్యంగా మునగాకుతో పప్పు, తెలగపిండి వంటి ఆహారాన్ని తినే ఆహరంలో చేర్చుకుంటారు. ఈ రోజు గోదావరి జిల్లా స్టైల్ లో అమ్మమ్మ కాలం నాటి మునగాకు పప్పు కూర తయారీ విధానం తెలుసుకుందాం..

తయారీకి కావాల్సిన పదార్ధాలు:

  1. మునగాకు- మూడు కప్పులు (లేత మునగాకు)
  2. కంది పప్పు లేదా అనప పప్పు – ఒక కప్పు
  3. పచ్చి కొబ్బరి తురుము – అర కప్పు
  4. పసుపు – చిటికెడు
  5. ఇవి కూడా చదవండి
  6. ఉప్పు- రుచికి సరిపడా
  7. కారం – ఒకటిన్నర స్పూన్

తాలింపుకి కావాల్సిన పదార్ధాలు:

  1. నెయ్యి లేదా నూనె – పోపుకి సరిపడా
  2. వెల్లుల్లి రెబ్బులు – 15
  3. ఎండు మిర్చి ముక్కలు – 10
  4. జీలకర్ర – ఒక టీ స్పూన్
  5. ఆవాలు – ఒక టీ స్పూన్
  6. కరివేపాకు – రెండు రెమ్మలు
  7. ఇంగువ – చిటికెడు
  8. మినప పప్పు – రెండు టీ స్పూన్లు

మునగాకు పప్పు తయారీ విధానం:

ముందుగా తీసుకున్న పప్పుని శుభ్రం చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. అదే విధంగా మునగాకుని కూడా శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దళసరి గిన్నె పెట్టి.. అందులో పప్పు వేసుకుని వేయించుకోవాలి. దోరగా వేయించిన పప్పులో నీరు వేసి శుభ్రంగా కడిగి.. ఇప్పుడు కావాల్సిన మొత్తంలో నీరు పోసి పప్పు మూడు వంతులు అంటే బద్దగా కనిపించేలా నొక్కితే మొత్తగా అనిపించేలా కందిపప్పుని ఉండికించుకోవాలి. ఉడికిన పప్పు ను వడకట్టి వేరే పల్లెలంలోకి కందిపప్పుని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి నూనే లేదా నెయ్యి వేసి.. వేడి చేయాలి. ఇప్పుడు వెల్లుల్లి, మిరపకాయ ముక్కలు, మినప పప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి వేయించుకుని చివరిగా ఇంగువ వేసి పోపు వేయించుకోవాలి. ఇప్పుడు కడిగి శుభ్రం చేసుకున్న మునగాకుని వేసి వేయించుకోవాలి. ఆకు పూర్తిగా వేగిన తర్వాత ఉడికించిన కందిపప్పుని, కొబ్బరి తురుముని వేసి వేయించి చిటికెడు పసుపు, తగినంత కారం, ఉప్పు వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. తర్వాత బాణలి మీద మూత పెట్టి.. మరికొంచెం సేపు ఉడికిస్తే టేస్టీ టేస్టీ మునగాకు పప్పు రెడీ. రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఇచ్చే ఈ కూరను అన్నం లేదా చపాతీలతో తిన్నా చాలా బాగుంటుంది.

ఈ మునగాకుకి క్రిమి సంహారక శక్తితో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని.. ఏడాదిలో ఒక్కసారైనా ఈ మునగాకుని ఏ రూపంలో తిన్నా ఆరోగ్యానికి మంచిదని అని కడుపులోని క్రిములు నశిస్తాయని పెద్దలు చెబుతారు.

 

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..