Monsoon Snacks: వర్షాకాలంలో ఆరోగ్యానికి మేలు చేసే స్నాక్స్… ఎలా తీసుకోవాలంటే..

|

Jul 21, 2021 | 8:08 PM

వర్షాకాలంలో చాలా వరకు వేడి సమోసాలు, పకోడిలు తినడానికి ఆసక్తి చూపిస్తుంటారు. వర్షంలో రోడ్డు పక్కన లభించే టీ, స్నాక్స్ తినేస్తుంటారు.

Monsoon Snacks: వర్షాకాలంలో ఆరోగ్యానికి మేలు చేసే స్నాక్స్...  ఎలా తీసుకోవాలంటే..
Monsoon Snacks
Follow us on

వర్షాకాలంలో చాలా వరకు వేడి సమోసాలు, పకోడిలు తినడానికి ఆసక్తి చూపిస్తుంటారు. వర్షంలో రోడ్డు పక్కన లభించే టీ, స్నాక్స్ తినేస్తుంటారు. దీంతో ఈ సీజన్‏లో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే బయట లభించే ఆహారాన్ని తీసుకోవడం వలన ఫుల్ పాయిజన్… ఫ్లూ, జ్వరం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ కాలంలో ఆరోగ్యంగా ఉండే ఫుడ్ తీసుకోవాలని.. ముఖ్యంగా వేయించిన పదార్థాలను దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. టీ, పకోడిలు, సమోసాలు బరువు పెరుగెందుకు సహయపడతాయి. కానీ తక్కువ కేలరీలు కలిగి..బరువు తగ్గడమే కాకుండా.. ఆరోగ్యానికి మేలు చేసే స్నాక్స్ పాప్ కార్న్. ఎలా చేయాలో తెలుసుకుందామా.

ఈ వర్షాకాలంలో ఎక్కువగా దొరికే పండ్లను తీసుకోవడం ఉత్తమం. వాటన్నింటిని ముక్కులుగా కట్ చేసి..అందులో కాస్త నిమ్మరసం కలిపి తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉండడమే కాకుండా.. శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. ఆ తర్వాత మొక్కజొన్న కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో షుగర్ ఉండడం వలన బరువు తగ్గెందుకు సహాయపడదు. కానీ ఇది వర్షాకాలంలో ఎక్కువగా లభిస్తుంది. ఈ కాలంలో మొక్కజొన్నను తినడం వలన ఎన్నో లాభాలు ఉన్నాయి. వీటిని మసాలా దినుసులు, వెన్నతో కలిపి వేయించి తీసుకోవాలి.

పఫెలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్, ఖనిజాలు, పోషకాలు అధికంగా ఉంటాయి.. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. జలుబు, శ్వాస సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఒక గిన్నెలో పఫ్డ్ రైస్, కొత్తి మీర పెస్ట్, కారం, టమోటా, ఉల్లిపాయలు కలిపి దీనిని రెడీ చేసుకోవాలి. పాప్ కార్న్.. చాలా మంది ఇష్టపడుతుంటారు. ఇందులో ప్రోటిన్, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి.

100 గ్రాముల డబుల్ టోన్డ్ పెరుగు తీసుకుని.. అందులో 5 గ్రాముల సీజనల్ ఫ్రూట్స్, బెర్రీలు కలిపి తీసుకోవాలి. పెరుగులో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.

Also Read: Sekhar Master: శేఖర్ మాస్టర్ అభిమానులకు షాకిచ్చిన గూగుల్.. ఆ విషయంలో పెద్ద పొరపాటే..

Ranga Maarthaanda: ‘రంగమార్తాండ’ గురించి కీలక అప్‌డేట్.. అనుమానాలు పటాపంచలు చేసిన క్రియేటివ్ డైరెక్టర్

Anasuya: వర్షంపై కవిత్వాన్ని షేర్ చేసిన అనసూయ.. ఆ అందమైన కవిత్వం ఎవరు రాసిందో తెలుసా..