Fish Eggs Benefits: చేప గుడ్లతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..! తెలిస్తే అస్సలు వదలరు..

|

Sep 07, 2021 | 12:16 PM

Fish Eggs Benefits: చేప గుడ్ల గురించి చాలా మందికి తెలియదు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఎన్నో వ్యాధులను నయం చేసే సుగుణాలు ఇందులో ఉన్నాయి.

Fish Eggs Benefits: చేప గుడ్లతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..! తెలిస్తే అస్సలు వదలరు..
Fish Eggs Benefits
Follow us on

Fish Eggs Benefits: చేప గుడ్ల గురించి చాలా మందికి తెలియదు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఎన్నో వ్యాధులను నయం చేసే సుగుణాలు ఇందులో ఉన్నాయి. చేపల వలె చేప గుడ్ల ద్వారా కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చాలాసార్లు మనం మార్కెట్‌కి వెళ్లి చేపలను కొని వారితో కట్ చేయిస్తుంటాం. ఒక్కోసారి కొన్ని చేపల కడుపులో చేప గుడ్లు ఉంటాయి. వాటిని మనం తెలియక చెత్త అనుకొని పడేయమంటాం. కానీ వాటిలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. చేపల వలె వాటిని కూడా కూర వండుకోవచ్చు. చేప గుడ్ల గురించి మరిన్ని విషయాలను తెలుసుకుందాం.

చేప గుడ్లలో విటమిన్ ‌‌- ఎ అధికంగా ఉంటుంది. ఇది కంటి చూపును కాపాడటంలో తోడ్పడుతుంది. రెగ్యులర్‌గా చేప గుడ్లు తింటే రక్తంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది. రక్తం శుద్ధి అవుతుంది. రక్తహీనతతో (Anemia) బాధపడేవారికి చేపగుడ్లు దివ్యౌషధంలా ప‌నిచేస్తాయి. చేప గుడ్లలో విటమిన్ ‌‌- డి ఉంటుంది. ఇది మీ ఎముకలు, దంతాలను బలంగా త‌యారు చేస్తుంది. గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.
మతిమరపు ఉన్నవారు క్రమం తప్పకుండా చేప గుడ్లను తింటే స‌మ‌స్య నుంచి త్వర‌గా ప‌రిష్కారం ల‌భించే అవ‌కాశం ఉంటుంది. అధిక ర‌క్తపోటు స‌మ‌స్య ఉన్నవారికి చేప గుడ్లు చాలా మంచివి.

పల్లెటూరులో ఉండేవాళ్లకు, సముద్ర ప్రాంతాల్లో నివసించే వారికి వీడి గురించి ఎక్కువగా తెలిసి ఉంటుంది. వీటిని వండటంలో కూడా వారు నిష్ణాతులు. ఇకనుంచి మార్కెట్‌ వెళ్లినప్పుడు చేపలతో పాటు చేప గుడ్లపై కూడా ఓ లుక్కేయండి. ఆధునిక జీవితంలో ఇలాంటి పోషకాలు ఉన్న ఆహారాన్ని తినడం చాలా ముఖ్యం. అప్పుడే వచ్చే కొత్త కొత్త వైరస్‌లను తట్టుకోవడానికి శరీరం సిద్దంగా ఉంటుంది.

Prabhas: ప్రభాస్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం అడిషన్స్.. యంగ్ రెబల్ స్టార్‏తో నటించే అందుకొండిలా..

Thieves Viral Video: గన్స్‌తో షాపులోకి దొంగలు ఎంట్రీ..!కట్ చేస్తే సీన్ అదుర్స్.. వైరల్ అవుతున్న వీడియో..

Viral Photos: ప్రపంచంలో ఈ 5 చెట్లు అత్యంత పొడవైనవి..! ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే..?